గోరఖ్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు భారీగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపధ్యంలో గోరఖ్‌పూర్‌లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్కులోని జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
జూపార్కులోని సింహాలు, పులులు వంటి భారీకాయం కలిగిన జంతువులు చలిని తట్టుకోలేవు. అందుకే వాటికి చలి నుంచి రక్షణ కల్పించేందుకు అవి ఉండేచోట హీటర్లను అమర్చారు. ఈ హీటర్లు రాత్రి ఉష్ణోగ్రతను నియంత్రిస్తాయి. ఇదేవిధంగా శీతాకాలంలో జంతువులు ఆరోగ్యంగా ఉండేందుకు అధికారులు పలు చర్యలు చేపడుతున్నారు. పాముల వంటి సరీసృపాలకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు కంబళ్లను వినియోగిస్తున్నారు.
జింకలు, ఇతర చిన్న జంతువులకు చలి నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేక గడ్డిని వాటి ఎన్‌క్లోజర్‌లలో ఉంచుతున్నారు. తద్వారా అవి వెచ్చదనంలో ఉండేలా చూస్తున్నారు. జలచరాలకు వేడి నీటిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జూ పశువైద్యాధికారి యోగేష్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ ఈ శీతాకాలంలో ప్రతి జాతి జంతువుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేశామన్నారు.
ఇది కూడా చదవండి: ఎర్ర సముద్రంలో బోటు ప్రమాదం..16 మంది గల్లంతు
Comments
Please login to add a commentAdd a comment