ప్రముఖ నటుడి కూతురు మిస్సింగ్! | Ravi Kishan files police complaint for missing daughter | Sakshi
Sakshi News home page

ప్రముఖ నటుడి కూతురు మిస్సింగ్!

Published Fri, Oct 16 2015 4:38 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ప్రముఖ నటుడి కూతురు మిస్సింగ్! - Sakshi

ప్రముఖ నటుడి కూతురు మిస్సింగ్!

ముంబై: బాలీవుడ్, భోజ్పురి నటుడు రవికిషన్ 19 ఏళ్ల కూతురు కనిపించకుండాపోయారు. తన కూతురు కనిపించడం లేదని ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించి కొన్నిరోజుల కిందటే ఆయన బంగుర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని డీసీపీ (డిటెన్షన్) ధనుంజయ్ కులకర్ణి తెలిపారు. రవికిషన్ కూతురు ఇంటిని వదిలివెళ్లిపోవడం ఇది రెండోసారి. గతంలోనూ ఓసారి ఆమె తల్లిదండ్రులను వదిలేసి బయటకు వెళ్లిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

భోజ్పురి నటుడిగా ఫేమస్ అయిన రవికిషన్ ఇటీవల బిగ్బాస్, ఏక్ సే బడ్ఖర్ ఏక్- జల్వా సితారోంకా వంటి టీవీ కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా ఆదరణ పొందారు. అంతేకాకుండా తెలుగులో 'రేసుగుర్రం', 'కిక్-2' సినిమాల్లో విలన్ గా నటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement