'మెగాస్టార్‌ చెయ్యి నా గుండెను తాకడంతోనే మా జాతకం మారిపోయింది' | Sree Vishnu Funny Speech At Samajavaragamana Success Meet | Sakshi
Sakshi News home page

'మెగాస్టార్‌ చెయ్యి నా గుండెను తాకడంతోనే మా జాతకం మారిపోయింది'

Jul 6 2023 4:45 AM | Updated on Jul 6 2023 9:28 AM

Sree Vishnu Funny Speech At Samajavaragamana Success Meet - Sakshi

శ్రీవిష్ణు, రాజేష్, రెబా మోనికా జాన్, అనిల్‌ సుంకర

'సామజ వరగమన’ కథని రామ్‌ చెప్పినప్పుడే ‘నువ్వు నాకు నచ్చావ్‌’ లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నిజమైంది. ‘సామజ వరగమన’ చూసి అందరూ హాయిగా నవ్వుతున్నారు' అని హీరో శ్రీ విష్ణు అన్నారు. రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీ విష్ణు, రెబా మోనికా జాన్‌ జంటగా రూపొందిన చిత్రం ‘సామజ వరగమన’. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేష్‌ దండా నిర్మించిన ఈ సినిమా జూన్‌ 29న విడుదలైంది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్ర యూనిట్‌ నిర్వహించిన సక్సెస్‌ సెలబ్రేషన్స్లో శ్రీ విష్ణు మాట్లాడుతూ– 'ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ టైమ్‌లో చిరంజీవిగారి చేయి నా గుండె మీద ఎప్పుడైతే ఆటోగ్రాఫ్‌గా పడిందో అప్పటి నుంచి ఈ సినిమా జాతకం మారిపోయింది’ అన్నారు.

‘‘నవ్వించడం అంత తేలిక కాదు. ఆ విషయంలో వెంకటేశ్‌గారు సీనియర్‌ మోస్ట్‌. ఆ ప్లేస్‌కి ఇప్పుడు శ్రీవిష్ణు యాప్ట్‌’’ అన్నారు అనిల్‌ సుంకర. ‘‘ఐదు రోజులుగా నిద్రపట్టడం లేదు. అంత సంతోషంగా ఉంది’’ అన్నారు రాజేష్‌ దండా. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులు మా సినిమాని ఎంజాయ్‌ చేస్తున్నారు’’ అన్నారు రామ్‌ అబ్బరాజు. ఈ కార్యక్రమంలో దర్శకులు మెహర్‌ రమేష్, విజయ్‌ కనకమేడల, వశిష్ట, నటుడు వీకే నరేష్, రెబా మోనికా జాన్‌ మాట్లాడారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement