Reba Monica John
-
తొలి సినిమాతోనే క్రేజ్.. ఇప్పుడు ఐటమ్ సాంగ్‌కు గ్రీన్ సిగ్నల్
తెలుగులో తొలి సినిమాతోనే ఈ బ్యూటీ టాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించింది. 'సామజవరగమన' సినిమా విడుదలైన తర్వాత ఒక్కసారిగా రెబా మోనికా జాన్ పేరు భారీగా పాపులర్ అయింది. అయితే, ఈ సినిమా తర్వాత ఆమె ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. కానీ, ఆమె తెలుగులో ఒక స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.నార్నె నితిన్,సంగీత్ శోభన్, రామ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'మ్యాడ్ స్క్వేర్'. కల్యాణ్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమాలో రెబా మోనికా జాన్ ఐటమ్ సాంగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం విడుదలై సూపర్ హిట్ అందుకున్న మ్యాడ్ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో భారీగా బజ్ క్రియేట్ అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ ప్రాజెక్ట్‌లోకి రెబా మోనికా ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెబా మోనికా జాన్ కన్నడలో ఎక్కువ సినిమాలు చేసింది. ఆపై తెలుగులో 'సామజవరగమన' ఛాన్స్ కొట్టేసి ఇక్కడ అభిమానులను సొంతం చేసుకుంది. విజయ్ నటించిన విజిల్ సినిమాలో ఈ బ్యూటీ నటనకు చాలామంది ఫిదా అయ్యారు. అందులో యాసిడ్దాడి బాధితురాలిగా ఆమె కనిపించింది. View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) -
సామజవరగమన హీరోయిన్‌కు సూపర్ ఛాన్స్?
‘సామజవరగమన’ సినిమాలో మంచి నటన కనబరచి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు హీరోయిన్ రెబ్బా మౌనికా జాన్ . అయితే ఈ బ్యూటీకి తాజాగా ఓ సూపర్ చాన్స్ లభించిందట. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీలోని ఓ కీలక పాత్రకు రెబ్బా మౌనికా జాన్ ను లోకేష్ కనగరాజ్ ఎంపిక చేశారని కోలీవుడ్ సమాచారం. రజనీకాంత్‌తో స్క్రీన్ స్పేస్ అంటే ఆమెకు కెరీర్ పరంగా ఓ సూపర్‌చాన్స్ కావొచ్చు. ప్రస్తుతం ‘కూలీ’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రజనీకాంత్, శ్రుతీహాసన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. సత్యరాజ్, మహేంద్రన్ ఇతర లీడ్ రోల్స్ చేస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. -
నీటిలో చేపలా మాళవిక పాప.. ఆ గ్లామర్ బ్యూటీ నో మొహమాటం!
తెల్లని చీరలో పాలరాతి శిల్పంలా చిత్రాంగద నీటిలో జలకన్యలా అందాల విందు చేస్తున్న మాళవిక భర్తతో కలిసి రొమాంటిక్ పోజులిచ్చిన దీపికా పదుకొణె క్యూట్ స్టిల్స్‌తో ఆహా అనిపిస్తున్న ఐశ్వర్య మేనన్ రెడ్ డ్రస్‌లో మెరిసిపోతున్న హీరోయిన్ సోనాక్షి సిన్హా విచిత్రమైన జడతో కనిపించిన హీరోయిన్ ఐశ్వర్య క్లాస్ లుక్‌తో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన రెబా మోనికా జాన్ పింక్ డ్రస్‌లో కాక రేపుతున్న హీరోయిన్ హనీరోజ్ View this post on Instagram A post shared by Chitrangda Singh (@chitrangda) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by दीपिका पादुकोण (@deepikapadukone) View this post on Instagram A post shared by ISWARYA MENON (@iswarya.menon) View this post on Instagram A post shared by Archana Ravichandran (@iam_archanaravichandran) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Aishwarya Lekshmi (@aishu__) View this post on Instagram A post shared by Honey Rose (@honeyroseinsta) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Shraddha ✶ (@shraddhakapoor) View this post on Instagram A post shared by Vedhika (@vedhika4u) View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Vani Bhojan (@vanibhojan_) -
స్టార్ హీరోతో డేటింగ్.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరోయిన్!
శ్రీవిష్ణు, రెబా మోనిక జంటగా నటించిన తాజా చిత్రం సామజవరగమన. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ చిత్రాన్ని అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్ మెంట్స్‌తో కలిసి హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించారు. జూన్ 29 న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం భారీగా వసూళ్లు రాబట్టింది. చిన్న సినిమా అయినా సరే సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ మలయాళీ ముద్దుగుమ్మ రెబా మోనిక. మలయాళీ అయినప్పటికీ తెలుగులోనూ చక్కగా మాట్లాడేస్తోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రెబా పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. (ఇది చదవండి: ఉన్నదంతా అమ్మేశారు, పీకల్లోతు అప్పులు.. కల్యాణి విడాకులకు కారణమిదే!) రెబా మోనిక మాట్లాడుతూ..' జెర్సీలో నానితో పనిచేసే అవకాశం వచ్చింది. కానీ నేను ఆయనకు కూడా అభిమానే. అల్లు అర్జున్‌కు నేను బిగ్ ఫ్యాన్. ఆయనకు మలయాళంలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అక్కడ ఆయను మల్లు అర్జున్ అని పిలుస్తారు. ఏ హీరోకు లేని క్రేజ్ అల్లు అర్జున్‌కు మాత్రమే ఉంది. అల్లు అర్జున్ మూవీస్‌కు మలయాళంలో చాలా క్రేజ్ ఉంది.' అని అన్నారు. తెలుగులోకి రాకముందు మిమ్మల్ని ఒక స్టార్ హీరో డేట్‌కు పిలిచారని ప్రశ్నించగా రెబా మోనిక స్పందించింది. హీరో డేట్‌కు పిలవడంపై మాట్లాడుతూ..' అవును.. అలా జరిగింది. డేట్‌కు పిలిచారు.. కానీ నేను వెళ్లానా? లేదా అన్నదే ముఖ్యం. కానీ నేను వెళ్లలేదు అంటూ చెప్పుకొచ్చింది భామ. డేట్‌కు వెళ్లడమనేది తప్పుగా భావించాల్సిన విషయం కాదని. ' అని అన్నారు. (ఇది చదవండి: విజయ్ బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాపై తమన్నా కామెంట్) -
ఈ పాప ఎవరో చెప్పుకోండి చూద్దాం? తెలుగులో ఫస్ట్ మూవీనే బ్లాక్ బస్టర్
తెలుగులో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ హిట్ కొట్టి నిలబడేది మాత్రం చాలా తక్కువ మంది. అలా ఈ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమా ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చింది. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. హీరోయిన్గా ఈమెకు తెలుగులో ఇదే తొలి చిత్రం. అయితేనేం గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మరి ఆమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా? ఎవరీ భామ? పైన ఫొటోలో ఉన్న పాప రెబా మోనికా జాన్. బెంగళూరులోని ఓ మలయాళ కుటుంబంలో పుట్టింది. మాస్టర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టి, పలు యాడ్స్‌లో నటించింది. 2016లో మలయాళంలో నివిన్ పౌలీ 'జాకోబింటే స్వర్గరాజ్యం' మూవీతో హీరోయిన్గా పరిచయమైంది. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టి శెభాష్ అనిపించుకుంది. దాదాపు నాలుగేళ్లపాటు తమిళ, మలయాళంలో వరసగా మూవీస్ చేసింది. గతేడాది జీమోన్ జోసెఫ్ అని వ్యక్తిని పెళ్లి చేసుకుంది. (ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!) తెలుగులోకి అలా! దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో విజిల్) సినిమాలో రెబా ఓ పాత్రలో నటించింది. యాసిడ్ దాడికి గురైనా సరే పట్టుదలగా మైదానంలో దిగి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తమ జట్టుని గెలిపించే రోల్లో ఆకట్టుకుంది ఈమెనే. ఇలా డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కొన్ని రోజుల ముందు ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజైన 'బూ' చిత్రంలో ఓ హీరోయిన్గా చేసింది. 'సామజవరగమన'.. ఈమెకు తెలుగులో ఫస్ట్ సినిమా. అయితేనేం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఆ హీరోయిన్‌తో బంధుత్వం? రెబా మోనికా జాన్‌కు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. వరసగా అక్క అవుతుందని గత కొన్నాళ్ల నుంచి టాక్ నడిచింది. అయితే వీళ్లిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. స్వయంగా ఈ విషయాన్ని రెబానే బయటపెట్టింది. 2016లో ఒకేసారి మలయాళంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చామని, దాంతో అప్పుడు ఓ వ్యక్తి రూమర్ క్రియేట్ చేశారని, అది అలానే ఉండిపోయిందని రెబా చెప్పుకొచ్చింది. దీనిపై తమకు ఎలాంటి సమస్య లేదని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్) -
బ్లాక్ ఔట్ఫిట్లో ఆ ఇద్దరు.. రెడ్‌తో రెచ్చగొట్టేలా రెబా
బ్లాక్ డ్రస్‌లో నభా నాటీ పోజులు మరింత హాట్‌గా 'సామజవరగమన' బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ బ్యూటీఫుల్ ట్రాన్స్పర్మేషన్ పిల్లిని హగ్ చేసుకుని మరీ సామ్ నిద్ర అవాక్కయ్యే పోజుల్లో 'సీతారామం' మృణాల్ కండలు చూపిస్తున్న హీరోయిన్ డింపుల్ మాళవిక శర్మ సైడ్ యాంగిల్ పోజులు గౌనులో హీరోయిన్ జెనీలియా విచిత్రమైన లుక్ లో హెబ్బా పటేల్ చీరలో చిట్టి ఫేమ్ ఫరియా టెంప్టింగ్ లుక్ View this post on Instagram A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Reba Monica John (@reba_john) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Dimple Hayathi (@dimplehayathi) View this post on Instagram A post shared by Malvika Sharma (@malvikasharmaofficial) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Hebah P (@ihebahp) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) View this post on Instagram A post shared by Sakshi Malik (@sakshimalikk) -
'సామజవరగమన' మూవీ హీరోయిన్ ‘రెబా మోనికా జాన్’(ఫోటోలు)
-
'మెగాస్టార్ చెయ్యి నా గుండెను తాకడంతోనే మా జాతకం మారిపోయింది'
'సామజ వరగమన’ కథని రామ్ చెప్పినప్పుడే ‘నువ్వు నాకు నచ్చావ్’ లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నిజమైంది. ‘సామజ వరగమన’ చూసి అందరూ హాయిగా నవ్వుతున్నారు' అని హీరో శ్రీ విష్ణు అన్నారు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన ఈ సినిమా జూన్ 29న విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌లో శ్రీ విష్ణు మాట్లాడుతూ– 'ఈ సినిమా ట్రైలర్ లాంచ్ టైమ్‌లో చిరంజీవిగారి చేయి నా గుండె మీద ఎప్పుడైతే ఆటోగ్రాఫ్‌గా పడిందో అప్పటి నుంచి ఈ సినిమా జాతకం మారిపోయింది’ అన్నారు. ‘‘నవ్వించడం అంత తేలిక కాదు. ఆ విషయంలో వెంకటేశ్‌గారు సీనియర్ మోస్ట్. ఆ ప్లేస్‌కి ఇప్పుడు శ్రీవిష్ణు యాప్ట్’’ అన్నారు అనిల్ సుంకర. ‘‘ఐదు రోజులుగా నిద్రపట్టడం లేదు. అంత సంతోషంగా ఉంది’’ అన్నారు రాజేష్ దండా. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాని ఎంజాయ్ చేస్తున్నారు’’ అన్నారు రామ్ అబ్బరాజు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్ రమేష్, విజయ్ కనకమేడల, వశిష్ట, నటుడు వీకే నరేష్, రెబా మోనికా జాన్ మాట్లాడారు. -
చిన్న సినిమా.. పెద్ద సక్సెస్.. కోట్లకు కోట్లు!
ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది అస్సలు చెప్పలేం. అలా గతవారం నిఖిల్ పాన్ ఇండియా చిత్రం 'స్పై' రిలీజైంది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో తడబడింది. దీనితోపాటే థియేటర్లలోకి వచ్చిన 'సామజవరగమన' అనే చిన్న సినిమా అనుహ్యంగా హిట్ అయిపోయింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్‌గా తీసిన ఈ చిత్రం.. బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కుమ్మేస్తోంది. ఇంతకీ వసూళ్ల సంగతేంటి? లాభాలు ఎంత? 'సామజవరగమన' కథేంటి? బాలు(శ్రీవిష్ణు) ఓ మల్టీప్లెక్స్ లో పనిచేస్తుంటాడు. తండ్రి ఉమా మహేశ్వరరావు(సీనియర్ నరేష్)ని డిగ్రీ పాస్ చేయించేందుకు తిప్పలు పడుతుంటాడు. ఎందుకంటే డిగ్రీ పాస్ అయితేనే తాత వీలునామా ప్రకారం కోట్ల రూపాయల ఆస్తి తండ్రికి దక్కుతుంది. అలా తండ్రితో పరీక్షలు రాయించే క్రమంలో సరయూ(రెబా మోనికా జాన్) పరిచయమవుతుంది. ఆమెతో ప్రేమలో పడతాడు. కానీ తన బావ పెళ్లి వల్ల బాలుకి చిక్కులు వస్తాయి. ఇంతకీ అవేంటి? బాలు-సరయూ ఒక్కటయ్యారా అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు) కలెక్షన్స్ ఎంత? ఈ సినిమా విడుదలకు రెండు మూడు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. అప్పుడే పాజిటివ్ టాక్ వచ్చింది. అయినాసరే విడుదలైన తొలిరోజు మోస్తరు ఓపెనింగ్స్ వచ్చాయి. కేవలం రూ.2.89 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చింది. రెండో రోజుల్లో రూ.6.31 కోట్ల గ్రాస్ వచ్చింది. మూడోరోజుకి అయితే.. తొలి రెండురోజుల్లో వచ్చిన దానికి రెట్టింపు వసూళ్లు దక్కాయి. అంటే రూ.12.96 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. నాలుగురోజైన ఆదివారం దాదాపు రూ.7 కోట్ల వరకు వచ్చాయి. దీంతో మొత్తం కలిపి రూ.19.80 కోట్ల గ్రాస్ లభించినట్లు చిత్రబృందం ప్రకటించింది. సక్సెస్‌కి కారణమేంటి? ఓ చిన్న సినిమాకు అదీ కూడా ఎలాంటి అంచనాల్లేకుండా విడుదలైన దానికి ఈ తరహా హిట్ టాక్ రావడం చాలా అరుదైన విషయం. 'సామజవరగమన' ఇది చేసి చూపించింది. కుటుంబమంతా కలిసి చూసేలా ఎంటర్ టైన్మెంట్ ఉండటం చాలా కలిసొచ్చింది. ముందు వారాల్లో వచ్చిన సినిమాలు పెద్దగా జనాల్ని అలరించకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అయింది. ఓవరాల్‌గా ఈ సినిమాకు రూ.7 కోట్లు పెట్టుబడి పెట్టారని, ఈ పాటికే ఆ మొత్తం వచ్చేసినట్లు సమాచారం. ఇకపై వచ్చే కలెక్షన్ అంతా లాభామే! BALU gadi family ni intha baga receive chesukunna prathi family ki 🙏🏻🙏🏻 Couldn't have asked for a better reception than this to our #Samajavaragamana ❤️ pic.twitter.com/TIoH87l9ZA — Sree Vishnu (@sreevishnuoffl) July 3, 2023 (ఇదీ చదవండి: ఒక్క సినిమా.. 35 పాటలు.. అదే అసలు సమస్య!) -
'సామజవరగమన' బ్యూటీ ఆ తెలుగు హీరోయిన్‌కి అక్క?
తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్లలో చాలా కొద్దిమంది మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షిస్తారు. కరెక్ట్‌గా చెప్పాలంటే మనసు దోచుకుంటారు. అలా ఇప్పుడు శ్రీవిష్ణు 'సామజవరగమన'లో నటించిన రెబా మోనికా జాన్.. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. అయితే తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఓ హీరోయిన్‌కు ఈమె కజిన్(అక్క) అని అంటున్నారు. అసలు ఇంతకీ ఇందులో నిజమెంత? రెబా ఏం చెప్పింది? (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) ఎవరీ భామ? బెంగళూరులోని ఓ మలయాళ కుటుంబంలో పుట్టిన రెబా మోనికా జాన్.. మాస్టర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే మోడలింగ్ చేసిన రెబా.. పలు యాడ్స్ లోనూ నటించింది. 2016లో మలయాళంలో నివిన్ పౌలీ హీరోగా నటించిన 'జాకోబింటే స్వర్గరాజ్యం' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రంతో హిట్ కొట్టి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా దాదాపు నాలుగేళ్లపాటు తమిళ, మలయాళంలో వరసగా మూవీస్ చేస్తూ వచ్చింది. గతేడాది జీమోన్ జోసెఫ్ అని వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుంది. తెలుగులోకి అలా! దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో విజిల్) సినిమాలో ఓ పాత్రలో నటించింది. యాసిడ్ దాడికి గురైనా సరే పట్టుదలగా మైదానంలో దిగి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జట్టుని గెలిపించే రోల్ లో కనిపించింది ఈమెనే. ఇలా డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మధ్యే నేరుగా ఓటీటీలో రిలీజైన 'బూ'లోనూ ఓ హీరోయిన్ గా చేసింది. అయితే 'సామజవరగమన'.. ఈమెకు తెలుగులో ఫస్ట్ సినిమా. ఇందులో క్యూట్ గా యాక్ట్ చేసి అలరించింది. ఆ హీరోయిన్‌తో బంధుత్వం? రెబా మోనికా జాన్‌కు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. వరసగా అక్క అవుతుందని గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ్లిద్దరికీ ఎలాంటి సంబంధం లేదు. స్వయంగా ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెబా చెప్పుకొచ్చింది. 2016లో ఒకేసారి మలయాళంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చామని, దాంతో అప్పుడు ఓ వ్యక్తి రూమర్ క్రియేట్ చేశారని, అది అలానే ఇప్పటికే కంటిన్యూ అవుతోందని రెబా చెప్పుకొచ్చింది. వికిపీడియా, గూగుల్ లోనూ అలానే చూపిస్తోందని.. అయితే దీనిపై తమకు ఎలాంటి సమస్య లేదని క్లారిటీ ఇచ్చింది. (ఇదీ చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?) -
'ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం'.. ఆసక్తిగా ట్రైలర్
టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు డైరెక్షన్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. (ఇది చదవండి: ప్రముఖ కమెడియన్ కుమారుడితో అర్జున్ కూతురు పెళ్లి) తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. అనంతరం చిత్ర బృందానికి మెగాస్టార్ బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు షర్ట్‌పై చిరంజీవి ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఫోటోలను ట్విటర్ షేర్ చేశారు హీరో. కాగా.. ట్రైలర్ చూస్తే పుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ నటుడు నరేశ్ ఈ చిత్రంలో శ్రీవిష్ణుకు తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతమందించారు. (ఇది చదవండి: సరికొత్తగా ‘సామజవరగమన’ ) Beyond blessed to have you launch our Trailer sir MEGASTAR @KChiruTweets 🤗 Forever indebted to you for taking out your time for us 🙏🏻 - https://t.co/6WsNyC9XzT #Samajavaragamana In cinemas from June 29 ✨ pic.twitter.com/VzIO1AwoXE — Sree Vishnu (@sreevishnuoffl) June 25, 2023 -
ఓ వింత సమస్య
‘ప్రేమించి పెళ్లి చేసుకునేవాళ్లకి క్యాస్ట్ ప్రాబ్లమ్ వస్తుంది లేకపో తే క్యాష్ ప్రాబ్లమ్ వస్తుంది.. ప్రపంచంలో ఎవరికీ రాని వింత ప్రాబ్లమ్ నాకు వచ్చిందేంట్రా’ అని హీరో శ్రీవిష్ణు చెప్పే డైలాగ్‌లతో ‘సామజవరగమన’ గ్లింప్స్ రిలీజైంది. శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ జంటగా రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన చిత్రం ‘సామజవరగమన’. అనిల్ సుంకర సగర్వ సమర్పణలో రాజేష్ దండా నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు బర్త్‌డే (ఫిబ్రవరి 29) సందర్భంగా గ్లింప్స్‌ని రిలీజ్ చేశారు. ఈ వేసవిలో రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి. -
వేసవిలో సామజవరగమన
శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్ అబ్బరాజు డైరెక్టర్. అనిల్ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సామజవరగమన’ అనే టైటిల్ ప్రకటించి, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ‘‘ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందు తున్న చిత్రం ఇది. షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ ఏడాది వేసవిలో మా సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి. -
రొమాంటిక్ లవ్ కామెడీగా ‘ఆకాశ్ వాణి’ వెబ్‌సిరీస్
తమిళ సినిమా: రొమాంటిక్ లవ్ కామెడీ ఇతివృత్తంతో రూపొందుతున్న వెబ్ సిరీస్ ఆకాశ్ వాణి. నటుడు కెవిన్, రెబాజాన్ జంటగా నటిస్తున్నారు. అట్లీ వద్ద శిష్యుడిగా పనిచేసిన ఎనోక్ ఏబుల్ దర్శకత్వం వహిస్తున్నారు. కస్తూబా మీడియా వర్క్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో శరత్ రవి, దీపక్ పరమేష్, విన్సా, అభితా వెంకట్ రామన్, కవితాలయ కృష్ణన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మెర్సల్, తేరి, బిగిల్ చిత్రాల కథా రచయిత రమణన్ గిరివాసన్ కథ అందిస్తున్నారు. దీనికి గుణ బాలసుబ్రమణియమ్ సంగీతాన్ని, శాంతికుమార్ చక్రవర్తి ఛాయాగ్రహణను అందిస్తున్నారు. సోమవారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. -
విజయ్‌తో రొమాన్స్
వర్దమాన నటి రెబా మోనికా సూపర్ ఛాన్స్‌ను దక్కించుకుందన్నది తాజా సమాచారం. శాండిల్‌వుడ్‌కు చెందిన ఈ బ్యూటీ మొదట మాలీవుడ్‌లో కథానాయకిగా పరిచయమైంది. అటు నుంచి కోలీవుడ్, ఆ తరువాత మాతృభాషలో అంటూ మొదట్లోనే బహుభాషా నటిగా పేరు సంపాందించుకుంది. ఆ మధ్య విడుదలైన జరుగండి చిత్రంతో నటుడు జయ్‌కు జంటగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు మరో తమిళ చిత్రంలోనూ నటిస్తోంది. దీనికి దావు అనే టైటిల్‌ను నిర్ణయించారు. సంతానం హీరోగా దిల్లుకు దుడ్డు, దానికి సీక్వెల్ వంటి సక్సెస్ఫుల్ చిత్రాలను తెరకెక్కించిన రాంబాలా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో చంద్రమౌళికి జంటగా రెబా మోనిక నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తి కావస్తోంది. ఇలాంటి సందర్భంగా రెబాను మరో లక్కీఛాన్స్ వరించిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అదే ఇళయదళపతితో రొమాన్స్‌తో చేయబోంతోందన్నదే ఆ సమాచారం. విజయ్ ప్రస్తుతం తన 63వ చిత్రంలో నటిస్తున్నారు. అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఏజీఎస్ సంస్థ నిర్మిస్తోంది.ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్న ఇందులో అగ్రనటి నయనతార కథానాయకిగా నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఇందులో మరో హీరోయిన్ ఉంటుందనే ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. అంతే కాదు ఆ పాత్రలో నటి కీర్తీసురేశ్ నటించనుందనే టాక్ వినిపించింది. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకు ఇప్పుడు రెబా మోనికను ఎంపిక చేశారట. విజయ్ చిత్రంలో మరో విశేషం ఏమిటంటే బాలీవుడ్ స్టార్ నటుడు జాకీష్రాఫ్ ప్రధాన పాత్రను పోషించడం. శరవేగంగా చిత్రీకరణను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దీపావళికి తెరపైకి తీసుకురావడానికి చిత్ర వర్గాలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రాజకీయాలు ఉండవని, ఇది పూర్తిగా వినోదభరితంగా ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. అయితే ఇందులో రాజకీయాలు ఉంటాయిగానీ, అవి వేరే విధంగా ఉంటాయన్నది తాజా సమాచారం. మొత్తం మీద విజయ్ 63వ చిత్రం ఇప్పటి నుంచే సంచలనం సృష్టిస్తోంది. -
జత కుదిరే
నెక్ట్స్ సినిమా కోసం నాని ‘జెర్సీ’ వేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ఆయనకు జతగా నటించే భామ ఎవరో తెలిసింది. ‘మళ్లీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని హీరోగా ‘జెర్సీ’ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై పీడీవీ ప్రసాద్, నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నాని క్రికెటర్‌గా కనిపించనున్నారు. ఆయన పాత్ర మూడు దశల్లో ఉండబోతోందట. ఈ సినిమాలో నానికి జోడీగా మలయాళ నటి రెబ్బా మోనికా జాన్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. నివీన్ పౌలీ ‘జాకోబింటే స్వర్గరాజ్యం’అనే మలయాళ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమయ్యారు రెబ్బా మోనిక. మలయాళం, తమిళంతో కలిపి నాలుగు సినిమాల్లో నటించిన మోనిక ‘జెర్సీ’ సినిమా ద్వారా తెలుగులో పరిచయం కానున్నారు. ఈ నెల 18న ముహూర్తం జరుపుకుని చివరి వారంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రానికి అనిరు«ద్ సంగీతం అందించనున్నారు. -
క్వాలిటీతో జరుగండి
తమిళసినిమా: జరుగండి చిత్రాన్ని మంచి క్వాలిటీతో చేశామనే నమ్మకం కలిగిందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన నితిన్ సత్య తెలిపారు. నటుడైన ఈయన నిర్మాతగా మారి బద్రి కస్తూరితో కలిసి నిర్మిస్తున్న చిత్రం జరుగండి. జై కథానాయకుడిగా నటిస్తున్న ఇందులో మలయాళ నటి రెబామోనికా జాన్ కథానాయకిగా పరిచయం అవుతోంది. రోబోశంకర్, డానీ అన్నె పోప్, ఇళవరసు, బోస్‌వెంకట్, అమిత్, జయకుమార్, జీఎం.కుమార్, నందా శరవణన్, కావ్య ముఖ్యపాత్రలను పోషిస్తున్న ఈ చిత్రం ద్వారా పిచ్చుమణి అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నారు. ఈయన దర్శకుడు వెంకట్‌ప్రభు వద్ద చెన్నై–28 చిత్రం నుంచి సహాయ దర్శకుడిగా పనిచేస్తూ వచ్చారట. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం పత్రికల వారికి ప్రదర్శించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత నితిన్‌సత్య మాట్లాడుతూ నటుడిగా అవకాశాలు వస్తున్నా, మంచి చిత్రాన్ని నిర్మించాలన్న ఆలోచనతో గత ఏడాది పాటు నిర్మాణం గురించి స్టడీ చేశానన్నారు. చిత్ర షూటింగ్‌ను 46 రోజుల్లో పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ చిత్ర దర్శకుడు చాలా కథలను తయారు చేసుకుని అవకాశాల కోసం పలు నిర్మాతలను కలిశారని, అలా తనకు చెప్పిన కథ నచ్చడంతో ఈ చిత్రం చేస్తున్నట్లు చెప్పారు. చిత్రానికి జరుగండి అనే తెలుగు టైటిల్ పెట్డడం గురించి అడిగిన ప్రశ్నకు నిజం చెప్పాలంటే ఈ దర్శకుడు ముందుగా వెంకట్‌ప్రభు బ్యానర్లో చిత్రం చేశాల్సి ఉందని, ఆ కథకు పెట్టిన ఈ టైటిల్‌ను వెంకట్‌ప్రభునే తమ చిత్రానికి బాగుంటుందని చెప్పారని అన్నారు. జరుగండి టైటిల్ యూనిక్‌గా ఉండడంతో, ఆసక్తిని కలిగించేదిగానూ, చిత్ర కథకు నప్పడంతో ఈ టైటిల్‌ను పెట్టినట్లు వివరించారు. అవసరం అయినప్పుడు తప్పుల్ని కూడా సమర్థించుకునే యువకుడి ఇతి వృత్తమే జరుగండి అని చెప్పారు. ఈ చిత్రం చాలా క్వాలిటీగా వచ్చిందన్న నమ్మకం తనకు కలిగిందన్నారు. త్వరలోనే చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించి జూలై చివరలో చిత్ర విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నితిన్ సత్య తెలిపారు. -
యువ నటికి వేధింపులు
సాక్షి, బెంగళూరు: తనను ప్రేమించాలంటూ మలయాళ నటి, మోడల్ రెబా మోనికా జాన్ వెంటపడుతున్న యువకుడిని సోమవారం మడివాళ పోలీసులు అరెస్ట్ చేశారు. కేరళకు చెందిన మోనికా జాన్ బెంగళూరులో నివాసముంటోంది. ప్రతి ఆదివారం ఆమె చర్చికి వెళ్లేది. ఈ క్రమంలో ఎలక్ట్రానిక్సిటీకి చెందిన ఫ్రాంక్లిన్ విసిల్ అనే యువకుడికి ఆమె పరిచయమైంది. ఈ నేపథ్యంలో ఫ్రాంక్లిన్ తనను ప్రేమించాలని, పెళ్లిచేసుకోవాలని ఆమె వెంటబడుతున్నాడు. రోబోమోనికాజాన్ అందుకు నిరాకరించి ఆ యువకుడిని తీవ్రంగా హెచ్చరించింది. కానీ ఫ్రాంక్లిన్ ఆమె ఫోన్ నంబర్ తెలుసుకుని అశ్లీల మెసేజ్‌లు పంపేవాడు. దీనిపై మోనికా జాన్ రెండురోజుల క్రితం మడివాళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సోమవారం ఫ్రాంక్లిన్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354డీ కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచామని పోలీసు అధికారి తెలిపారు. తర్వాత బెయిల్‌పై అతడిని విడిచిపెట్టినట్టు వెల్లడించారు. గతేడాది విడుదలైన ‘జాకొబింతె స్వర్గరాజ్యం’ సినిమాతో మోనికా జాన్ మలయాళ సినిమా పరిశ్రమలో తెరంగ్రేటం చేసింది. ప్రస్తుతం ‘పిపిన్ చువతిలె ప్రణయం’ సినిమాలో నటిస్తోంది.