అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్.. ఓటీటీ రిలీజ్‌లో బిగ్‌ ట్విస్ట్! | Akhil Agent Movie OTT Release: Court Orders To Stop The Streaming | Sakshi
Sakshi News home page

Akhil Agent Movie: ఏజెంట్‌ ఓటీటీ రిలీజ్.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్!

Published Thu, Sep 28 2023 12:22 PM | Last Updated on Thu, Sep 28 2023 1:00 PM

Akhil Agent Movie OTT Release: Court Orders To Stop The Streaming - Sakshi

అక్కినేని అఖిల్‌ ఇటీవలే నటించిన చిత్రం ఏజెంట్‌. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్‌గా నటించింది. స్పై థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్‌ రెడ్డి డైరెక్ట్‌ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్‌ కెరీర్‌లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్‌ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్‌ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్‌ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. అయితే ఇటీవల ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటూ ఇటీవలే మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

(ఇది చదవండి: ఓటీటీలో అఖిల్‌ 'ఏజెంట్‌' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్‌ అప్పుడే)

అయితే ఈ విషయంలో ఈ మూవీకి మరో షాక్ తగిలింది. అయితే వైజాగ్‌కు చెందిన డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీశ్,) ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్  హక్కుల విషయంలో అన్యాయం జరిగిందని కోర్టును ఆశ్రయించారు. నిర్మాత అనిల్ సుంకర తనని మోసం చేశారని పేర్కొంటూ సతీశ్  హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఆయన వాదనలు విన్న న్యాయస్థానం ఈ నెల 29న ఏజెంట్ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కాకుండా కోర్టు స్టే విధించింది. దీంతో ఎంతో ఆశగా ఎదురుచూసిన అఖిల్ ఫ్యాన్స్‌కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే పలుసార్లు వాయిదా  పడిన ఏజెంట్ మూవీ ఇప్పుడైన వస్తోందని ఆశించిన అభిమానులు నిరాశకు గురవుతున్నారు. 

(ఇది చదవండి: పెళ్లికి ముందు ఆ నిర్మాత ప్రేమలో స్నేహ.. నటుడి సంచలన వ్యాఖ్యలు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement