race guram
-
నటుడు రవికిషన్ ఇంట తీవ్ర విషాదం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ నటుడు (రేస్గుర్రం ఫేమ్ విలన్), బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన సోదరుడు రమేశ్ శుక్లా ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయితే, కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూసినట్టు రవికిషన్ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తన అన్న ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారని అయినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తండ్రి చనిపోయిన కొన్ని రోజులకే సోదురుడు కూడా మరణించడం తమ కుటుంబానికి తీరని లోటని, ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తన అన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆయనకు ముగ్గురు సోదరులు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. కాగా, రవికిషన్ యూపీలోని గోరఖ్‌పుర్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలుపొందిన విషయం తెలిసిందే. రమేశ్ పట్ల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందిస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. दुःखद समाचार..! आज मेरे बड़े भाई श्री रमेश शुक्ला जी का एम्स हॉस्पिटल दिल्ली में दुःखद निधन हो गया है l बहुत कोशिश किया पर बड़े भईया को नहीं बचा सका, पिता जी के बाद बड़े भाई का जाना पीड़ा दायक महादेव आपको अपने श्री चरणों में स्थान प्रदान करें l कोटि कोटि नमन l ओम शांति 🙏 pic.twitter.com/1EZr2vD6Hs — Ravi Kishan (@ravikishann) March 30, 2022 -
రేసుకు గుర్రం రెడీ!
వేగం, లక్ష్యాన్ని సాధించాలనే కసి, అత్యున్నత స్థానంలో నిలబడాలనే తపన... ఈ లక్షణాలన్నీ ఉన్న ఓ కత్తి లాంటి కుర్రాడి కథతో రూపొందిన చిత్రమే ‘రేసుగుర్రం’. టైటిల్‌కి తగ్గట్టే యమ ఫోర్స్‌గా ఉంటుందట ఇందులో అల్లు అర్జున్ నటన. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన ఈ చిత్రం నటునిగా బన్నీని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుందని సమాచారం. బన్నీ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ యువతరాన్ని కట్టిపడేస్తుందని, హాలీవుడ్ సినిమాలను తలపించే కథ, ‘రేసుగుర్రం’లా ఉరుకులు పెట్టించే కథనం ఈ చిత్రానికి ప్రధాన బలాలని చిత్రం వర్గాలు అంటున్నాయి. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ని సొంతం చేసుకున్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న నిర్మాతలు విడుదల చేయనున్నారు. శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కిక్ ’ శ్యామ్, సలోని కీలక పాత్రలు పోషించారు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్, రవికిషన్, సుహాసిని, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, ముఖేశ్‌రుషి, ఆశిష్ విద్యార్థి ఇందులో ఇతర పాత్ర ధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, కూర్పు: గౌతంరాజు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్. -
‘రేసుగుర్రం’ రెడీ
ప్రత్యర్థి గుండె వేగాన్ని పెంచే డెక్కల చప్పుడు.. గాలికి, మెరుపుకు సవాలు విసిరే వేగం.. వేసే ప్రతి అడుగులో లక్ష్య సాధన.. వెరసి ‘రేసుగుర్రం’. ఈ లక్షణాలన్నీ ఓ కుర్రాడికి ఉంటే.. సమస్యే లేదు.. వాడే విజేత. అయితే... నూటికో కోటికో ఒక్కడికే ఇలాంటి గుణాలుంటాయి. ఆ ఒక్కడి కథతో తెరకెక్కుతోన్న చిత్రమే ‘రేసుగుర్రం’. అల్లు అర్జున్ శక్తిమంతంగా కనిపించబోతున్న చిత్రమిది. హాలీవుడ్ చిత్రాలను తలపించేలా సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బన్నీ కెరీర్లోనే మేలిమలుపుగా ఈ చిత్రం నిలుస్తుదని యూనిట్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ వారంలోనే విడుదల చేసి, ఈ నెల 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కిక్’శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, సుహాసిని, రవికిషన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్‌విద్యార్థి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, కూర్పు: గౌతంరాజు. -
భాగ్యనగర్‌లో రేసుగుర్రం పరుగులు
కొన్ని టైటిల్స్ హీరోల ఇమేజ్‌కి టైలర్‌మేడ్‌లా అనిపిస్తాయి. అలాంటి టైటిలే ‘రేసుగుర్రం’. చురుకుదనానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే అల్లు అర్జున్‌కి సరిగ్గా సరిపోయే టైటిల్ ఇది. ఈ చిత్ర కథ, కథనాలు, బన్నీ పాత్ర చిత్రణ టైటిల్‌కి తగ్గట్టుగా ఉంటాయని సమాచారం. ఇందులో బన్నీ పాత్ర చాలా కొత్తగా ఉంటుందని వినికిడి. శ్రుతిహాసన్ ఇందులో కథానాయిక. ఇప్పటికే ‘గబ్బర్‌సింగ్’, ‘ఎవడు’ చిత్రాలతో ఇద్దరు మెగా హీరోలనూ కవర్ చేసేసిన శ్రుతి... ఈ సినిమాలో బన్నీతో జతకట్టి మెగాహీరోలందరితో నటించిన క్రెడిట్ కొట్టేశారు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లోని ఫిలింనగర్లో గల ఓ ప్రైవేటు భవంతిలో జరుగుతోంది. అక్కడ బన్నీ, ‘కిక్’శ్యామ్, జయప్రకాష్‌రెడ్డి, తనికెళ్ల భరణి తదితరులపై దర్శకుడు సురేందర్‌రెడ్డి కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెల 17 వరకూ ఈ షెడ్యూల్ జరుగుతుంది. సురేందర్‌రెడ్డి మార్క్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రానికి నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), డా.కె.వెంకటేశ్వరరావు నిర్మాతలు. సలోని, సుహాసినీ మణిరత్నం, కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, ముఖేష్‌రుషి, ఆశిష్ విద్యార్థి, రఘుబాబు, నవాజ్ సోనూ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: మనోజ్ పరమహంస, కూర్పు: గౌతమ్‌రాజు, నిర్మాణం: శ్రీలక్ష్మినరసింహా ప్రొడక్షన్స్.