'ప్రతి అమ్మాయితో రాఖీ కట్టించుకుంటే పాపం'.. ఆసక్తిగా ట్రైలర్ | Young Hero Sree Vishnu Samajavaragamana Movie Trailer Out now | Sakshi
Sakshi News home page

Samajavaragamana Trailer: 'మిడిల్ క్లాస్‌లో పుట్టినందుకు బాధపడుతున్నా'.. ఆసక్తిగా ట్రైలర్!

Published Sun, Jun 25 2023 7:01 PM | Last Updated on Sun, Jun 25 2023 7:04 PM

Young Hero Sree Vishnu Samajavaragamana Movie Trailer Out now - Sakshi

టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’. రామ్‌ అబ్బరాజు డైరెక్షన్‌లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనిల్‌ సుంకర సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్‌ బ్యానర్‌పై రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టీజర్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ చేయగా.. ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

(ఇది చదవండి: ప్రముఖ కమెడియన్‌ కుమారుడితో అర్జున్‌ కూతురు పెళ్లి)

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుదల చేశారు. అనంతరం చిత్ర బృందానికి మెగాస్టార్ బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా విష్ణు షర్ట్‌పై చిరంజీవి ఆటోగ్రాఫ్ ఇచ్చిన ఫోటోలను ట్విటర్‌ షేర్ చేశారు హీరో. 

కాగా.. ట్రైలర్ చూస్తే పుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే  షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. సీనియర్ నటుడు నరేశ్ ఈ చిత్రంలో శ్రీవిష్ణుకు తండ్రి పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి గోపి సుందర్‌ సంగీతమందించారు. 

(ఇది చదవండి:  సరికొత్తగా ‘సామజవరగమన’ )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement