ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం ఉదయం 11.00 గంట ల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతులు చేపట్టనున్నారు. దీని ఫలితంగా పలు లోకల్ రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లించనున్నారు. కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే పీఆర్వోలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
సెంట్రల్‌లో..
ములుండ్-మాటుంగా స్టేషన్ల మధ్య అప్ ఫాస్ట్ లైన్‌లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. అప్ ఫాస్ట్ రైలు సేవలు ఠాణే తర్వాత స్లో ట్రాక్‌పై మళ్లిస్తారు. పరేల్ స్టేషన్ తర్వాత మళ్లి ఫాస్ట్ ట్రాక్‌పైకి మళ్లిస్తారు. స్లో ట్రాక్‌పైకి రాగానే సదరు రైళ్లు పరేల్ వరకు అన్ని స్టేషన్లలో హాల్ట్ అవుతాయి. ఆ తర్వాత యథావిధిగా నిర్ణీత స్టేషన్లలో ఆగుతాయి. ఇదిలా ఉండగా డౌన్ ఫాస్ట్ లైన్‌లో రైళ్లు ఘాట్కోపర్, విక్రోలి, భాండుప్, ములుండ్ స్టేషన్లలో అదనంగా హాల్ట్ చేస్తారు. ఈ సమయంలో లోకల్ రైళ్లన్నీ 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయి.
హార్బర్‌లో..
హార్బర్ మార్గంలో నెరూల్-మాన్‌ఖుర్ద్ అప్, డౌన్ మార్గాల్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. డౌన్ లైన్‌లో సీఎస్టీ నుంచి పన్వెల్, బేలాపూర్, వాషిల మధ్య నడిచే సేవలు రద్దు చేయనున్నారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకూడదనీ అధికారులు సీఎస్టీ-మాన్‌ఖుర్ద్, ఠాణే-పన్వెల్ సెక్షన్ల మధ్య కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. హార్బర్ లైన్ ప్రయాణికులు మేయిన్ లైన్, లేదా ట్రాన్స్ హార్బర్ లైన్‌లో నడిచే లోకల్ రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుమతి కల్పించారు.
సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై మెగాబ్లాక్
Published Sat, Aug 16 2014 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 11:58 AM
Advertisement