sandhip kishan
-
శ్రీ విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ కలెక్షన్స్.. ఈ కథ అతని వద్దకు ఎలా వచ్చిందంటే?
శ్రీ విష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన 'సామజవరగమన' మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదట ఎటువంటి బజ్ లేకుండా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు టాలీవుడ్లో మంచి టాక్ అందుకుని సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. కలెక్షన్ల పరంగానూ రోజు రోజుకూ పెంచుకుంటూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 30.1 కోట్లు వసూలు చేసి శ్రీవిష్ణు కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. (ఇదీ చదవండి: హీరో విజయ్ నన్ను బెదిరిస్తున్నాడు.. అరెస్ట్ చేయండి: ప్రియ) ఈ విజయం అతని కెరీర్లో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది. ఇప్పటికే 'సమాజవరగమన' చూసిన అల్లు అర్జున్,రవితేజ వంటి సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో ఈ సినిమాకు మరింత పబ్లిసిటీ దక్కింది. క్లాస్ స్టోరీతో పాటు కామెడీ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా వైపు ఫ్యామిలీ ఆడియెన్స్ అంతా క్యూ కట్టేలా చేస్తోంది. 'సామజవరగమన'ను రిజెక్ట్ చేసిన హీరో దర్శకుడు రామ్ అబ్బరాజు 'సామజవరగమన' కథ కోసం హీరోగా శ్రీ విష్ణును అనుకోలేదట. రామ్ అబ్బరాజు గతంలో వివాహభోజనంబు సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ సినిమాకు సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ పరిచయంతో సందీప్ కోసం కథను రెడీ చేశాడట రామ్. కానీ అప్పటికే మైఖేల్ సినిమాతో సందీప్ బిజీగా ఉండటంతో ఈ సినిమాలోకి శ్రీ విష్ణు ఎంట్రీ ఇచ్చేశాడని టాక్. (ఇదీ చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి) -
ఆ కోరిక నెరవేరింది
తమిళసినిమా: తెలుగులో చిత్రం చేయాలన్న కోరిక కేరాఫ్ సూర్యతో నెరవేరిందని వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు సుశీంద్రన్ సంతోషం వ్యక్తం చేశారు. వెన్నెల కబడ్డీ కుళు చిత్రం ద్వారా ఈయన దర్శకుడిగా పరిచయమయ్యారు. కార్తీ హీరోగా తెరకెక్కించిన నాన్ మహాన్ అల్ల చిత్రం తెలుగులో నాపేరు శివ పేరుతో అనువాదం అయ్యి రెండు భాషల్లోనూ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి తాను తెలుగులో చిత్రం చేయాలని కోరుకున్నా అది నెరవేరలేదని దర్శకుడు సుశీంద్రన్ సోమవారం విలేకరులతో వెల్లడించారు. ఈయన తాజాగా దర్శకత్వం వహించిన చిత్రాన్ని తమిళంలో నెంజిల్ తుణివిరుందాల్, తెలుగులో కేరాఫ్ సూర్య పేరుతో తెరక్కెంచారు. నటుడు సందీప్‌కిషన్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ వివరాలను దర్శకుడు తెలుపుతూ దీపావళి పండుగ అంటే తకు చాలా ఇష్టం అన్నారు. 1991లో రజనీకాంత్ నటించిన దళపతి చిత్రాన్ని చూసేందుకు స్నేహితునితో కలిసి సైకిల్ తొక్కుకుంటూ వెళ్లి, ఇంట్లో దెబ్బలు తిన్నా కూడా తొలిసారిగా దీపావళి పండగను ఎంజాయ్ చేశానన్నారు. ఆ తరువాత చెన్నైకి రావడంతో కొన్నేళ్లు దీపావళికి దూరంగా ఉన్నానని, మళ్లీ తన తొలి చిత్రం వెన్నెలా కబడ్డీ కుళు చిత్ర విడుదల సందర్భంగా 2009లో దీపావళి వేడుకను జరుపుకున్నాన్నారు. అప్పటి నుంచి వరసగా దీపావళిని కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకుంటున్నాన్నారు. పాండినాడు చిత్రం 2013లో దీపావళి సందర్భంగా విడుదలై తనకు ఘన విజయాన్ని అందించిందన్నారు. కాగా తాజా చిత్రం నెంజిల్ తుణివిరుందాల్ను ఈ దీపావళికి విడదల చేయాలనుకున్నా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందన్నారు. ఈ చిత్రం తప్పక విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందన్నారు. ప్రస్తుతం ఎంజీనా అనే చిత్రం నిర్మాణంలో ఉందని సుశీంద్రన్ తెలిపారు. -
కష్టాలు..సంతోషాలు..!
సందీప్‌కిషన్ హీరోగా సుశీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కేరాఫ్ సూర్య’. మెహరీన్ కథానాయిక. చక్రి చిగురుపాటి నిర్మాత. డి.ఇమాన్ స్వరకర్త. షూటింగ్ కంప్లీట్ అయిన ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదుల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో సందీప్ కిషన్ మాట్లాడుతూ– ‘‘టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. నిజజీవిత సంఘటనలకు దగ్గరగా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీస్ తీయడం సుశీంద్రన్ ప్రత్యేకత. ఆయన తీసిన ‘నా పేరు శివ’ చిత్రానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. వ్యక్తిగానూ ఆయన మంచి మనిషి. సుశీంద్రన్‌గారి సినిమాలో యాక్ట్ చేయడం ఆనందంగా ఉంది. ఇందులో నేను మిడిల్ క్లాస్ అబ్బాయి క్యారెక్టర్లో నటించాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ల కష్టాలు, సంతోషాలను ఈ సినిమాలో చూపించాం. కథను నమ్మి నిర్మాతలు సినిమా తీశారు. డి. ఇమాన్ మంచి సంగీతం ఇచ్చారు’’ అన్నారు. ‘‘తెలుగులో నా తొలి స్ట్రైట్మూవీ ఇది. ‘నా పేరు శివ’లో నటించిన ఐదుగురు గ్యాంగ్ ఈ సినిమాలో కూడా నటించారు. నిర్మాత బాగా సహకరించారు. సందీప్, మెహరీన్ బాగా నటించారు. సినిమా హిట్ అవుతుందనుకుంటున్నాం’’ అన్నారు సుశీంద్రన్. ‘‘సందీప్ కెరీర్లో ఈ చిత్రం హిట్ మూవీగా నిలుస్తుంది. మెహరీన్‌కు మంచి పేరు వస్తుంది. నవంబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. హీరోయిన్ మెహరీన్‌తో పాటు ఇతర చిత్రబృందం పాల్గొంది. -
సందీప్ సరసన నిత్యా..?
ఆసక్తికరమైన కథలను ఎంచుకుంటూ యంగ్ జనరేషన్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో సందీప్ కిషన్. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ సినిమాల్లో కూడా నటిస్తున్న ఈ యంగ్ హీరో 'ఒక అమ్మాయి తప్ప' అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైన ఈ సినిమాకు ఇంత వరకు హీరోయిన్ను మాత్రం ఫైనల్ చేయలేదు. ప్రస్తుతం సందీప్ కిషన్‌తో పాటు విలన్‌గా నటిస్తున్న రవికిషన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్గా నటించడానికి స్టార్ హీరోయిన్ నిత్యామీనన్‌ను సంప్రదించారన్న టాక్ వినిపిస్తోంది. బడా బడా స్టార్ హీరోల సరసన వరుస సూపర్ హిట్స్‌లో నటిస్తున్న ఈ భామ, సందీప్ సరసన హీరోయిన్గా నటించడానికి అంగీరిస్తుందా లేదా చూడాలి. అయితే నిత్యామీనన్‌కు ఈ సినిమా కథ చాలా బాగా నచ్చిందని, సినిమాలో నటించటం ఖాయం అంటున్నారు చిత్రయూనిట్. ఇంత వరకు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ మాత్రం చేయలేదు. లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా ప్రముఖ రచయిత రాజసింహా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తుండగా, ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. అంజి రెడ్డి నిర్మాణ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.