ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ని అభినందిస్తూ భారత సంతతి బ్రిటిష్ ఎంపీ వీరేంద్ర శర్మ లేఖ రాశారు. ఆ లేఖలో.. యూపీలో శాంతిని నెలకొల్పేలా.. మీరు చేసిన ప్రయత్నాలు, సాధించిన విజయాలకు గాను మీకు అభినందనలు అని రాశారు. ఈ సందర్భంగా రచయిత శంతను గుప్తా తనకు ప్రెజెంట్ చేసిన గ్రాఫిక్ నవల "అజయ్ టు యోగి ఆదిత్యనాథ్" గురించి కూడా ఆ లేఖలో ప్రస్తావించారు. అంతేగాదు హౌస్ ఆఫ్‌కామన్స్‌లో రచయిత శంతను గుప్తా ఉత్తరప్రదేశ్ అభివృద్ధి ప్రయాణం గురించి తనతో చర్చించినట్లు కూడా లేఖలో తెలిపారు.
రచయిత శంతను హౌస్‌ఆఫ కామన్స్‌లో మాట్లాడుతూ....ప్రపంచ వ్యాప్తంగా బ్రాంబ్ ఇండియాను ప్రధాని నరేంద్ర మోదీ సృష్టించారని, దాని కారణంగానే నేడు ప్రపంచవ్యాప్తంగా భారతీయులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్లే భారత్ బలమైన బ్రాండ్‌గా మారింది. అంతేగాదు ఉత్తరప్రదేశ్ యోగి ప్రభుత్వ హయాంలో అగ్రశ్రేణి పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. అలాగే ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్‌లో 2017లో 14వ స్థానంలో ఉన్న యూపీ కాస్తా 2కి ఎగబాకింది.
అంతేగాదు ఉత్తరప్రదేశ్‌లోని ఎక్స్‌ప్రెస్‌వే, కొత్త విమానాశ్రయాలు, బలమైన శాంత్రి భద్రతలు గురించి కూడా రచయిత శంతను భారత సంతతి బ్రిటిష్ ఎంపీతో చెప్పుకొచ్చారు. ఇంకా రచయిత శంతను వీరేంద్ర శర్మతో యోగి ఆదిత్యనాద్ తండ్రి గురించి కూడా ఓ ఆసక్తికరమైన విషయాన్ని కూడా పంచుకున్నారు కూడా. ఈ నేపథ్యంలోనే యోగి ఆధిత్యానాథ్ సాధించిన విజయాలు, ఆయన గొప్పతనం గురించి తెలుసుకున్న బ్రిటిష్ ఎంపీ వీరేంద్ర శర్మ ఆయన్ని అభినందిస్తూ లేఖ రాశారు.
Comments
Please login to add a commentAdd a comment