తెలుగులో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు. కానీ హిట్ కొట్టి నిలబడేది మాత్రం చాలా తక్కువ మంది. అలా ఈ మధ్య వచ్చిన ఓ తెలుగు సినిమా ఎలాంటి అంచనాల్లేకుండా థియేటర్లలోకి వచ్చింది. కట్ చేస్తే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. హీరోయిన్‌గా ఈమెకు తెలుగులో ఇదే తొలి చిత్రం. అయితేనేం గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది. మరి ఆమె ఎవరో కనిపెట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?
ఎవరీ భామ?
పైన ఫొటోలో ఉన్న పాప రెబా మోనికా జాన్. బెంగళూరులోని ఓ మలయాళ కుటుంబంలో పుట్టింది. మాస్టర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే మోడలింగ్‌లోకి అడుగుపెట్టి, పలు యాడ్స్‌లో నటించింది. 2016లో మలయాళంలో నివిన్ పౌలీ 'జాకోబింటే స్వర్గరాజ్యం' మూవీతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఫస్ట్ సినిమాతోనే హిట్ కొట్టి శెభాష్ అనిపించుకుంది. దాదాపు నాలుగేళ్లపాటు తమిళ, మలయాళంలో వరసగా మూవీస్ చేసింది. గతేడాది జీమోన్ జోసెఫ్ అని వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
(ఇదీ చదవండి: మెగా ప్రిన్సెన్స్ 'క్లీంకార' ఫస్ట్ వీడియో.. చరణ్ చేతుల్లో అలా!)
తెలుగులోకి అలా!
దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో విజిల్) సినిమాలో రెబా ఓ పాత్రలో నటించింది. యాసిడ్ దాడికి గురైనా సరే పట్టుదలగా మైదానంలో దిగి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో తమ జట్టుని గెలిపించే రోల్‌లో ఆకట్టుకుంది ఈమెనే. ఇలా డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కొన్ని రోజుల ముందు ఓటీటీలో డైరెక్ట్‌గా రిలీజైన 'బూ' చిత్రంలో ఓ హీరోయిన్‌గా చేసింది. 'సామజవరగమన'.. ఈమెకు తెలుగులో ఫస్ట్ సినిమా. అయితేనేం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది.
ఆ హీరోయిన్‌తో బంధుత్వం?
రెబా మోనికా జాన్‌కు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. వరసగా అక్క అవుతుందని గత కొన్నాళ్ల నుంచి టాక్ నడిచింది. అయితే వీళ‍్లిద‍్దరికీ ఎలాంటి సంబంధం లేదు. స్వయంగా ఈ విషయాన్ని రెబానే బయటపెట్టింది. 2016లో ఒకేసారి మలయాళంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చామని, దాంతో అప్పుడు ఓ వ్యక్తి రూమర్ క్రియేట్ చేశారని, అది అలానే ఉండిపోయిందని రెబా చెప్పుకొచ్చింది. దీనిపై తమకు ఎలాంటి సమస్య లేదని క్లారిటీ ఇచ్చింది.
(ఇదీ చదవండి: ఓటీటీల్లో ఈ శుక్రవారం 15 సినిమాలు రిలీజ్)
Comments
Please login to add a commentAdd a comment