రేసుకు గుర్రం రెడీ! | race gurram movie ready for release! | Sakshi
Sakshi News home page

రేసుకు గుర్రం రెడీ!

Published Sat, Mar 29 2014 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 5:20 AM

రేసుకు గుర్రం రెడీ!

రేసుకు గుర్రం రెడీ!

వేగం, లక్ష్యాన్ని సాధించాలనే కసి, అత్యున్నత స్థానంలో నిలబడాలనే తపన... ఈ లక్షణాలన్నీ ఉన్న ఓ కత్తి లాంటి కుర్రాడి కథతో రూపొందిన చిత్రమే ‘రేసుగుర్రం’. టైటిల్‌కి తగ్గట్టే యమ ఫోర్స్‌గా ఉంటుందట ఇందులో అల్లు అర్జున్ నటన. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్(బుజ్జి), కె.వెంకటేశ్వరరావు కలిసి నిర్మించిన ఈ చిత్రం నటునిగా బన్నీని మరో స్థాయికి తీసుకెళ్లే సినిమా అవుతుందని సమాచారం.
 
 
 బన్నీ ఎనర్జిటిక్ పెర్‌ఫార్మెన్స్ యువతరాన్ని కట్టిపడేస్తుందని, హాలీవుడ్ సినిమాలను తలపించే కథ, ‘రేసుగుర్రం’లా ఉరుకులు పెట్టించే కథనం ఈ చిత్రానికి ప్రధాన బలాలని చిత్రం వర్గాలు అంటున్నాయి. తమన్ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకున్నాయి.
 
 అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 11న నిర్మాతలు విడుదల చేయనున్నారు. శ్రుతీహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ‘కిక్ ’ శ్యామ్, సలోని కీలక పాత్రలు పోషించారు. కోట శ్రీనివాసరావు, ప్రకాశ్‌రాజ్, రవికిషన్, సుహాసిని, బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాశ్‌రెడ్డి, ముఖేశ్‌రుషి, ఆశిష్ విద్యార్థి ఇందులో ఇతర పాత్ర ధారులు. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ పరమహంస, కూర్పు: గౌతంరాజు, నిర్మాణం: శ్రీలక్ష్మీనరసింహా ప్రొడక్షన్స్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement