ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది అస్సలు చెప్పలేం. అలా గతవారం నిఖిల్ పాన్ ఇండియా చిత్రం 'స్పై' రిలీజైంది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడింది. దీనితోపాటే థియేటర్లలోకి వచ్చిన 'సామజవరగమన' అనే చిన్న సినిమా అనుహ్యంగా హిట్ అయిపోయింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్మేస్తోంది. ఇంతకీ వసూళ్ల సంగతేంటి? లాభాలు ఎంత?
'సామజవరగమన' కథేంటి?
బాలు(శ్రీవిష్ణు) ఓ మల్టీప్లెక్స్ లో పనిచేస్తుంటాడు. తండ్రి ఉమా మహేశ్వరరావు(సీనియర్ నరేష్)ని డిగ్రీ పాస్ చేయించేందుకు తిప్పలు పడుతుంటాడు. ఎందుకంటే డిగ్రీ పాస్ అయితేనే తాత వీలునామా ప్రకారం కోట్ల రూపాయల ఆస్తి తండ్రికి దక్కుతుంది. అలా తండ్రితో పరీక్షలు రాయించే క్రమంలో సరయూ(రెబా మోనికా జాన్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ తన బావ పెళ్లి వల్ల బాలుకి చిక్కులు వస్తాయి. ఇంతకీ అవేంటి? బాలు-సరయూ ఒక్కటయ్యారా అనేదే స్టోరీ.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల‍్లోకి ఏకంగా 24 సినిమాలు)
కలెక్షన్స్ ఎంత?
ఈ సినిమా విడుదలకు రెండు మూడు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. అప్పుడే పాజిటివ్ టాక్ వచ్చింది. అయినాసరే విడుదలైన తొలిరోజు మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయి. కేవలం రూ.2.89 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. రెండో రోజుల్లో రూ.6.31 కోట్ల గ్రాస్ వచ్చింది. మూడోరోజుకి అయితే.. తొలి రెండురోజుల్లో వచ్చిన దానికి రెట్టింపు వసూళ్లు దక్కాయి. అంటే రూ.12.96 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. నాలుగురోజైన ఆదివారం దాదాపు రూ.7 కోట్ల వరకు వచ్చాయి. దీంతో మొత్తం కలిపి రూ.19.80 కోట్ల గ్రాస్ లభించినట్లు చిత్రబృందం ప్రకటించింది.
సక్సెస్‌కి కారణమేంటి?
ఓ చిన్న సినిమాకు అదీ కూడా ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన దానికి ఈ తరహా హిట్ టాక్ రావడం చాలా అరుదైన విషయం. 'సామజవరగమన' ఇది చేసి చూపించింది. కుటుంబమంతా కలిసి చూసేలా ఎంటర్ టైన్‌మెంట్ ఉండటం చాలా కలిసొచ్చింది. ముందు వారాల్లో వచ్చిన సినిమాలు పెద్దగా జనాల్ని అలరించకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అయింది. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.7 కోట్లు పెట్టుబడి పెట్టారని, ఈ పాటికే ఆ మొత్తం వచ్చేసినట్లు సమాచారం. ఇకపై వచ్చే కలెక్షన్ అంతా లాభామే!
BALU gadi family ni intha baga receive chesukunna prathi family ki 🙏🏻🙏🏻
— Sree Vishnu (@sreevishnuoffl) July 3, 2023
Couldn't have asked for a better reception than this to our #Samajavaragamana ❤️ pic.twitter.com/TIoH87l9ZA
(ఇదీ చదవండి: ఒక్క సినిమా.. 35 పాటలు.. అదే అసలు సమస్య!)
Comments
Please login to add a commentAdd a comment