సాక్షి, ముంబై: టికెట్ కౌంటర్ల వద్ద రద్దీని తగ్గించేదిశగా సెంట్రల్ రైల్వే అడుగులు వేస్తోంది. ఇందుకోసం రూ.9.85 కోట్లను వెచ్చించి మరిన్ని ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ (ఏటీవీఎం)లు, జన్ సాధారణ్ టికెట్ బుకింగ్ సేవక్ (జేటీబీఎస్) కౌంటర్లను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతం సెంట్రల్ రైల్వేలో 300 ఏటీవీఎంలు అందుబాటులో ఉన్నాయి. మరో 400 ఏటీవీఎంలు, 200 జేటీబీఎస్‌లను కొనుగోలు చేయనుంది. ప్రస్తుతం 174 జేటీబీఎస్‌లు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. జేటీబీఎస్‌లను దుకాణదారులు తమ ఆవరణలో ఏర్పాటు చేసుకొని ప్రయాణికులకు టికెట్లను విక్రయిస్తున్నారు. తద్వారా కమీషన్ పొందుతున్నారు. సెంట్రల్ రైల్వే గణాంకాల ప్రకారం జేటీబీఎస్‌ల ద్వారా 45 శాతం టికెట్లు అమ్ముడవుతున్నాయి.
జేటీబీఎస్‌ల ద్వారా 60 శాతం మేర టికెట్ విక్రయాలను పెంచేందుకు రైల్వే అధికారులు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం సెంట్రల్‌రైల్వేలో ఏటీవీఎంల ద్వారా 15 నుంచి 19 శాతందాకా టికెట్లు అమ్ముడవుతున్నాయి. ఇదిలా వుండగా సెంట్రల్ రైల్వేలో 431 టికెట్ కౌంటర్లు ఉన్నాయి. వీటిలో సిబ్బంది రెండు షిఫ్టులలో పని చేస్తున్నారు. మూడో షిఫ్టుకు తగినంత సిబ్బంది లేకపోవడంతో అనేక కౌంటర్లను మూసివేయాల్సి వస్తోంది. దీంతో మిగతా కౌంటర్ల వద్ద ప్రయాణికులు టికెట్ల కోసం బారులు తీరుతున్నారు.
ఇంకా సౌకర్యవంతంగా
Published Wed, Oct 23 2013 11:43 PM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
Advertisement
Advertisement