Central Railway
-
సెంట్రల్ రైల్వే కారిడార్‌లో నిలిచిపోయిన రైళ్లు.. కారణం..
ముంబయి సెంట్రల్ రైల్వే ప్రధాన కారిడార్‌లో సోమవారం ఉదయం సిగ్నలింగ్ సమస్యల వల్ల రైలు సేవలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు. ఉదయం 9.16 గంటలకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల థానే రైల్వేస్టేషన్ పరిధిలో సబర్బన్ రైలు సేవలు నిలిచిపోయాయని సెంట్రల్ రైల్వే ప్రతినిధి పేర్కొన్నారు.థానే రైల్వేస్టేషన్ పరిధిలో సిగ్నల్ వైఫల్యం కారణంగా కళ్యాణ్(థానే), కుర్లా (ముంబయి) మధ్య సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. దాంతో ఇరుప్రాంతాలకు ప్రయాణిస్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అయితే ఉదయం 10.15 గంటలకు సిగ్నలింగ్ వ్యవస్థను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు.సెంట్రల్ రైల్వే ప్రధాన కారిడార్ సబర్బన్ పరిధి దక్షిణ ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి కళ్యాణ్ (థానే జిల్లా), ఖోపోలి (రాయ్‌గఢ్) వరకు విస్తరించి ఉంది. ఈ కారిడార్‌లో రోజూ లక్షల మంది ప్రయాణిస్తుంటారు. తాజాగా సుమారు గంటపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోవడం వల్ల ప్యాసింజర్లు ఇబ్బందులు పడ్డారు. -
నేటి నుంచి టాయ్‌ట్రైన్ పునఃప్రారంభం
సాక్షి, ముంబై: వర్షాకాలం నేపథ్యంలో సుమారు నాలుగు నెలలుగా నిలిచిపోయిన మాథేరన్ టాయ్‌ట్రైన్ (మినీ రైలు) సేవలు పునఃప్రారంభం కానున్నాయి. నవంబరు 4వ తేదీ శనివారం నుంచి ఈ ట్రైన్ ప్రారంభించేందుకు సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు నేరుల్–మాథేరాన్‌ల మధ్య అప్, డౌన్ రెండేసి చొప్పున.. మొత్తం నాలుగు సర్విసులు నడపనున్నారు. మరోవైపు మార్పులు చేసిన సమయాలనుసారం అమన్ లాడ్జీ–మాథేరాన్‌ల మధ్య అప్, డౌన్ మార్గాల్లో ఆరు చొప్పున మొత్తం 12 సర్విసులు, శని, ఆదివారాల్లో అదనంగా రెండేసి చొప్పున ప్రత్యేక టాయ్ రైళ్లను నడపనున్నారు. వర్షాకాలంలో నిలిపివేత.. సాధారణంగా ప్రతి సంవత్సరం వర్షా కాలం ప్రారంభం కాగానే టాయ్ ట్రైన్ సేవలు నిలిపివేస్తారు. ఆ తరువాత మళ్లీ అక్టోబరు 15వ తేదీ నుంచి సర్విసులు పునఃప్రారంభిస్తారు. కానీ ఈ సంవత్సరం కాస్త ఆలస్యంగా పునఃప్రారంభిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రధాన పర్యాటక ప్రాంతంలో ఒకటైన మాథేరాన్‌ను సందర్శించేందుకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. రైలులో కొండల మధ్య నుంచి ప్రయాణిస్తూ.. జలపాతాలు, పచ్చదనాన్ని చూసేందుకు ఇష్టపడతారు. నేరుల్ నుంచి 21 కి.మీ. దూరంలో కొండపై ఉన్న మాథేరాన్ చేరుకోవాలంటే రోడ్డు మార్గం కంటే మినీ రైలులో వెళ్లే ఆనందమే బాగుంటుందని పర్యాటకులు ఈ రైలు మార్గాన్ని ఎంచుకుంటుంటారు. రెలు మార్గం దాదాపు 90 శాతం కొండ అంచుల మీదుగా ఉంటుంది. అయితే వర్షాకాలంలో రైల్వే ట్రాక్ కిందున్న మట్టి కొట్టుకుపోవడం, కొండ చరియలు విరిగిపడడం, వంతెనలు కూలిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో ప్రయాణికుల భద్రతా దృష్ట్యా వర్షాకాలం ప్రారంభమైన నాటి నుంచి పూర్తయ్యేంత వరకు రైలు సేవలు పూర్తిగా నిలిపివేస్తారు. ఈ సమయంలో పర్యాటకులు రోడ్డు మార్గం మీదుగా మాథేరాన్ చేరుకోవల్సిందే. ఇప్పుడు టాయ్ ట్రైన్ సేవలు ప్రారంభమవుతుండటంతో పర్యాటకుల సంఖ్య పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
టీటీఈలకు బాడీ కెమెరాలు
న్యూఢిల్లీ: టికెట్ల తనిఖీలో పారదర్శకత, రైలు ప్రయాణికుల అనుచిత ప్రవర్తనను అరికట్టేందుకు టికెట్ తనిఖీ అధికారుల(టీటీఈ)లకు బాడీ కెమెరాలు అమర్చేందుకు రైల్వే శాఖ నిర్ణయించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్‌కు చెందిన 50 మంది టీటీలకు బాడీ కెమెరాలను సిద్ధం చేసింది. ఒక్కో కెమెరా ఖరీదు రూ.9 వేలు. ఇవి 20 గంటల ఫుటేజీని రికార్డు చేయగలుగుతాయి. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దేశమంతటా అమలు చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల సెంట్రల్ రైల్వేలో ఓ టీటీఈ మహిళా ప్రయాణికురాలి పట్ల అనుచితంగా ప్రవర్తించడంతో అధికారులు సస్పెండ్ చేశారు. ఇటువంటి ఘటనలను నివారించి, సిబ్బందిలో బాధ్యత పెంచేందుకు కూడా ఇవి సాయపడతాయని సెంట్రల్ రైల్వే పేర్కొంది. -
ఇలాగే వదిలేస్తే రేపు తాపీమేస్త్రిని పంపుతారు.. ఏపీ హైకోర్టు సీరియస్
సాక్షి, అమరావతి: వ్యక్తిగత హాజరుకు తామిచ్చిన ఆదేశాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం, విజయవాడ డివిజినల్ రైల్వే మేనేజర్ (డీఆర్ఎం) బేఖాతరు చేయడంపై హైకోర్టు మండిపడింది. వీరు హాజరుకాకుండా ఓ ఇంజనీర్ స్థాయి అధికారిని కోర్టుకు పంపడాన్ని తప్పుపట్టింది. ఇలాగే వదిలేస్తే రేపు తాపీమేస్త్రిని కూడా పంపుతారని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ కేసులో కోర్టు ఆదేశాల మేరకు విజయవాడ మునిసిపల్ కమిషనర్ ఇప్పటికే రెండుసార్లు హాజరయ్యారని, కమిషనర్ కన్నా తానే ఎక్కువని డీఆర్ఎం భావిస్తున్నట్లు ఉందని ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఆర్ఎం స్థాయి అధికారిని కూడా కోర్టుకు రప్పించలేకపోతే ఇక హైకోర్టు ఉండి ప్రయోజనం ఏముందని ప్రశ్నించింది. అటు జీఎం, ఇటు డీఆర్ఎంలకు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీచేసేందుకు సిద్ధమైంది. ఈ దశలో డిప్యూటీ సొలిసిటర్ జనరల్ (డీఎస్జీ) ఎన్.హరినాథ్.. వారెంట్ అవసరం లేదని, కోర్టుముందు హాజరయ్యేందుకు మరో అవకాశం ఇవ్వాలని పలుమార్లు అభ్యర్థించడంతో న్యాయస్థానం శాంతించింది. విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తూ ఆ రోజున జీఎం, డీఆర్ఎం స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. విజయవాడ మధురానగర్‌లోని అప్రోచ్‌రోడ్డు, రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ పనులను పూర్తిచేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ జవ్వాజి సూర్యానారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కె.ఎస్.మూర్తి వాదనలు వినిపిస్తూ.. కోర్టు జోక్యంతో పనులు పునఃప్రారంభం అయ్యాయని చెప్పారు. కోర్టుకు హాజరైన విజయవాడ మునిసిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ స్పందిస్తూ.. గడువు పెంచాలని కాంట్రాక్టర్ కోరారని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించామని తెలిపారు. ఈ సమయంలో రైల్వే జీఎం, డీఆర్ఎం కోర్టుకు హాజరుగాకపోవడంపై న్యాయమూర్తి మండిపడ్డారు. చదవండి: మూడు రోజులు వానలే.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం -
క్వీన్స్ ఎక్స్‌ప్రెస్
‘టికెట్ కలెక్టర్‌గా అమ్మాయి!’‘ట్రైన్ డ్రైవర్ అమ్మాయట!’‘ట్రైన్ గార్డ్‌గా అమ్మాయి!’... ఇలాంటి ఎన్నో ఆశ్చర్యాలను చూసింది కాలం.వివిధ హోదాల్లో తమ ప్రతిభను నిరూపించుకుంటున్న వారిని చూసి గర్వించింది కాలం.పరుగెత్తే కాలంలో ప్రత్యేక సందర్భాలు ఉంటాయి. ఆరోజు అచ్చంగా అలాంటిదే! కాస్త సరదాగా చెప్పుకోవాలంటే ‘కన్నుల పండగ’ అనేది పండగరోజు మాత్రమే రావాల్సిన అవసరం లేదు. ప్రత్యేక దినాలలో కూడా రావచ్చు. మొన్నటి మహిళా దినోత్సవం రోజు అలాంటి కన్నుల పండగ జరిగింది.సెంట్రల్ రైల్వే ముంబై డివిజన్ అందరూ మహిళలే ఉన్న బృందానికి ముంబై–పుణె దక్కన్ క్వీన్ ఎక్స్‌ప్రెస్‌ను నడిపించే బాధ్యతను అప్పగించింది. ఆరోజు ఆ ట్రైన్‌లోకి అడుగు పెడితే...డ్రైవర్ సీట్లో దర్జాగా కూర్చున్న లోకో–పైలట్ సురేఖ యాదవ్, టికెట్ కలెక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న నీతు, రుబినా, బీనా, సురక్ష, జెన్, దీపలతో రైలు కొత్తగా కనిపించింది.‘ఈరోజు నిజంగా మరిచిపోలేని రోజు. రైలును మహిళలే నడిపిస్తున్నారనే భావన గర్వంగా ఉంది. నా వృత్తిజీవితంలో ఇది గుర్తుంచుకోదగిన రోజు’ అంటుంది లోకో–పైలట్ సురేఖ యాదవ్. లోకో–పైలట్‌గా వృత్తిజీవితంలోకి అడుగుపెట్టడానికి ముందు...‘అది కఠినమైన వృత్తి. ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు. మహిళలకు ఎంతమాత్రం సరిపడని వృత్తి’ అని వెనక్కిలాగే ప్రయత్నం చేశారు.వాటిని పట్టించుకొని ఉంటే ఆమె పేరు పక్కన ‘లోకో–పైలట్’ అనే విశేషణం గర్వంగా కాలర్ ఎగరేసేది కాదు.‘ఇలాంటి రోజులు మళ్లీ మళ్లీ రావాలి’ అంటుంది అసిస్టెంట్–లోకో పైలట్ లీనా ఫ్రాన్సిస్. చిన్నప్పుడెప్పుడో ట్రైన్ ముందు బోగీలో గంభీరంగా కూర్చున్న డ్రైవర్‌ను చూసిన తరువాత తాను కూడా డ్రైవర్ కావాలనుకుంది.‘అలా కుదరదు. వీలు కాదు’ అనే మాటల మధ్య కూడా తన ఆశను కోల్పోలేదు.వృత్తిజీవితంలోకి అడుగుపెట్టిన తరువాత కూడా ‘హాయిగా ఫ్యాన్ కింద కూర్చొని చేసే ఉద్యోగం కాకుండా ఈ ఉద్యోగం ఎందుకు ఎంచుకున్నావు తల్లీ. ట్రైన్ యాక్సిడెంట్లు పెరుగుతున్నాయి. జాగ్రత్త’ అన్నవాళ్లు కూడా ఉన్నారు. శుభమా అని ఉద్యోగంలోకి అడుగు పెడుతుంటే ఈ మాటలేమిటని లీనా ఫ్రాన్సిస్ చిన్న బుచ్చుకోలేదు. ‘వాళ్లంతేలే!’ అని మాత్రమే అనుకుంది.సురేఖ యాదవ్ నుంచి రుబినా వరకు తమకు ఇష్టమైన వృత్తిలోకి రావడానికి ముందు ఎంతో కష్టపడి ఉంటారు. అందుకే ఈ బండి ప్రయాణికులనే కాదు వారి విజయాలను కూడా మోసుకుంటూ వెళ్లింది! -
35 ఏళ్ల ప్రస్థానం.. కారు, డ్రైవర్‌కి ఒకేసారి వీడ్కోలు
ముంబై సెంట్రల్: ఒకప్పుడు ధనవంతుల వా హనంగా, ప్రభుత్వ ఉన్నతాధికారుల వాహ నంగా ప్రసిద్ధి పొందిన అంబాసిడర్ కారుకు మధ్య రైల్వేకు చెందిన ముంబై విభాగం తుది వీడ్కోలు పలికింది. కారుతోపాటు ఆ కారును 35 సంవత్సరాలుగా నడిపిస్తున్న డ్రైవర్ కూడా ఉద్యోగం నుండి రిటైర్మెంట్ పొందారు. 35 సంవత్సరాలుగా మధ్య రైల్వేలో సేవలందిస్తూ, ఇంతకాలం మిగిలి ఉన్న ఏకైక అంబాసిడర్ వాహనాన్ని స్క్రాప్ చేయాలని అధికారులు నిర్ణయించిన నేపథ్యంలో ఆ కారును పూలదండలతో అలంకరించి, మేళతాళాలతో సాంప్రదాయబద్ధంగా వీడ్కోలు పలికారు. కరీరోడ్ డిపోలో జరిగిన ఈ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్న వారంతా భావోద్వేగానికి గురయ్యారు. సెంట్రల్ రైల్వే సేవలలో మిగిలిఉన్న ఒకేఒక్క ఈ అంబాసిడర్ కారు 1985, జనవరి 22న రైల్వే సేవల్లోకి ప్రవేశించింది. అప్పట్నుంచి ఈ కారుకు డ్రైవర్‌గా ముత్తు పాండీ నాడార్ కొనసాగుతూ, కారుతో పాటే ఆయన కూడా మంగళవారం రిటైర్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో హెల్మెట్ ఉంటేనే ప్రవేశం -
సౌత్ ఈస్టర్న్ రైల్వేలో 1785 అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన కోల్‌కతా ప్రధాన కేంద్రంగా ఉన్న సౌత్ ఈస్ట్రన్ రైల్వే... వివిధ వర్క్‌షాపుల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. (మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ► మొత్తం ఖాళీల సంఖ్య: 1785 ► ట్రేడులు: ఫిట్టర్, టర్నర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, మెకానిక్, మెషినిస్ట్, పెయింటర్, కేబుల్ జాయింటర్ తదితరాలు. ► ఖాళీలున్న వర్క్‌షాపులు: ఖరగ్‌పూర్ వర్క్‌షాప్, సిగ్నల్ అండ్ టెలికామ్ వర్క్‌షాప్, ట్రాక్ మెషిన్ తదితరాలు. ► అర్హత: పదో తరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి. ► వయసు: 01.01.2022 నాటికి 15–24ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: అకడెమిక్ మెరిట్ ప్రాతిపదికన ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 14.12.2021 ► వెబ్సైట్: https://www.rrcser.co.in -
రైల్వే అధికారుల పూజలు; విమర్శలు!
ముంబై : రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగకూడదని రైల్వే అధికారులు పూజలు నిర్వహించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహానగరంలోని కార్యాలయాలకు చేరుకునేందుకు దాదాపు అందరు ఉద్యోగులు రైలు మార్గాన్నే ఆశ్రయిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా లోకల్ రైళ్లలో తరచుగా సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ క్రమంలో మధ్య రైల్వే అధికారులు శనివారం తమ కార్యాలయంలో పూజలు నిర్వహించారు. ఉన్నతస్థాయి అధికారులు కూడా ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొనడం పట్ల విమర్శలు వ్యక్తమయ్యాయి. రైళ్లలో ఉన్న లోపాలు గుర్తించకుండా ఇలా పూజలు చేస్తే ఏం లాభం అంటూ పలువురు అధికారుల తీరును విమర్శించారు. కాగా ఈ వార్తలను రైల్వే అధికారులు కొట్టిపడేశారు. అప్పుడప్పుడు సాధారణంగా కార్యాలయాల్లో ఇలాంటి పూజలు నిర్వహిస్తామని తెలిపారు. ఇక ముంబై సెంట్రల్ లైన్ సబ్ అర్బన్ రైళ్లలో రోజుకు దాదాపు 20 లక్షల మంది ప్రయాణిస్తారు. అయితే సాంకేతిక తప్పిదాల కారణంగా ఈ ఒక్క ఏడాదే దాదాపు 400 రైళ్లు రద్దు కాగా... దాదాపు 3 వేల ట్రెయిన్లు ఆలస్యంగా గమ్యస్థానాలకు చేరాయి. దీంతో అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
ఫిర్యాదుల కంటే.. శుభాకాంక్షలే ఎక్కువ
న్యూఢిల్లీ : ఎవరికైనా హెల్ప్‌లైన్ నెంబర్లు దేనికి ఉపయోగపడతాయి అంటే తమ సమస్యను ఫిర్యాదు చేసుకునేందుకు. కానీ రైల్వేలో అలా కాదంట. రైల్వే వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లకు ఫిర్యాదుల కంటే శుభాకాంక్షల మెసేజ్‌లే ఎక్కువగా వస్తున్నాయట. వాట్సాప్ వాడకం విస్తృతంగా ఉండటంతో, రైల్వే ఇటీవలే వాట్సాప్ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రయాణికుల ముందుకు తీసుకొచ్చింది. ఈ నెంబర్లను అపరిశుభ్రతంగా ఉన్న స్టేషన్ పరిసరాలు, టాయిలెట్ల గురించి ప్రయాణికులు ఫిర్యాదు చేసేందుకు ప్రవేశపెట్టింది. డబ్ల్యూఆర్(వెస్ట్రన్ రైల్వే) కోసం 90044 99773 నెంబర్‌ను, సీఆర్(సెంట్రల్ రైల్వే)లోని ప్రయాణికులు 9987645307 నెంబర్‌కు ప్రయాణికులు తమ ఫిర్యాదులను వాట్సాప్ చేయొచ్చని తెలిపింది. అయితే ఈ రెండు నెంబర్లకు ప్రస్తుతం ఫిర్యాదుల కంటే ఎక్కువగా శుభాకాంక్షల మెసేజ్‌లు, గుడ్‌మార్నింగ్, గుడ్ ఈవ్నింగ్ వంటి టెక్ట్స్ మెసేజ్‌లే ఎక్కువగా వస్తున్నాయని రైల్వే అధికారులు చెప్పారు. అంతేకాక దేవతలతో కూడిన భక్తి సందేశాలు, వినోదభరిత హిందీ పద్యాల మెసేజ్‌లను తాము పొందుతున్నామని తెలిపారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్లకు అపరిశుభ్రతంగా ఉన్న పరిసరాల గురించి వారంలో కేవలం 25 ఫిర్యాదులే వచ్చాయని అధికారులు చెప్పారు. మిగతావన్నీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు, ఫార్వర్డ్ మెసేజ్‌లే ఉన్నాయన్నారు. సాధారణంగా అపరిశుభ్రతంగా ఉన్న రైల్వే పరిసరాల గురించి ప్రయాణికులు స్టేషన్ మాస్టర్‌కు ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అయితే రైల్వే అధికారులు తాజాగా ఈ హెల్ప్‌లైన్ నెంబర్లను ప్రవేశపెట్టారు. ఈ హెల్ప్‌లైన్ నెంబర్లతో ఫిర్యాదులపై వెంటనే చర్యలు తీసుకోవడానికి వీలవుతుందని రైల్వే అధికారులు చెప్పారు. అపరిశుభ్రతంగా ఉన్న పరిసరాలను, టాయిలెట్లను క్లిక్ చేసి, వాట్సాప్ నెంబర్‌కు సెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిర్యాదుల కోసం కంప్లయింట్స్ సెల్ ఒకటి ఉంటుంది. ఓ ప్రత్యేకమైన సిబ్బందిని దీని కోసమే నియమించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించి వెంటనే వారు చర్యలు తీసుకోనున్నారు. స్టేషన్ మాస్టర్లు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆఫీసులు ఎప్పడికప్పుడూ తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారని వెస్ట్రన్ రైల్వే అధికార ప్రతినిధి రవిందర్ భాకేర్ చెప్పారు. ఇప్పటి వరకు వెస్ట్రన్ రైల్వే వాట్సాప్ నెంబర్‌కు 23 ఫిర్యాదులు, సెంట్రల్ రైల్వే వాట్సాప్ నెంబర్ రెండు ఫిర్యాదులను పొందిందని ఓ రైల్వే అధికారి పేర్కొన్నారు. ఈ ఫిర్యాదులను కంట్రోల్ డిపార్ట్మెంట్కు పంపామని, వాటిని సంబంధిత స్టాఫ్‌కు(స్టేషన్ మాస్టర్) పంపిస్తామని తెలిపారు. అయితే ఆ ఫిర్యాదులను పరిష్కరించడానికి ప్రస్తుతమైతే ఎలాంటి డెడ్‌లైన్ లేదని, కానీ అదే రోజు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పారు. -
రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి భారీగా నిధులు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో రైల్వే శాఖ అభివృద్ధికి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రాజధాని నగరం హైదరాబాద్‌తో అన్ని ప్రధాన ప్రాంతాలను అనుసంధానించేందుకు కొత్త రైల్వే మార్గాలను నిర్మించనున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు రాష్ట్రానికి రూ.9,830 కోట్ల నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. దక్షిణమధ్య రైల్వేలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎక్సైజ్ మంత్రి పద్మారావుగౌడ్, ఎంపీలు కల్వకుంట్ల కవిత, బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎన్వీవీఎస్ ప్రభాకర్, నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ రాంచందర్, దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్, ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ చైర్మన్ శేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ దక్షిణమధ్య రైల్వేలోని అన్ని చోట్ల 54 వేల ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేయడం హర్షణీయమన్నారు. దీనివల్ల ఏటా రెండు మిలియన్ల విద్యుత్ ఆదా కావడమే కాకుండా ఏటా 1,800 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని చెప్పారు. అలాగే విద్యుత్‌పైన చేసే ఖర్చులో రూ.1.7 కోట్లు మిగులుతుందన్నారు. గత మూడేళ్లలో దేశవ్యాప్తంగా 90 కోట్ల ఎల్ఈడీ బల్బులను ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు. దీంతో రూ.45 వేల కోట్ల విద్యుత్ బిల్లులు ఆదా అవుతున్నట్లు పేర్కొన్నారు. ఇంధన వనరుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణకుప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని తెలిపారు. కాచిగూడ రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన 400 కిలోవాట్ల సోలార్ ప్లాంట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ ప్లాంట్ వల్ల ఏటా మరో రూ.21.66 లక్షలు ఆదా అవుతుందన్నారు. పర్యావరణహితమైన బయో టాయిలెట్ల ఏర్పాటును ప్రశంసించారు. నాలుగో వంతెనకు శంకుస్థాపన ప్రతిరోజు సుమారు 1.8 లక్షల మంది ప్రయాణికులు, 200 రైళ్ల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వరకు ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు రూ.8.8 కోట్ల అంచనాలతో నిర్మించ తలపెట్టిన నాలుగో వంతెనకు మంత్రి పీయూష్ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం మూడు వంతెనలు ఉన్నాయి. వీటిలో ఒకటి నిజాం కాలంలో సుమారు వందేళ్ల క్రితం కట్టించిన వంతెన. రోజురోజుకూ ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో వంతెన ఇరుకైపోవడం.. మిగతా రెండింటిపైనే ఎక్కువ ఒత్తిడి ఉండటంతో నాలుగో వంతెనను నిర్మించేందుకు దక్షిణమధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ఈ వంతెన పూర్తయిన తరువాత పురాతన వంతెనను తొలగిస్తారు. కాచిగూడ–నిజామాబాద్ రైలు కరీంనగర్‌కు పొడిగింపు కరీంనగర్ వరకు పొడిగించిన కాచిగూడ–నిజామాబాద్ రైలును కూడా పీయూష్ గోయల్ జెండా ఊపి ప్రారంభించారు. చర్లపల్లి స్టేషన్ వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే టెర్మినల్ పనులను త్వరలో ప్రారంభించాలని దక్షిణమధ్య రైల్వే అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ స్టేషన్లో మల్టీలెవల్ కారు పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్లాటినం గ్రీన్ రేటింగ్ అవార్డు లభించడం పట్ల అభినందనలు తెలిపారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో ఏర్పాటు చేసిన అదనపు లిఫ్టులు, ఎస్కలేటర్లను ప్రారంభించారు. కొత్త గనులకు వేగంగా అనుమతులు: పీయూష్ రాష్ట్రంలో కొత్త గనులకు సత్వరమే అనుమతులు ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. సింగరేణి నూతన ప్రాజెక్ట్‌లు, వ్యాపార విస్తరణ కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శుక్రవారం సింగరేణి భవన్లో ఆయన సమీక్ష నిర్వహించారు. సింగరేణి సంస్థ అభివృద్ధిపై సీఎండీ శ్రీధర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు స్పందిస్తూ జాతీయ స్థాయిలో ఆ సంస్థ గణనీయమైన వృద్ధిని సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. వ్యాపార విస్తరణలో భాగంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల్లో కొత్త బ్లాకులు కేటాయించవల్సిందిగా చైర్మన్ కోరగా పీయూష్ గోయల్ సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి: కవిత 60 ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సహకరించాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత కేంద్ర మంత్రిని కోరారు. రైల్వే లో దివ్యాంగుల కోటాను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచిన నేపథ్యంలో ఈ సంవత్సరం నుంచే దాన్ని అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కోటా పెంపు వల్ల దివ్యాంగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయన్నారు. ఏ గ్రేడ్ రైల్వేస్టేషన్ అయిన నిజామాబాద్ స్టేషన్లో ప్రయాణికుల సదుపాయాలను పెంచాలని కోరారు. ఎంఎంటీఎస్ రెండో దశను సకాలంలో పూర్తి చేయాలని ఎంపీ బండారు దత్తాత్రేయ కోరారు. దీనికయ్యే నిధులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలన్నారు. -
పట్టాలు తప్పిన ముంబై-హౌరా మెయిల్
సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని ఇగత్పురి రైల్వే స్టేషన్ సమీపంలో హౌరా మెయిల్ రైలు ఆదివారం వేకువజామున 2 గంటల సమయంలో పట్టాలు తప్పింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానట్లు తెలిసింది. రైల్వే భద్రతా సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే 12 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఏడు రైళ్లను దారి మళ్లించారు. 12809 ముంబై-హౌరా మెయిల్‌కు సంబంధించి మూడు బోగీలు(కోచ్‌లు) పట్టాలు తప్పాయని, అవి ఎస్-12, ఎస్-13, పాంట్రీ కారుగా గుర్తించినట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సునీల్ ఉడాసీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైల్వే బుకింగ్ కౌంటర్లోనే నోట్లు మార్చాడు!
ముంబై: నోట్ల రద్దు నేపధ్యంలో అవకాశం ఉన్న ప్రతిచోటా అక్రమాలు జరిగిన ఘటనలు ప్రజలను విస్మయపరుస్తున్నాయి. కొంత మంది బ్యాంకు అధికారులే స్వయంగా బడాబాబులు డబ్బు మార్చుకోవడానికి మధ్యవర్తులుగా వ్యవహరించిన తీరును గమనిస్తూనే ఉన్నాం. తాజాగా ఓ రైల్వే అధికారి టికెట్ బుకింగ్ కౌంటర్ల వద్దే నోట్ల మార్పిడి చేసి బుక్ అయ్యాడు. ముంబైలోని సీఎస్టీ రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఎల్కే బోయర్‌పై సీబీఐ అధికారులు శనివారం కేసు నమోదు చేశారు. రైల్వే బుకింగ్ కౌంటర్ వద్దే ఈయన పాత నోట్ల మార్పిడి కార్యక్రమం చేపట్టాడు. సుమారు 8.22 లక్షల విలువగల 1000, 500 రూపాయల పాత నోట్లను.. 100, 2000 రూపాయల నోట్లతో బోయర్ మార్చినట్లు సీబీఐ అధికారులు పేర్కొన్నారు. విచారణ కొనసాగుతోంది. -
సెంట్రల్ రైల్వేలో అప్రెంటీస్ పోస్టులు
సెంట్రల్ రైల్వే.. వివిధ వర్క్‌షాప్స్, యూనిట్ల పరిధిలో అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దర ఖాస్తులు ఆహ్వానిస్తోంది. ముంబై క్లస్టర్ (క్యారేజ్ అండ్ వ్యాగన్ (కోచింగ్) వాడి బందర్, ముంబై ఫిట్టర్ = 182 వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 6 కార్పెంటర్ = 28 పెయింటర్ (జనరల్) = 24 టైలర్ (జనరల్) = 18 కల్యాణ్ డీజిల్ షెడ్ 1. ఎలక్ట్రీషియన్ = 11 2. మెషినిస్ట్ = 1 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 1 4. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ = 4 5. మెకానికల్ డీజిల్ = 33 6. లేబొరేటరీ అసిస్టెంట్ (సీపీ) = 3 కుర్లా డీజిల్ షెడ్ 1. ఎలక్ట్రీషియన్ = 24 2. మెకానికల్ డీజిల్ = 36 ఎస్ఆర్.డీఈఈ (టీఆర్ఎస్) కల్యాణ్ 1. ఫిట్టర్ = 62 2. టర్నర్ = 10 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 10 4. ఎలక్ట్రీషియన్ = 62 5. మెషినిస్ట్ = 5 6. ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ = 5 7. లేబొరేటరీ అసిస్టెంట్ (సీపీ) = 5 8. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ = 20 ముంబై క్లస్టర్ ఎస్ఆర్ (డీఈఈ) (టీఆర్ఎస్) కుర్లా 1. ఫిట్టర్ = 90 2. టర్నర్ = 6 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 3 4. ఎలక్ట్రీషియన్ = 93 పారెల్ వర్క్‌షాప్ 1. ఫిట్టర్ = 6 2. మెషినిస్ట్ = 9 3. షీట్ మెటల్ వర్కర్ = 9 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 6 5. ఎలక్ట్రీషియన్ = 11 6. విండర్ (ఆర్మేచర్) = 5 7. మెకానిక్ మెషిన్ టూల్స్ = 24 8. టూల్ అండ్ డై మేకర్ = 68 9.మెకానిక్ (మోటార్ వెహికల్) = 4 10. మెకానిక్ డీజిల్ = 74 మాతుంగ వర్క్‌షాప్ 1. మెషినిస్ట్ = 26 2. మెకానిక్ మెషిన్టూల్ మెయింటెనెన్స్= 48 3. ఫిట్టర్ = 197 4. కార్పెంటర్ = 126 5. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 55 6. పెయింటర్ = 37 7. ఎలక్ట్రీషియన్ = 90 ముంబై క్లస్టర్ ఎస్ అండ్ టీ వర్క్‌షాప్, బైకుల్లా 1. ఫిట్టర్ = 25 2. టర్నర్ = 6 3. మెషినిస్ట్ = 5 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 8 5. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ = 6 6. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ = 2 7. ఎలక్ట్రీషియన్ = 3 8. పెయింటర్ (జనరల్) = 4 భుసావల్ క్లస్టర్ గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ 1. ఫిట్టర్ = 107 2. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 12 3. మెషినిస్ట్ = 3 ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్ 1. ఫిట్టర్ = 38 2. ఎలక్ట్రీషియన్ = 38 3. వెల్టర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 4 ఎలక్ట్రిక్ లోకోమోటి వ్ వర్క్‌షాప్, భుసావల్ 1. ఎలక్ట్రీషియన్ = 56 2. ఫిట్టర్ = 53 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 7 4. ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్స్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ = 2 భుసావల్ క్లస్టర్ మన్మాడ్ వర్క్‌షాప్ 1. ఫిట్టర్ = 27 2. టర్నర్ = 3 3. మెషినిస్ట్ = 7 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 7 5. మెకానిక్ (మెటార్ వెహికల్) = 1 6. మెకానిక్ డీజిల్ = 4 7. పెయింటర్ (జనరల్) = 2 టీఎండబ్ల్యు నాసిక్ రోడ్ 1. ఫిట్టర్ = 10 2. మెషినిస్ట్ = 4 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 6 4. ఎలక్ట్రీషియన్ = 26 5. కార్పెంటర్ = 2 6. మెకానిక్ డీజిల్ = 2 పుణె క్లస్టర్ గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ 1. ఫిట్టర్ = 20 2. మెషినిస్ట్ = 3 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 3 4. పెయింటర్ (జనరల్) = 2 డీజిల్ లోకోషెడ్ 1. మెకానిక్ డీజిల్ = 9 2. ఎలక్ట్రీషియన్ = 30 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 8 4. మెషినిస్ట్ = 2 5. పెయింటర్ (జనరల్) = 1 నాగపూర్ క్లస్టర్ ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని 1. ఎలక్ట్రీషియన్ = 33 2. ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానిక్ = 15 గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో 1. ఫిట్టర్ = 51 2. పెయింటర్ (జనరల్) = 1 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 5 4. కార్పెంటర్ = 2 షోలాపూర్ క్లస్టర్ గ్యారేజ్ అండ్ వ్యాగన్ డిపార్ట్మెంట్ 1. ఫిట్టర్ = 72 2. కార్పెంటర్ = 7 3. మెషినిస్ట్ = 8 4. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 11 5. పెయింటర్ (జనరల్) =3 6. మెకానిక్ డీజిల్ = 2 కుర్దువాడీ వర్క్‌షాప్ 1. ఫిట్టర్ = 7 2. మెషినిస్ట్ = 5 3. వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్) = 4 4. కార్పెంటర్ = 2 5. పెయింటర్ (జనరల్) = 3 అర్హత: 50 శాతం మార్కులతో పదో తరగతి (10+2 విధానంలో) ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. వయోపరిమితి: నవంబర్ 1, 2016 నాటికి 15 ఏళ్లు నిండి 24 ఏళ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక: పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. వీరికి వైద్య పరీక్షలు ఉంటాయి. అంతేకాకుండా నిర్దేశిత శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ ఐటీఐ ట్రేడ్ ఆధారంగా ఏదో ఒక క్లస్టర్‌కు మాత్రమే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రింటవుట్ దరఖాస్తు పంపాల్సిన అవసరం లేదు. దరఖాస్తు రుసుం: డెబిట్ కార్డ్/ క్రెడిట్ కార్డ్/ఇంటర్నెట్ బ్యాంకింగ్/ఎస్బీఐ చలాన్ ద్వారా రూ.100 దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీలకు, దివ్యాంగులకు, మహిళలు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 1, 2016 ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 30, 2016 వెబ్సైట్: https://www.rrccr.com/ -
పాడైన బోగీలతో.. కానిచ్చేశారు..!
ముంబై: రైళ్ల రాకపోకల సమయాల్లో, నిర్ణయాల్లో జాప్యం చేసే రైల్వే శాఖ శుక్రవారం రాష్ట్ర మంత్రి చొరవతో అరకొర వసతులున్న రైలును ఎనిమిది గంటల్లోనే ముంబై నుంచి ఉత్తరప్రదేశ్, బీహార్ల మీదుగా వెళ్లే విధంగా ప్రత్యేక సర్వీసును ఏర్పాటు చేసింది. వివాహాల సీజన్ కావడంతో రైళ్లలో ఖాళీలు లేక ఉత్తర భారతదేశానికి చెందిన ఎక్కువ మంది ప్రజలు ముంబై స్టేషన్లోనే పడుకుంటున్నారంటూ బీజేపీ కార్యకర్తలు అందించిన సమాచారంతో కదిలిన మహారాష్ట్ర రైల్వే శాఖ మంత్రి మనోజ్ సిన్హా వెంటనే ప్రత్యేక సర్వీసులను నడపాలని సెంట్రల్ రైల్వే అధికారులను ఆదేశించారు. దీంతో కదిలిన రైల్వే శాఖ ఆదేశాలు అందిన రెండు గంటలలోపే వాడుకలో లేని కోచ్‌లను త్వరగా రప్పించి శుక్రవారం రాత్రి 11.30 నిమిషాలకు ప్రత్యేక రైలును గోరఖ్‌పూర్ వరకు నడపాలని నిర్ణయించారు. ఇందుకోసం సీఎస్టీ, వాడి బన్డర్, మజ్గావ్, దాదర్ రైల్వే యార్డుల నుంచి రెండు చొప్పునా, బైకుల్లా యార్డు నుంచి నాలుగు వాడుకలో లేని, పూర్తిగా పాడై ఉన్న కోచ్‌లను ఎంపిక చేశారు. వీటిని రిపేర్ చేయడం, శుభ్ర పరచడం కోసం 25 మంది రైల్వే సిబ్బంది కేటాయించారు. శుక్రవారం రాత్రి 10.30 గంటల సమయంలో రిపేర్ చేసిన 12 కోచ్‌లు ముంబై స్టేషన్‌కు చేరుకున్నపుడు పరిశీలిస్తే బోగీలన్నీ అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఫ్యాన్లు కూడా సరిగా పనిచేయడం లేదు. రద్దీ ఎక్కువగా ఉండటంతో ముంబై నుంచి గోరఖ్‌పూర్, వారణాసి, పాట్నాలకు 84 ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ నరేంద్రపాటిల్ తెలిపారు. -
‘సీఎస్టీ’కి కమాండో భద్రత
- 6 నెలల్లోగా ఏర్పాటు చేస్తామన్న - సెంట్రల్ రైల్వే - ‘ఉగ్ర’ హెచ్చరికల నేపథ్యంలోనే.. - త్వరలో డాగ్స్ కెన్నల్ల నిర్మాణం సాక్షి, ముంబై: నగరంలో ఉగ్రవాద దాడులు జరగొచ్చన్న నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో ఛత్రపతి శివాజీ టెర్మినస్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన కమాండోలతో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. ఉగ్రదాడులు జరగే అవకాశం ఉండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు, మరో ఆరు నెలల్లో భద్రత ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. కమాండోలను ఏర్పాటు చేయటం వల్ల టెర్మినస్ భద్రతా వలయంలో ఉంటుందని సెంట్రల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) సీనియర్ డివిజినల్ సెక్యూరిటీ కమిషనర్ అశోక్ భోర తెలిపారు. ప్రస్తుతం ఆర్పీఎఫ్కు ప్రత్యేకంగా 50 మంది సిబ్బంది ఉండగా.. మరో 60 మంది సిబ్బంది అదనంగా చేరనున్నారు. వారిని కొత్తగా ఇటీవల ఫోర్స్‌లో చేరినృబందంతో కలిపి విపత్తు నిర్వహణలో శిక్షణ ఇస్తారు. ఇందుకు అత్యాధునిక ఆయుధాలను ఎలా ఉపయోగించాలో నేర్పుతారు. వీరికి తోడుగా డాగ్ స్క్వాడ్ల కోసం సెంట్రల్ రైల్వే కొత్తగా కెన్నల్లను నిర్మించనుంది. పన్వేల్, కసారా, లోనావాలాలోని సరిహద్దు ప్రాంతాల్లో నిర్మిస్తుంది. నగర శివార్లలో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, అక్కడ కూడా తనిఖీలు నిర్వహించాల్సిన అవసరం ఉందని సెంట్రల్ రైల్వే కమిషనర్ అశోక్ తెలిపారు. ప్రస్తుతం కార్నక్ బందర్, లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీటీ), మాటుంగ, కల్యాణ్‌లలో 29 స్నిఫర్ డాగ్స్‌కు గాను 37 కెన్నీస్లు ఉన్నాయని చెప్పారు. కొత్త డాగ్స్ షెల్టర్లు అందుబాటులోకి రాగానే మరిన్నింటిని సమకూర్చే ప్రయత్నం చేస్తామని వివరించారు. అలాగే ఎలక్ట్రానిక్ నిఘాను కూడా మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపారు. కుర్లా స్టేషన్లో ఇంటిగ్రెటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (ఐఎస్ఎస్)లో భాగంగా దాదాపు వంద కెమెరాలను అమర్చనున్నామని చెప్పారు. అనంతరం ఎల్టీటీ, కల్యాణ్‌లలో కూడా హై-ఎన్డ్ కెమెరాలను అమర్చుతామన్నారు. సీఎస్టీ, థానేలో ఐఎస్ఎస్ లో భాగంగా కెమెరాలను అమర్చారని, ఈ నెలాఖరుకు దాదర్‌లో కంట్రోల్ రూం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. అసాంఘిక కార్యకలాపాలను ఎదుర్కొవడానికి సిబ్బందికి తగిన విధంగా శిక్షణ ఇవ్వాలని, సీసీ కెమెరాలను పర్యవేక్షించేందుకు తగినంత సిబ్బంది ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. -
సీసీఏఎంలకు భద్రత ఎలా..
సాక్షి, ముంబై: ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటుచేస్తోన్న ‘క్యాష్ అండ్ కాయిన్ ఆపరేటెడ్ యంత్రాలు సెంట్రల్ రైల్వేకు తలనొప్పిగా పరిణమించాయి. చోరీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉండడంతో ఈ యంత్రాలకు 24 గంటలూ భద్రత కల్పిస్తేనే వాటిని పంపిణీ చేస్తామని తయారీదారులు స్పష్టం చేస్తున్నారు. నగదు ద్వారా టికెట్లు కొనుగోలు చేయడంవల్ల ఈ యంత్రాల్లో పెద్ద మొత్తంలో డబ్బు చేరే అవకాశముంటుంది. దీంతో ఈ యంత్రాల భద్రతా అంశం తెరమీదకు వచ్చింది. సీసీటీవీ కెమెరాల పహారా, 24 గంటలూ భద్రత సిబ్బంది ఉంటున్న ఏటీఎంల నుంచే డబ్బులు చోరీ అవుతున్నాయి. కొన్ని చోట్ల ఏకంగా ఏటీఎం యంత్రాలనే ఎత్తుకుపోతున్నారు. ఇలాంటి సందర్భంలో రైల్వే స్టేషన్ల బయట అక్కడక్కడ ఇలాంటి నగదు వేస్తే టికెటు వచ్చే యంత్రాలను భద్రత సిబ్బంది లేకుండా ఎక్కడపడితే అక్కడ అమర్చడం ప్రమాదకరమని వాటిని పంపిణీ చేసే కంపెనీలు స్పష్టం చేశాయి. లోకల్ రైళ్ల టికెట్ కౌంటర్ల వద్ద క్యూ, చిల్లర నాణేల బెడద తగ్గించేందుకు రైల్వే పరిపాలన విభాగం ఇదివరకే సీవీఎం, ఏటీవీఎం లాంటి ఆధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకొచ్చింది. కాని అందులో డబ్బులు నిల్వ ఉండవు గనుక అవి చోరీకి గురయ్యే అవకాశం లేదు. కాని క్యాష్ అండ్ కాయిన్ ఆపరేటెడ్ యంత్రాల్లో నగదు నిల్వ ఉంటుంది. దీంతో దొంగల నుంచి వీటికి ప్రమాదం పొంచి ఉంది. కాగా వాటి నిర్వహణ బాధ్యతను రైల్వే సదరు యంత్రాల పంపిణీ కంపెనీలకే అప్పగించింది. కాని చోరీ ఘటనలను దృష్టిలో ఉంచుకుని వాటి బాధ్యతలు స్వీకరించేందుకు కంపెనీలు వెనకడుగు వేస్తున్నాయి. అక్కడ 24 గంటలు భద్రత సిబ్బంది నియమించాలని డిమాండ్ చేస్తున్నాయి. కాని ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోంచించాలని రైల్వే అధికారులు సదరు కంపెనీలకు సూచించారు. జన సంచారం, పోలీసులు విధులు నిర్వహించే చోట వాటిని ఏర్పాటు చేయాలని సలహా ఇచ్చారు. కాని అలాంటి ప్రాంతాలు లోకల్ రైల్వే పరిధిలో చాలా తక్కువ చోట్ల ఉన్నాయి. దీంతో ఈ యంత్రాల ఏర్పాటు ప్రక్రియ కష్టమేననే వాదనలు వినిపిస్తున్నాయి. -
లోకల్ రైళ్లకు కొత్త టైంటేబుల్
సాక్షి, ముంబై: ప్రయాణికుల సౌకర్యార్థం సెంట్రల్ రైల్వే శనివారం నుంచి లోకల్ రైళ్ల కొత్త టైం టేబుల్ అమలులోకి తెస్తోంది. దీని వల్ల కొందరికి ఇబ్బంది కాగా, మరికొందరికి మరింత సౌకర్యవంతం కానుంది. ముఖ్యంగా ఆఖరు లోకలు, మొదటి లోకల్ రైలు సమయంలో మార్పులు చేయడంవల్ల కొందరు ఉద్యోగులు, వ్యాపారులకు మేలు జరగ్గా, మరికొందరికి అన్యాయం జరగనుంది. సెంట్రల్ రైల్వే మార్గంలో కొంత కాలం నుంచి రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్లు, కొత్తగా ప్రవేశపెట్టిన లోకల్ రైళ్ల రాకపోకలు, కొన్ని రైళ్లను విస్తరించడం, అదనంగా ట్రిప్పులు పెంచడం తదితర చర్యల వల్ల రైల్వే మార్గంపై అదనపు భారం పడుతోంది. దీంతో టైం టేబుల్ ప్రకారం రైళ్లను నడపడం పెద్ద సమస్యగా మారింది. అదేవిధంగా లోకల్ రైళ్లపై ప్రయాణికుల నుంచి కూడా అనేక సూచనలు, సలహాలు వచ్చాయి. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని ఏ సమయంలో, ఎక్కడికి, ఎన్ని లోకల్ రైళ్లను నడిపితే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుందనే దానిపై రైల్వే అధికారులు అధ్యయనం చేశారు. ఆ తర్వాత కొత్త టైం టేబుల్ రూపొంధించారు. ఆ ప్రకారం ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ) నుంచి అర్ధరాత్రి 12.38 గంటలకు బయలుదేరే ఆఖరు లోకల్ రైలు శనివారం నుంచి 12.30 గంటలకు బయలుదేరుతుంది. ఎనిమిది నిమిషాలు ముందు వెళ్లడంవల్ల ఉద్యోగులు, వ్యాపారులు పరుగులు తీయాల్సి వస్తుంది. లేదంటే రైలు అందకుండా పోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా సీఎస్టీ నుంచి తెల్లవారు జాము 4.05 గంటలకు బయలుదేరే మొదటి లోకల్ రైలు శనివారం నుంచి 4.12 గంటలకు బయలుదేరుతుంది. ఏడు నిమిషాలు ఆలస్యంగా బయలు దేరడంవల్ల ప్రయాణికులకు కొంత మేలు జరగనుంది. వీటితోపాటు రోజంతా పరుగులు తీసే రైళ్ల సమయంలో అనేక మార్పులు జరిగాయి. కాగా హార్బర్, ట్రాన్స్ హార్బర్ మార్గంలో రైళ్ల టైం టేబుల్లో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే అధికారులు తెలిపారు. -
ఇక్కడ టీసీయే ‘మాస్టర్’..!
సాక్షి, ముంబై: సెంట్రల్ రైల్వే పరిధిలో స్టేషన్ మాస్టర్ల కొరత తీవ్రంగా ఉంది. మెయిన్, హార్బర్ మార్గాల్లో ఉన్న 18 స్టేషన్లలో స్టేషన్ మాస్టర్ల పనులను టికెట్ కలెక్టర్లే నిర్వహిస్తున్నారు. ఆయా స్టేషన్లలో అత్యవసర సమస్య వచ్చినప్పుడు ఎదుర్కోవడానికీ, రోజువారీ పర్యవేక్షణకు స్టేషన్ మాస్టర్ లేకపోవడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్ లైన్ స్టేషన్ల అయిన చించ్‌పోక్లీ, కర్రీరోడ్, విద్యావిహార్, కన్జూర్‌మార్గ్ రైల్వే స్టేషన్ల పరీవాహక ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కార్యాలయాలు ఉన్నాయి. దీంతో ఈ స్టేషన్ల నుంచి వెళ్లే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా, హార్బర్‌లైన్ స్టేషన్లు అయిన డాక్‌యార్డ్ రోడ్, కాటన్గ్రీన్, చున్నాబట్టీ, ఖార్గర్ రైల్వే స్టేషన్లలో కూడా స్టేషన్ మాస్టర్లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రైల్వే స్టేషన్లలో అత్యవసర పరిస్థితి ఎదురైనప్పుడు ప్రయాణికులు మొదట స్టేషన్మాస్టర్నే ఆశ్రయిస్తారు. అంతేకాకుండా రైల్వే స్టేషన్ల పరిధిలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు స్టేషన్ మాస్టర్ కీలకపాత్ర పోషిస్తాడు. ప్రయాణికులకు సహకారం అందించడం, అదేవిధంగా అత్యవసర సమయంలో రైళ్లను నిలిపివేయడం వంటి పనులను నిర్వహిస్తూ ఉంటాడు. రైళ్లు నెమ్మదిగా నడవడం, రైళ్లలో, పట్టాల్లో సాంకేతికపరమైన లోపాలు తలెత్తినప్పుడు అందుకు సంబంధించిన నివేదికను స్టేషన్ మాస్టరే తయారుచేయాల్సి ఉంటుంది. అలాగే రెళ్ల రాకపోకల్లో అంతరాయం ఏర్పడితే ప్రయాణికుల సౌకర్యార్థం ఆ విషయాన్ని మైక్‌లో అనౌన్స్ చేయిం చాల్సి ఉంటుంది. ఏదైనా ఘటన జరిగితే రైల్వే పోలీసులను వెంటనే అప్రమత్తం చేసే బాధ్యత కూడా స్టేషన్ మాస్టర్దేనని నేషనల్ రైల్వే యూజర్ కన్సల్టేటివ్ కమిటీ మాజీ సభ్యుడు సుభాష్ గుప్తా తెలిపారు. ప్రస్తుతం టికెట్ క్లర్క్‌లు ఈ విధులను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్టేషన్ మాస్టర్ ఒకరు మాట్లాడుతూ.. స్టేషన్ మాస్టర విధులు నిర్వహిస్తున్న టికెట్ క్లర్క్‌లకు తగిన శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఒక వేళ రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రోడ్డు ప్రమాదాలు జరిగినా, సాంకేతిక లోపం తలెత్తినా సంబంధించిన రికార్డులను నిర్వహించాల్సి ఉంటుందన్నారు. ప్రమాదం జరిగిన గంటలో బాధితుడిని ఆస్పత్రికి తరలించాలని, అటువంటి పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందన్నారు. కొన్ని సందర్భాల్లో సమీప రైల్వే స్టేషన్లలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన నివేదికలను తయారుచేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తుంటారని, దాంతో తమపై ఒత్తిడి పెరుగుతోందని ఆయన తెలిపారు. కాగా, రైల్వే పరిపాలన విభాగం స్టేషన్ మాస్టర్లను తగ్గించే ప్రయత్నంలో ఉందని ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రితీష్ దుబే ఆరోపించారు. సబర్బన్ సెక్షన్లో ప్రతి రైల్వే స్టేషన్లో స్టేషన్ మాస్టర్‌ను నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. -
త్వరలో ‘లోకల్’ అదనపు ట్రిప్పులు
సాక్షి, ముంబై: లోకల్ రైలు ప్రయాణికులకు శుభవార. రద్దీ బాధల నుంచి త్వరలో స్వల్ప ఉపశమనం లభించనుంది. ఇందులోభాగంగా అదనంగా కొన్ని టిప్పులను నడపాలని సెంట్రల్ రైల్వే పరిపాలనా విభాగం నిర్ణయించింది. తక్కువ దూరం ప్రయాణించే వారికోసం 15 అదనపు ట్రిప్పులు నడపనుంది. ఈ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఇందులోభాగంగా కొన్ని రైళ్ల టైంటేబుల్లో స్వల్ప మార్పులుచేర్పులు చేయాల్సి ఉంటుందని సంబంధిత అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం లోకల్ రైళ్లు ప్రతిరోజూ సుమారు 45,500 కిలోమీటర్ల దూరం పరుగులు తీస్తున్నాయి. అయితే అదనపు ట్రిప్పుల కారణంగా ఇకమీదట 45,648 కి.మీ. మేర పరుగులు తీయనున్నాయి. కొత్త టైం టేబుల్‌ను సిద్ధం చేయగానే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. ఛత్రపతి శివాజీ టెర్మినస్-కుర్లా మధ్య మూడు, కల్యాణ్-దాదర్ మధ్య రెండు ట్రిప్పుల చొప్పున నడపనున్నట్లు సంబంధిత అధికారులు చెప్పారు. ఈ ఐదు ట్రిప్పులవల్ల ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణికులకు రద్దీ నుంచి కొంత మేర ఉపశమనం లభిస్తుందంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. తక్కువ దూరానికి ట్రిప్పుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో గత్యంతరం లేక అనేక మంది ప్రయాణికులు దూరం వెళ్లే లోకల్ రైళ్లలోనే రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో ఆ రైళ్లలో రాకపోకలు సాగించేవారు వీరిపై పెత్తనం చెలాయిస్తున్నా రు. మీకు ప్రత్యేకంగా కుర్లా, దాదర్ లోకల్ రైళ్లు ఉండగా, ఈ రైళ్లలో ఎందుకు ప్రయాణిస్తున్నారంటూ గట్టిగా నిలదీస్తున్నారు. మీ కారణంగానే ఈ రైళ్లు కిక్కిరిసిపోతున్నాయంటూ గొడవలకు దిగుతున్నారు. ఇలా బెదిరింపులకు పాల్పడేవారంతా జట్లు జట్లుగా ఉండడంతో ఒంటరి ప్రయాణికులు ఏమీచేయలేకపోతున్నారు. లోకల్ రైళ్ల హాల్ట్ వేళల్లో స్వల్ప మార్పులు గణేశ్ చతుర్ధి సందర్భంగా సోమవారం జరగనున్న నిమజ్జన ఉత్సవాలకు గిర్గావ్ (చర్నిరోడ్) చౌపాటీకి వచ్చే ప్రజల సౌకర్యార్ధం పశ్చిమ రైల్వే పరిపాలనా విభాగం లోకల్ రైళ్ల హాల్ట్ వేళల్లో స్వల్ప మార్పులు చేసింది. సోమవారం సాయంత్రం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు ముంబై సెంట్రల్-చర్చిగేట్ మధ్య అన్ని స్టేషన్లలో ఫాస్ట్ అప్, డౌన్ రైళ్లకు హాల్టు ఇచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. అయితే సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు చర్నిరోడ్ స్టేషన్లో స్లో లోకల్ రైళ్లు ఆగవని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో సంబంధిత అధికారులు పేర్కొన్నారు. గణపతి నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు నగరంతోపాటు శివారు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివస్తారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టించిన సార్వజనీక గణేశ్ ఉత్సవ మండళ్లకు చెందిన భారీ వినాయక విగ్రహాలన్నింటినీ నిమజ్జనానికి చర్నీరోడ్ చౌపాటీకే తరలిస్తారు. లాల్బాగ్ చా రాజా, గణేశ్ గల్లీ, జీఎస్బీ లాంటి ప్రముఖ మండళ్ల విగ్రహాలన్నీ ఇక్కడికే వస్తాయి. దీంతో నిమజ్జన ఉత్సవాలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు ఇక్కడికే వెళతారు. దూరప్రాంతాల నుంచి ఇక్కడి వచ్చే వారిలో అత్యధిక శాతం జనం చర్నీరోడ్ స్టేషన్లోనే రైలు దిగుతారు. దీంతో ఈ స్టేషన్పైప్రయయాణికుల భారం విపరీతంగా పడుతుంది. ఇక్కడ హాల్ట్ లేకపోవడంవల్ల రైలు ఎక్కాలన్నా... దిగాలన్నా.... గ్రాంట్ రోడ్ లేదా మెరైన్ లైన్స్ స్టేషన్లకు వెళుతుంటారు. దీంతో చర్నిరోడ్ స్టేషన్లో స్లో రైళ్లకు హాల్టు ఇవ్వకూడదని, ఫాస్ట్ రైళ్లకు మాత్రమే హాల్టు ఇవ్వాలని నిర్ణయించామని రైల్వే వర్గాలు తెలిపాయి. -
స్క్రాప్ భలే.. ఆదాయం రూ. 156 కోట్లు
సాక్షి, ముంబై: సెంట్రల్, వెస్ట్ రైల్వేకు స్క్రాప్ ద్వారా మంచి ఆదాయం లభిస్తోంది. ఈ రెండు రైల్వేకు చిత్తు (స్క్రాప్) ద్వారా కేవలం నాలుగు నెలల్లోనే రూ.156 కోట్ల ఆదాయం చేకూరింది. పనికిరాని వస్తువులను స్క్రాప్ కింద విక్రయించాలని పీఎంవో సూచనల మేరకు రైల్వే అధికారులు స్క్రాప్ ద్వారా ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించారు. సెంట్రల్, వెస్టర్న్ రైల్వేలకు ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు దాదాపు రూ. 156 కోట్ల ఆదాయం వచ్చింది. ఇది కేవలం స్క్రాప్ విక్రయించడం ద్వారా లభించింది. ఆదాయం ఇలా..: స్క్రాప్ ద్వారా వచ్చిన ఆదాయం మేరకు సెంట్రల్ రైల్వే అందజేసిన వివరాల ఇలా ఉన్నాయి.. 2013-14 ఆర్థిక సంవత్సరంలో స్క్రాప్‌ను విక్రయించడం ద్వారా రూ.47 కోట్ల ఆదాయం చేకూరింది. ఈ ఏడాది జూలై 15వ తేదీ వరకు స్క్రాప్‌ను విక్రయించడం ద్వారా రూ.67 కోట్ల ఆదాయం చేకూరింది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.302 కోట్లను స్క్రాప్ ద్వారా అర్జించాలని వెస్టర్న్ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. రూ.315 కోట్లతోనే సరిపెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.220 కోట్లను అర్జించాలని సెంట్రల్ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు రూ.89 కోట్లను ఆర్జించింది. వివిధ యార్డుల్లో చాలా వృథాగా పడిఉన్న సామగ్రిని విక్రయించడం ద్వారా భారీ ఆదాయం చేకూరుతోందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. ట్రాక్స్ విక్రయాలతో..: రైల్వే అధికారులు అందజేసిన వివరాల మేరకు.. 2010- 11 ఆర్థిక సంవత్సరంలో పాడుబడిన రైల్వే ట్రాక్స్‌ను విక్రయిచండం ద్వారా రైల్వేకు భారీ మొత్తంలో ఆదాయం చేకూరింది. పాతబడిన బోగీలు, చక్రాలు, ఓవర్‌హెడ్ ఎలక్ట్రికల్ వైర్ల విక్రయం ద్వారా కూడా ఆదాయం వచ్చింది. ఈ ఏడాదిలో కేవలం రైల్వే ట్రాక్‌లను విక్రయించడం ద్వారా రైల్వేకు రూ.230 కోట్ల ఆదాయం వచ్చింది. స్క్రాప్‌ను విక్రయించడం ద్వారా వచ్చిన భారీ ఆదాయం రైల్వే నష్టాలను కొంత మేర భర్తీ చేస్తోందని అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. స్క్రాప్‌ను సేకరిస్తున్నాం : పీఆర్వో సెంట్రల్ రైల్వే పీఆర్వో ఎ.కె.సింగ్ మాట్లాడుతూ.. అన్ని రైల్వే యార్డుల్లో, ఇతర ప్రాంతాల్లో వృథాగా పడి ఉన్న స్క్రాప్‌ను సేకరిస్తున్నామని చెప్పారు. వీటి విక్రయం ద్వారా మంచి ఆదాయం వస్తుందని అన్నారు. వెస్టర్న్, సెంట్రల్ ఇరు రైల్వేల్లో చాలా సామగ్రి వృథాగా పడి ఉందని తెలిపారు. విరార్, మహాలక్ష్మి, లోయర్ పరేల్, ముంబై సెంట్రల్, కల్వా, పరేల్ వర్క్‌షాపుల్లో చాలా సామగ్రి నిరుపయోగంగా పడి ఉందని, త్వరలో విక్రయిస్తామని తెలిపారు. -
కొంకణ్‌కు డబుల్ డెక్కర్ పరుగులు
సాక్షి, ముంబై: గణేష్ ఉత్తవాలను పురస్కరించుకుని కొంకణ్‌కు డబుల్ డెక్కర్ ఏసీ రైలు పరుగులు తీసింది. అయితే రైల్వే అధికారుల మధ్య సమన్వయ లోపం వల్ల మొదటి రోజు ఆ రైలు గంటా 15 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచింది. వివరాలిలా ఉన్నాయి. గణేష్ ఉత్సవాల కారణంగా రెగ్యూలర్‌తోపాటు ప్రత్యేకంగా నడిపే రైళ్లలో రిజర్వేషన్ ఫుల్ అయ్యాయి. దీంతో కొంక ణ్ దిశగా వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మినస్ (ఎల్టీటీ) నుంచి కర్మాలి (గోవా) వరకు డబుల్ డెక్కర్ ఏసీ రైలు నడుపుతున్నట్లు ఇదివరకే రైల్వే పరిపాలన విభాగం ప్రకటించింది. అందులో భాగంగా శుక్రవారం తెల్లవారు జాము 5.30 గంటలకు కుర్లా టర్మినస్ నుంచి బయలుదేరిన రైలు ఉదయం 8.40 గంటలకు రోహా స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ డ్రైవర్, అసిస్టెంట్ డ్రైవర్, గార్డు మారుతారు. కాని సెంట్రల్, కొంకణ్ రైల్వేల మధ్య సమన్వయం లేకపోవడంతో రోహా స్టేషన్లో కేవలం గార్డు మాత్రమే అందుబాటులో ఉన్నారు. దీంతో కుర్లా నుంచి రైలును తీసుకెళ్లిన సెంట్రల్ రైల్వే డ్రైవర్ తాను రైలును ముందుకు తీసుకెళ్లలేనని మొండికేశాడు. దీంతో 75 నిమిషాలు రైలు అక్కడే నిలిచిపోయింది. అప్పటికే ఆ రైలు ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. ఏం జరిగిందో ప్రయాణికులకు తెలియదు. ఎనౌన్స్మెంట్ కూడా చేయకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహానికి గురయ్యారు. చివరకు సెంట్రల్ రైల్వే అధికారులతో చర్చలు జరిపి ఆ డ్రైవర్‌కు నచ్చజెప్పడంతో 9.55 గంటలకు రైలు ముందుకు కదలింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. -
సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై మెగాబ్లాక్
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం ఉదయం 11.00 గంట ల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతులు చేపట్టనున్నారు. దీని ఫలితంగా పలు లోకల్ రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లించనున్నారు. కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే పీఆర్వోలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెంట్రల్లో.. ములుండ్-మాటుంగా స్టేషన్ల మధ్య అప్ ఫాస్ట్ లైన్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. అప్ ఫాస్ట్ రైలు సేవలు ఠాణే తర్వాత స్లో ట్రాక్‌పై మళ్లిస్తారు. పరేల్ స్టేషన్ తర్వాత మళ్లి ఫాస్ట్ ట్రాక్‌పైకి మళ్లిస్తారు. స్లో ట్రాక్‌పైకి రాగానే సదరు రైళ్లు పరేల్ వరకు అన్ని స్టేషన్లలో హాల్ట్ అవుతాయి. ఆ తర్వాత యథావిధిగా నిర్ణీత స్టేషన్లలో ఆగుతాయి. ఇదిలా ఉండగా డౌన్ ఫాస్ట్ లైన్లో రైళ్లు ఘాట్కోపర్, విక్రోలి, భాండుప్, ములుండ్ స్టేషన్లలో అదనంగా హాల్ట్ చేస్తారు. ఈ సమయంలో లోకల్ రైళ్లన్నీ 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయి. హార్బర్లో.. హార్బర్ మార్గంలో నెరూల్-మాన్‌ఖుర్ద్ అప్, డౌన్ మార్గాల్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. డౌన్ లైన్లో సీఎస్టీ నుంచి పన్వెల్, బేలాపూర్, వాషిల మధ్య నడిచే సేవలు రద్దు చేయనున్నారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకూడదనీ అధికారులు సీఎస్టీ-మాన్‌ఖుర్ద్, ఠాణే-పన్వెల్ సెక్షన్ల మధ్య కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. హార్బర్ లైన్ ప్రయాణికులు మేయిన్ లైన్, లేదా ట్రాన్స్ హార్బర్ లైన్లో నడిచే లోకల్ రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుమతి కల్పించారు. -
మెట్రోకు ‘ప్లాట్‌ఫాం’ కష్టాలు..!
సాక్షి, ముంబై: మెట్రో ప్రయాణికులకు కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. ఇకపై ఘాట్కోపర్ మెట్రో స్టేషన్ మెయిన్ గేట్‌కు వెళ్లాలంటే ప్రయాణికులు తప్పనిసరిగా ప్లాట్‌ఫాం టికెట్ కొనాల్సి ఉంటుంది. మెట్రో ప్రయాణికులు ఘాట్కోపర్ స్టేషన్‌కు వెళ్లాలంటే సెంట్రల్ రైల్వేకు చెందిన ఘాట్కోపర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జి మీదుగా స్టేషన్‌ను ఆశ్రయించాల్సి ఉంటుంది. అయితే ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి సెంట్రల్ రైల్వేకి చెందినది కావడంతో మెట్రో ప్రయాణికులు ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోవాల్సి ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ... ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై అకస్మాత్తుగా మెట్రో ప్రయాణికుల వల్ల రద్దీ పెరిగిపోవడంతో లోకల్ రైలు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీంతో తమ ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగిస్తున్న మెట్రో ప్రయాణికులు ఇక మీదట ఫ్లాట్‌ఫాం టికెట్ చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరో వారంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి సమీపంలో టికెట్ విండో, ఏటీవీఎంలను ఏర్పాటుచేసేందుకు యోచిస్తున్నామన్నారు. కాగా మెట్రో ప్రారంభంలో సెంట్రల్ రైల్వే మెట్రో ప్రయాణికులకు తమ పరిధిలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించుకునేందుకు అనుమతించింది. కానీ ఇప్పుడు మెట్రో ప్రయాణికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఉపయోగించుకోవాలంటే ప్లాట్‌ఫాం టికెట్, లేదా రైల్వే పాస్ తప్పనిసరి చేశారు. ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోకుంటే మెట్రో ప్రయాణికులకు జరిమానా విధించనున్నట్లు సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్వో నరేంద్ర పాటిల్ తెలిపారు. రైల్వే ప్రవాసీ సంఘ్ అధ్యక్షుడు సుభాష్ గుప్తా మాట్లాడుతూ... ఈ విషయమై రైల్వే అధికారులతో త్వరలోనే మాట్లాడతానన్నారు. సెంట్రల్ రైల్వే పరిధిలోని ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి అదనంగా వేల సంఖ్యలో ప్రయాణికుల భారాన్ని మోయలేదని అభిప్రాయపడ్డారు. మెట్రో సేవలు ప్రారంభం కావడంతో ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ప్రయాణికుల సంఖ్య మరింతగా పెరిగిందని ఆయన తెలిపారు. -
పరేల్ స్టేషన్లో పరేషాన్‌లెన్నో..
సాక్షి, ముంబై: నగరంలో మెట్రో, మోనో రైళ్ల లాంటి సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ సెంట్రల్ రైల్వే మార్గంలోని పరేల్ స్టేషన్లో రద్దీ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ఈ స్టేషన్లో రోజురోజుకూ పెరుగుతున్న రద్దీ ప్రయాణికులకు తలనొప్పిగా మారుతోంది. ఇరుకైన ఫుట్ ఓవర్ బ్రిడ్జి (ఎఫ్ఓబీ), రెండు రైళ్లు ఒకేసారి వస్తే ఎటూ సరిపోని ప్లాట్‌ఫారంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నగరం, శివారు ప్రాంతాల్లో సెంట్రల్, పశ్చిమ రైల్వే మార్గాలు కేవలం దాదర్, పరేల్, ఎల్ఫిన్‌స్టన్‌రోడ్ స్టేషన్లోనే కలుస్తాయి. వర్సోవా-అంధేరీ- ఘాట్కోపర్‌ల మధ్య మెట్రో రైలు సేవలు ప్రారంభం కావడంతో దాదర్ స్టేషన్‌పై సుమారు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకు ప్రయాణికుల భారం తగ్గిపోయింది. కాని పరేల్-పశ్చిమ మార్గంలోని ఎల్ఫిన్స్టన్ రోడ్ స్టేషన్లపై ఏ మాత్రం ప్రభావం చూపలేదు. పరేల్ స్టేషన్ పరిసరాల్లో కళాశాలలు, కేం, వాడియా, టాటా క్యాన్సర్, గాంధీ తదితర ఆస్పత్రులున్నాయి. అదేవిధంగా ఎల్ఫిన్స్టన్ రోడ్ స్టేషన్ పరిసరాల్లో అనేక వాణిజ్య సంస్థలు, కార్పొరేట్ కార్యాలయాలు, బిగ్ బజార్, షాపింగ్ మాల్స్, మల్టీఫ్లెక్స్ థియేటర్లు ఉన్నాయి. దీంతో ఈ రెండు స్టేషన్లు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆస్పత్రులకు వెళ్లే రోగుల బంధువులు, పనులకు వెళ్లే ఉద్యోగుల రాకపోకలతో కిటకిటలాడుతుంటాయి. అయితే పరేల్‌లో ఇరుకైన ఎఫ్ఓబీతో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రెండు రైళ్లు ఒకేసారి వస్తే ప్లాట్‌ఫారంపై ఇసకేస్తే రాలనంత జనం ఉంటారు. స్టేషన్ బయటకు వెళ్లడానికి భారీ కసరత్తు చేయాల్సిందే. తోపులాటల్లో స్త్రీలు, పురుషులనే తేడా లేకుండా పోతోంది. ఇరుకైన ఎఫ్ఓబీ కారణంగా బయటకు రావాలంటే కనీసం 10 నిమిషాల సమయం పడుతోంది. రద్దీని నియంత్రించేందుకు అక్కడ ప్రత్యేకంగా పోలీసులను నియమించారు. పరేల్ స్టేషన్లో కేవలం రెండు ఎఫ్‌ఓబీలు ఉన్నాయి. అందులో ఒకటి (దాదర్ దిశలో ఉన్నది) సౌకర్యవంతంగా లేకపోవడంతో కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఇటీవల నిర్మించినప్పటికీ అది నిరుపయోగంగా మారింది. దీంతో పరేల్-ఎల్ఫిన్స్టన్ స్టేషన్లను కలిపే ఎఫ్‌ఓబీపైనే మొత్తం భారం పడుతోంది. ఈ బెడద నుంచి తప్పుకునేందుకు కొందరు దాదర్‌లోనే రైలు మారుతున్నారు.పరేల్‌లో ప్లాట్ఫారం మధ్యలో ఓ ఎఫ్ఓబీ నిర్మించి దీన్ని పరేల్- ఎల్ఫిన్‌స్టన్‌లను కలిపే పాత వంతెనతో కలిపితే చాలా ప్రయోజనకరంగా ఉంటుందని ప్రయాణికులు అంటున్నారు. కాని రైల్వే పరిపాలన విభాగం దీన్ని పట్టించుకోవడం లేదు. మెట్రో, మోనో లాంటి ఆధునిక సేవలు ఎన్ని వచ్చినా పరేల్ స్టేషన్లో ప్రయాణికులకు తలనొప్పులు మాత్రం తప్పవని తెలుస్తోంది. -
10 లోకల్ రైళ్లు పాక్షికంగా రద్దు
సాక్షి ముంబై: సెంట్రల్ రైల్వే పరిధిలోని ఠాణే-కల్యాణ్ మార్గంలోని లోకల్‌రైళ్లలో పదింటిని తొలగించారు. రైళ్ల ఇంజిన్ల కరెంటును మార్చడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఈ మార్గంలోని లోకల్ రైళ్ల సమయసూచికలోనూ భారీ మార్పులు ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు. ‘ఏసీ-డీసీ’ విద్యుత్ ప్రవాహం మార్పు వల్ల ఠాణే-కల్యాణ్ మార్గంలో కొత్త సమస్యలు తలెత్తాయి. మోటార్మెన్ల సమ్మె, పట్టాలకు పగుళ్లు పడటం, సిగ్నల్ సమస్య తలెత్తడం తదితర సమస్యలతో ఈ మార్గంలో రైళ్లకు తరచూ అవాంతరాలు ఏర్పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ‘ఏసీ’ విద్యుత్‌తో లోకల్, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తాయి. ముంబై సీఎస్టీ నుంచి కళ్యాణ్ వరకు సేవలు అందించే లోకల్‌రైళ్లు ‘డీసీ’ కరెంటుతో నడుస్తున్నాయి. దీంతో సెంట్రల్ రైల్వే విభాగం రైళ్లలో కరెంటు సరఫరాను ‘డీసీ’ నుంచి ‘ఏసీ’కి మార్చే పనులను ప్రతి ఆదివారం నిర్వహించే మెగాబ్లాక్ రోజున చేపట్టింది. మొదటి విడతలో ఠాణే నుంచి లోకమాన్య తిలక్ టెర్మినస్ వరకు ఐదు, ఆరో లైన్లను ‘డీసీ’ నుంచి ‘ఏసీ’ విద్యుత్‌కు మార్చారు. రెండో విడతలో ఠాణే నుంచి కల్యాణ్ వరకు పనులు పూర్తి చేశారు. ఈ పనుల వల్ల సెంట్రల్ రైల్వేకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఇకపై ‘డీసీ’ కరెంటుతో ప్రయాణించే 10 లోకల్ రైళ్లు కేవలం సీఎస్టీ నుంచి ఠాణే వరకు మాత్రమే నడుస్తాయి. ఠాణే తర్వాత ఏసీ కరెంటు లభించదు కాబట్టి వీటి సేవలు ఉండబోవు. ఇది వరకు మొత్తం 75 లోకల్ రైళ్లు ఠాణే తరువాత కూడా నడిచేవి. ఇప్పులు కేవలం 65 మాత్రమే సేవలు అందిస్తాయి. మరో సమస్య ఏమిటంటే.. లోకల్ రైళ్ల టైమ్ టేబుల్లో భారీ మార్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ‘డీసీ’ రైళ్ల సంఖ్య తగ్గింది కాబట్టి ఇతర రైళ్లతో టైమ్ టేబుల్‌ను కలపాల్సి వస్తుంది. దీంతో లోకల్ రైళ్ల సమయాలు చాలా వరకు మారిపోనున్నాయి. ఒక లోకల్ రైలు రోజుకు 10 ట్రిప్పులు వేస్తుంది. ఆ ప్రకారంగా సుమారు 100 ట్రిప్పులపై ప్రభావం పడనుంది. సీఎస్టీ-ఠాణే మార్గంలో ప్రతి రోజు ‘డీసీ’ లోకల్ రైళ్లు 218 ట్రిప్పులు ఉండేవి. వాటిలో సీఎస్టీ-కుర్లా, సీఎస్టీ-ఘాట్కోపర్, దాదర్-ఠాణే రైళ్లు కూడా ఉన్నాయి. సీఎస్టీ వరకు అన్ని లైన్లలో ‘ఏసీ’గా మార్చేందుకు సెంట్రల్ రైల్వేకు మే నెల వరకు సమయం పడుతుంది.