ఒక వీఆర్వోతో పాటు మరికొందరు కూడా..
అసైన్డ్ భూమి అక్రమ రిజిస్ట్రేషన్ వ్యవహారమే కారణం
నల్లగొండ క్రైం/నిడమనూరు: అసైన్డ్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారనే అభియోగంతో నల్లగొండ జిల్లాలో ము గ్గురు తహసీల్దార్లు, ఒక వీఆర్వోను టాస్‌్కఫోర్స్ పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. నిడమనూరు మండలం తుమ్మడం రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూములను మార్తివారిగూడేనికి చెందిన మార్తి సురేందర్‌రెడ్డి, అతని కుటుంబసభ్యులు అక్రమ మార్గాల్లో పట్టా చేయించుకున్నారని, అదే గ్రామానికి చెందిన మార్తి వెంకట్‌రెడ్డి 2022లో విజిలెన్స్ అధికారులు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని సురేందర్‌రెడ్డితోపాటు ఆయన భార్య, తల్లిపేరుతో పట్టా చేశారని, అంతేగాక వీఆర్వో వద్ద అసిస్టెంట్‌గా పనిచేసే వ్యక్తి కూడా తన పేరుతోపాటు భార్య, తండ్రి పేరుతో ఏడు ఎకరాలు పట్టా చేయించుకున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఆ ఫిర్యాదుపై అప్పుడే రంగంలోకి దిగిన పోలీసులు, అధికార పార్టీ నేతల హస్తం ఉండడంతో విచారణ ముందుకు సాగించలేకపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరోసారి పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో అక్రమంగా పట్టా చేసుకున్న వారిలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఒక తహసీల్దార్ ఫైల్ పె ట్టగా, మరొక తహసీల్దార్ ప్రభుత్వానికి, అసైన్డ్ కమిటీకి ఫా ర్వర్డ్ చేయగా, ఇంకో తహసీల్దార్ పట్టా జారీ చేసినట్టు తెలిసింది.
ఈ విషయంపై హైకోర్టులో కేసు వేయగా, కోర్టు ఆదేశాలను ఎవరూ పట్టించుకోలేదు. దీంతో కేసు వేసిన వ్యక్తు లు మళ్లీ కోర్టును ఆశ్రయించడంతో.. కోర్టు ధిక్కరణ కింద అధికారులు, పోలీసులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పోలీసులు బుధవారం ఆయా రెవెన్యూ అధికారులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment