Actor Ravi Kishan's Daughter Wants To Join In Defence Through Agnipath Scheme - Sakshi
Sakshi News home page

Ravi Kishan: అగ్నిపథ్‌లో చేరిన రవికిషన్ కూతురు.. నెటిజన్ల ప్రశంసలు!

Published Tue, Jun 27 2023 5:13 PM | Last Updated on Tue, Jun 27 2023 8:58 PM

Actor Ravi Kishan Joined In Defence Through Agnipath Scheme - Sakshi

భోజ్‌పురి నటుడు రవికిషన్ తెలుగువారికి పరిచయం చేయాల్సిన పనిలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. రేసుగుర్రం చిత్రంలో మద్దాలి శివారెడ్డిగా ప్రతినాయకుని పాత్రలో మెప్పించాడు. హిందీలో 'ఫిర్ హేరా ఫేరీ', 'వెల్‌కమ్ టు సజ్జన్‌పూర్', 'ముక్కాబాజ్', 'కిక్ 2' చిత్రాల్లోనూ నటించారు. అయితే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన రవికిషన్ గోరఖ్‌పూర్ ఎంపీగా గెలిచారు. అయితే ఆయన కూతురు ఇషితా శుక్లా ఆర్మీలో చేరడం పట్ల పలువురు అభినందనలు తెలుపుతున్నారు. సోషల్ మీడియా వేదికగా తండ్రి, కూతురిని అభినందిస్తున్నారు. 

(ఇది చదవండి: ఆ సూపర్‌ హిట్‌ సినిమాకు పార్ట్‌-2 ఉంది: వెట్రిమారన్‌)

ప్రస్తుతం రవి కిషన్ కూతురు ఇషిత వయసు 21 ఏళ్లు కాగా.. నెటిజన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మీ ఇద్దరిని చూసి మేము గర్విస్తున్నాము.. ఇతరులకు ఆదర్శంగా నిలిచారు అంటూ పొగుడుతున్నారు. కాగా.. ఈ ఏడాది జనవరి 26న జరిగిన పరేడ్‌లోనూ రవికిషన్ పాల్గొన్నారు. ఈ విషయాన్ని రవికిషన్‌ ట్వీట్‌ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఎంతో కష్టపడి పనిచేసిన తన కూతురిని చూసి గర్వపడుతున్నానని ట్వీట్‌లో పేర్కొన్నారు.

( ఇది చదవండి:ట్రైలర్ బాగుంది కానీ ఆ బూతు డైలాగ్ ఎందుకు పెట్టారో? )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement