తొలి సినిమాతోనే క్రేజ్‌.. ఇప్పుడు ఐటమ్‌ సాంగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ | Reba Monica John A Special Song Performance In Mad Square, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

తొలి సినిమాతోనే క్రేజ్‌ తెచ్చుకున్న బ్యూటీ.. ఐటమ్‌ సాంగ్‌కు గ్రీన్‌ సిగ్నల్‌

Nov 30 2024 6:50 AM | Updated on Nov 30 2024 10:42 AM

Reba Monica John A Special Song Performance In Mad Square

తెలుగులో తొలి సినిమాతోనే ఈ బ్యూటీ టాలీవుడ్‌ ప్రేక్షకులను మెప్పించింది. 'సామజవరగమన' సినిమా విడుదలైన తర్వాత ఒక్కసారిగా  రెబా మోనికా జాన్‌ పేరు భారీగా పాపులర్‌ అయింది. అయితే, ఈ సినిమా తర్వాత ఆమె ప్రాజెక్ట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు. కానీ, ఆమె తెలుగులో ఒక స్పెషల్‌ సాంగ్‌లో కనిపించనున్నట్లు నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి.

నార్నె నితిన్,సంగీత్‌ శోభన్, రామ్‌ ప్రధాన పాత్రలలో నటిస్తున్న చిత్రం 'మ్యాడ్‌ స్క్వేర్‌'.  కల్యాణ్‌ శంకర్‌ తెరకెక్కిస్తున్న సినిమాలో  రెబా మోనికా జాన్‌ ఐటమ్‌ సాంగ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఏడాది క్రితం విడుదలై సూపర్‌ హిట్‌ అందుకున్న మ్యాడ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం రానుంది. అందుకే ఈ ప్రాజెక్ట్‌పై సోషల్‌ మీడియాలో భారీగా బజ్‌ క్రియేట్‌ అయింది. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి కావచ్చిన ఈ ప్రాజెక్ట్‌లోకి  రెబా మోనికా ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. ఈ సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసేందుకు ఆమె గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది.

మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన రెబా మోనికా జాన్‌ కన్నడలో ఎక్కువ సినిమాలు చేసింది. ఆపై తెలుగులో 'సామజవరగమన' ఛాన్స్‌ కొట్టేసి ఇక్కడ అభిమానులను సొంతం చేసుకుంది. విజయ్‌ నటించిన విజిల్‌ సినిమాలో ఈ బ్యూటీ నటనకు చాలామంది ఫిదా అయ్యారు. అందులో యాసిడ్‌దాడి బాధితురాలిగా ఆమె కనిపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement