Sree Vishnu Latest Hit Samajavaragamana Movie 7 Days World Wide Box Office Collections - Sakshi
Sakshi News home page

Samajavaragamana: శ్రీ విష్ణు కెరీర్‌లో బిగ్గెస్ట్‌ కలెక్షన్స్‌.. వారంలోనే ఇన్ని కోట్లా !

Published Fri, Jul 7 2023 1:15 PM | Last Updated on Fri, Jul 7 2023 1:56 PM

Samajavaragamana 7 Days World Wide Collections - Sakshi

శ్రీ విష్ణు హీరోగా రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో రూపొందిన  'సామజవరగమన' మంచి కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదట ఎటువంటి బజ్​ లేకుండా థియేటర్లలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు టాలీవుడ్​లో మంచి టాక్​ అందుకుని సెన్సేషన్​ క్రియేట్​ చేస్తోంది. కలెక్షన్ల పరంగానూ రోజు రోజుకూ పెంచుకుంటూ బాక్సాఫీస్​ వద్ద సందడి చేస్తోంది. మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 30.1 కోట్లు వసూలు చేసి శ్రీవిష్ణు కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.

(ఇదీ చదవండి: హీరో విజయ్‌ నన్ను బెదిరిస్తున్నాడు.. అరెస్ట్‌ చేయండి: ప్రియ)

ఈ విజయం అతని కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది. ఇప్పటికే  'సమాజవరగమన' చూసిన  అల్లు అర్జున్‌,రవితేజ వంటి సినీ ప్రముఖులు ఈ చిత్రాన్ని ప్రశంసలతో ముంచెత్తారు. దీంతో ఈ సినిమాకు మరింత పబ్లిసిటీ దక్కింది. క్లాస్​ స్టోరీతో పాటు కామెడీ ఎలిమెంట్స్​ ఎక్కువగా ఉండటంతో ఈ సినిమా వైపు ఫ్యామిలీ ఆడియెన్స్​ అంతా క్యూ కట్టేలా చేస్తోంది.

Samajavaragamana Movie 7 Days Collections

'సామజవరగమన'ను రిజెక్ట్‌ చేసిన హీరో

దర్శకుడు రామ్‌ అబ్బరాజు 'సామజవరగమన' కథ కోసం హీరోగా  శ్రీ విష్ణును అనుకోలేదట.  రామ్‌ అబ్బరాజు గతంలో వివాహభోజనంబు సినిమాను డైరెక్ట్‌ చేశాడు. ఆ సినిమాకు సందీప్ కిషన్ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ పరిచయంతో  సందీప్‌ కోసం కథను రెడీ చేశాడట రామ్‌. కానీ అప్పటికే మైఖేల్‌ సినిమాతో సందీప్‌ బిజీగా ఉండటంతో ఈ సినిమాలోకి శ్రీ విష్ణు ఎంట్రీ ఇచ్చేశాడని టాక్‌.

(ఇదీ చదవండి: ఆలయంలో ప్రేమికులు చేసిన పనిని సమర్థించిన నటి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement