What Is The Relationship Between Reba Monica John And Anu Emmanuel, Deets Inside - Sakshi
Sakshi News home page

Reba Monica-Anu Emmanuel: హీరోయిన్ రెబా.. ఆ హీరోయిన్‌కి బంధువా? ఇదిగో క్లారిటీ

Published Sat, Jul 1 2023 10:36 AM | Last Updated on Sat, Jul 1 2023 11:08 AM

Reba Monica John Anu Emmanuel Relation - Sakshi

తెలుగులోకి ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉంటారు. వాళ్లలో చాలా కొద్దిమంది మాత్రమే ప్రేక్షకుల్ని ఆకర్షిస్తారు. కరెక్ట్‌గా చెప్పాలంటే మనసు దోచుకుంటారు. అలా ఇప్పుడు శ్రీవిష్ణు 'సామజవరగమన'లో నటించిన రెబా మోనికా జాన్.. తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుంది. అయితే తెలుగులో ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఓ హీరోయిన్‌కు ఈమె కజిన్(అక్క) అని అంటున్నారు. అసలు ఇంతకీ ఇందులో నిజమెంత? రెబా ఏం చెప్పింది?

(ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ)

ఎవరీ భామ?
బెంగళూరులోని ఓ మలయాళ కుటుంబంలో పుట్టిన రెబా మోనికా జాన్.. మాస్టర్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. చదువుతున్నప్పుడే మోడలింగ్ చేసిన రెబా.. పలు యాడ్స్ లోనూ నటించింది. 2016లో మలయాళంలో నివిన్ పౌలీ హీరోగా నటించిన 'జాకోబింటే స్వర్గరాజ్యం' సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రంతో హిట్ కొట్టి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా దాదాపు నాలుగేళ్లపాటు తమిళ, మలయాళంలో వరసగా మూవీస్ చేస్తూ వచ్చింది. గతేడాది జీమోన్ జోసెఫ్ అని వ్యక్తిని ఈమె పెళ్లి చేసుకుంది. 

తెలుగులోకి అలా!
దళపతి విజయ్ 'బిగిల్' (తెలుగులో విజిల్) సినిమాలో ఓ పాత్రలో నటించింది. యాసిడ్ దాడికి గురైనా సరే పట్టుదలగా మైదానంలో దిగి ఫుట్‌బాల్ మ్యాచ్‌లో జట్టుని గెలిపించే రోల్ లో కనిపించింది ఈమెనే. ఇలా డబ్బింగ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ మధ్యే నేరుగా ఓటీటీలో రిలీజైన 'బూ'లోనూ ఓ హీరోయిన్ గా చేసింది. అయితే 'సామజవరగమన'.. ఈమెకు తెలుగులో ఫస్ట్ సినిమా. ఇందులో క్యూట్ గా యాక్ట్ చేసి అలరించింది.

ఆ హీరోయిన్‌తో బంధుత్వం?
రెబా మోనికా జాన్‌కు హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్.. వరసగా అక్క అవుతుందని గత కొన్నాళ్ల నుంచి సోషల్ మీడియాలో తెగ మాట్లాడుకుంటున్నారు. నిజానికి వీళ‍్లిద‍్దరికీ ఎలాంటి సంబంధం లేదు. స్వయంగా ఈ విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో రెబా చెప్పుకొచ్చింది. 2016లో ఒకేసారి మలయాళంలో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చామని, దాంతో అప్పుడు ఓ వ్యక్తి రూమర్ క్రియేట్ చేశారని, అది అలానే ఇప్పటికే కంటిన్యూ అవుతోందని రెబా చెప్పుకొచ్చింది. వికిపీడియా, గూగుల్ లోనూ అలానే చూపిస్తోందని.. అయితే దీనిపై తమకు ఎలాంటి సమస్య లేదని క్లారిటీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: రామ్‌చరణ్-ఉపాసన కూతురు పేరుకి అర్థమేంటో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement