వేసవిలో సామజవరగమన | Sree Vishnu Samajavaragamana first look is out | Sakshi
Sakshi News home page

వేసవిలో సామజవరగమన

Published Wed, Feb 15 2023 2:09 AM | Last Updated on Wed, Feb 15 2023 2:09 AM

Sree Vishnu Samajavaragamana first look is out - Sakshi

శ్రీవిష్ణు, రెబా మోనికా జాన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్‌ అబ్బరాజు డైరెక్టర్‌. అనిల్‌ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘సామజవరగమన’ అనే టైటిల్‌ ప్రకటించి, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

‘‘ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందు తున్న చిత్రం ఇది. షూటింగ్‌ చివరి దశలో ఉంది. ఈ ఏడాది వేసవిలో మా సినిమాని విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: బాలాజీ గుత్తా, సంగీతం: గోపీ సుందర్, కెమెరా: రాంరెడ్డి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement