వారం తర్వాత కూలీగా... | Sakshi
Sakshi News home page

వారం తర్వాత కూలీగా...

Published Tue, Jun 4 2024 12:02 AM

Rajinikanth Coolie to begin shooting from on June 10th

‘కూలీ’గా మారిపోవడానికి రెడీ అవుతున్నారు రజనీకాంత్‌. ఆయన హీరోగా లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న చిత్రం ‘కూలీ’. ఈ చిత్రంలో సత్యరాజ్, శోభన కీలక పాత్రల్లో నటించనున్నారని, కమల్‌హాసన్‌ ఓ అతిథి పాత్రలో కనిపిస్తారనే టాక్‌ కోలీవుడ్‌లో వినిపిస్తోంది. కాగా ‘కూలీ’ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఈ నెల 10న ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఆధ్యాత్మిక గురువు దగ్గర పేర్కొన్నారు రజనీకాంత్‌.

తొలి షెడ్యూల్‌ చిత్రీకరణ చెన్నైలో ప్రారంభం కానుందని తెలిసింది. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందించనున్న ‘కూలీ’ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అలాగే రజనీకాంత్‌ హీరోగా నటించిన మరో చిత్రం ‘వేట్టయాన్‌’. ‘జై భీమ్‌’ ఫేమ్‌ టీజే జ్ఞానవేల్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను అక్టోబరులో విడుదల చేయనున్నట్లుగా చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. కాగా ‘వేట్టయాన్‌’ను అక్టోబరు 10న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లుగా కూడా  రజనీకాంత్‌ పేర్కొన్నారు.  

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement