
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రామ్‌లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి. ఈ సంతోష సమయంలో ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జూ నిర్వాహకులు పర్యాటకులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు.
గోరఖ్‌పూర్‌లోని షహీద్ అష్ఫాక్ ఉల్లా ఖాన్ జూలాజికల్ పార్క్ అధికారులు జనవరి 21న జూపార్కునకు వచ్చే వారిలో ఎవరిపేరులోనైనా ‘రాము’ అని ఉంటే వారికి ఎంట్రీ టిక్కెట్‌లో 50 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ఆఫర్ అందుకునేందుకు రాము అనే పేరు కలిగినవారు తమ అధికారిక గుర్తింపు కార్డును చూపించాల్సి ఉంటుంది.
జూలాజికల్ పార్క్ డైరెక్టర్ మనోజ్ కుమార్ శుక్లా మీడియాతో మాట్లాడుతూ జనవరి 21న ఒక రోజు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. జంతుప్రదర్శనశాలకు ప్రతీ సోమవారం సెలవు. అయితే రాబోయే సోమవారం నాడు జూపార్కు ప్రవేశద్వారం దగ్గర ప్రాణ ప్రతిష్ఠ వేడుక ప్రత్యక్ష ప్రసారాన్ని చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: అయోధ్యకు చేరుకున్న హనుమంతుడు..