
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు (రేస్‌గుర్రం ఫేమ్ విలన్), బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రమేశ్ శుక్లా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే, కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్టు రవికిషన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు.
తన అన్న ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారని అయినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే సోదురుడు కూడా మరణించడం తమ కుటుంబానికి తీరని లోటని, ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన అన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. కాగా, రవికిషన్ యూపీలోని గోరఖ్పుర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. రమేశ్ పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
दुःखद समाचार..!
आज मेरे बड़े भाई श्री रमेश शुक्ला जी का एम्स हॉस्पिटल दिल्ली में दुःखद निधन हो गया है l
बहुत कोशिश किया पर बड़े भईया को नहीं बचा सका, पिता जी के बाद बड़े भाई का जाना पीड़ा दायक
महादेव आपको अपने श्री चरणों में स्थान प्रदान करें l
कोटि कोटि नमन l
ओम शांति 🙏 pic.twitter.com/1EZr2vD6Hs
— Ravi Kishan (@ravikishann) March 30, 2022
Comments
Please login to add a commentAdd a comment