సామజవరగమన హీరోయిన్‌కు సూపర్‌ ఛాన్స్‌? | Coolie: Reba Monica John in Rajinikanth and Lokesh Kanagaraj film | Sakshi
Sakshi News home page

సామజవరగమన హీరోయిన్‌కు సూపర్‌ ఛాన్స్‌?

Published Mon, Jul 8 2024 3:50 AM | Last Updated on Mon, Jul 8 2024 10:55 AM

Coolie: Reba Monica John in Rajinikanth and Lokesh Kanagaraj film

‘సామజవరగమన’ సినిమాలో మంచి నటన కనబరచి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందారు హీరోయిన్  రెబ్బా మౌనికా జాన్ . అయితే ఈ బ్యూటీకి తాజాగా ఓ సూపర్‌ చాన్స్ లభించిందట. రజనీకాంత్‌ హీరోగా లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ‘కూలీ’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీలోని ఓ కీలక పాత్రకు రెబ్బా మౌనికా జాన్ ను లోకేష్‌ కనగరాజ్‌ ఎంపిక చేశారని కోలీవుడ్‌ సమాచారం. రజనీకాంత్‌తో  స్క్రీన్  స్పేస్‌ అంటే ఆమెకు కెరీర్‌ పరంగా ఓ సూపర్‌చాన్స్ కావొచ్చు. ప్రస్తుతం ‘కూలీ’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. రజనీకాంత్, శ్రుతీహాసన్ లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్‌. సత్యరాజ్, మహేంద్రన్  ఇతర లీడ్‌ రోల్స్‌ చేస్తున్న ఈ సినిమాకు అనిరు«ద్‌ సంగీతం అందిస్తున్నారు. సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement