పట్టాలు తప్పిన ముంబై-హౌరా మెయిల్‌ | Three Coaches Of 12809 Mumbai-Howrah Mail Derail In Maharashtra | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన ముంబై-హౌరా మెయిల్‌

Published Sun, Jun 10 2018 8:31 AM | Last Updated on Mon, Oct 8 2018 6:18 PM

Three Coaches Of 12809 Mumbai-Howrah Mail Derail In Maharashtra - Sakshi

ప్రమాదానికి గురైన ముంబై-హౌరా రైలు

సాక్షి, ముంబై : మహారాష్ట్రలోని ఇగత్‌పురి రైల్వే స్టేషన్‌ సమీపంలో హౌరా మెయిల్‌ రైలు ఆదివారం వేకువజామున 2 గంటల సమయంలో పట్టాలు తప్పింది. అయితే అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానట్లు తెలిసింది. రైల్వే భద్రతా సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం కారణంగా ఆ మార్గంలో వెళ్లే 12 రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. ఏడు రైళ్లను దారి మళ్లించారు.
 
12809 ముంబై-హౌరా మెయిల్‌కు సంబంధించి మూడు బోగీలు(కోచ్‌లు) పట్టాలు తప్పాయని, అవి ఎస్‌-12, ఎస్‌-13, పాంట్రీ కారుగా గుర్తించినట్లు సెంట్రల్‌ రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ సునీల్‌ ఉడాసీ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement