‘రేసుగుర్రం’ రెడీ | ready to release for 'race gurram' | Sakshi
Sakshi News home page

‘రేసుగుర్రం’ రెడీ

Published Fri, Feb 28 2014 10:52 PM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

‘రేసుగుర్రం’ రెడీ

‘రేసుగుర్రం’ రెడీ

ప్రత్యర్థి గుండె వేగాన్ని పెంచే డెక్కల చప్పుడు.. గాలికి, మెరుపుకు సవాలు విసిరే వేగం.. వేసే ప్రతి అడుగులో లక్ష్య సాధన.. వెరసి ‘రేసుగుర్రం’. ఈ లక్షణాలన్నీ ఓ కుర్రాడికి ఉంటే.. సమస్యే లేదు..

 

వాడే విజేత. అయితే... నూటికో కోటికో ఒక్కడికే ఇలాంటి గుణాలుంటాయి. ఆ ఒక్కడి కథతో తెరకెక్కుతోన్న చిత్రమే ‘రేసుగుర్రం’. అల్లు అర్జున్ శక్తిమంతంగా కనిపించబోతున్న చిత్రమిది. హాలీవుడ్  చిత్రాలను తలపించేలా సురేందర్‌రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. బన్నీ కెరీర్‌లోనే మేలిమలుపుగా ఈ చిత్రం నిలుస్తుదని యూనిట్ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

 

నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), డా.కె. వెంకటేశ్వరరావు ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను ఈ వారంలోనే విడుదల చేసి, ఈ నెల 28న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కిక్’శ్యామ్, సలోని ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. కోట శ్రీనివాసరావు, ప్రకాష్‌రాజ్, సుహాసిని, రవికిషన్, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్, రఘుబాబు, ముఖేష్‌రుషి, ఆశిష్‌విద్యార్థి ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: వక్కంతం వంశీ, కెమెరా: మనోజ్ పరమహంస, కూర్పు: గౌతంరాజు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement