సందీప్ సరసన నిత్యా..? | Nithya menon playing female lead in sandhip kishans new film | Sakshi
Sakshi News home page

సందీప్ సరసన నిత్యా..?

Published Thu, Nov 12 2015 9:23 AM | Last Updated on Sun, Sep 3 2017 12:23 PM

సందీప్ సరసన నిత్యా..?

సందీప్ సరసన నిత్యా..?

ఆసక్తికరమైన కథలను ఎంచుకుంటూ యంగ్ జనరేషన్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ యంగ్ హీరో 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైన ఈ సినిమాకు ఇంత వరకు హీరోయిన్ను మాత్రం ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం సందీప్ కిషన్తో పాటు విలన్గా నటిస్తున్న రవికిషన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ను సంప్రదించారన్న టాక్ వినిపిస్తోంది. బడా బడా స్టార్ హీరోల సరసన వరుస సూపర్ హిట్స్లో నటిస్తున్న ఈ భామ, సందీప్ సరసన హీరోయిన్గా నటించడానికి అంగీరిస్తుందా లేదా చూడాలి. అయితే నిత్యామీనన్కు ఈ సినిమా కథ చాలా బాగా నచ్చిందని, సినిమాలో నటించటం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు.

లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయిత రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అంజి రెడ్డి నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement