mega block
-
నేడు హార్బర్లో మెగాబ్లాక్,లోకల్ ట్రైన్స్ రద్దు
సాక్షి ముంబై: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీని ప్రభావం లోకల్ రైళ్లతోపాటు మెయిల్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలపై కూడా పడనుంది. దీంతో పలు లోకల్ రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించి నడుపనున్నారు. అదేవిధంగా కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. అత్యవసర సేవలందించే వారికోసం నడుపుతున్న లోకల్ సేవలకు కొంతమేర అంతరాయం ఏర్పడనుంది. సెంట్రల్ రైల్వే మార్గంపై.. సెంట్రల్ రైల్వే మార్గంలోని మాటుంగా – ములూండ్ రైల్వే స్టేషన్ల మధ్య అప్, డౌన్ ఫాస్ట్ ట్రాక్‌పై ఉదయం 11.05 గంటల నుంచి సాయంత్రం 4.05 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో అప్, డౌన్ ఫాస్ట్ ట్రాక్‌పై నడిచే లోకల్ రైళ్లను మాటుంగా – ములూండ్ రైల్వేసైఏ్టషన్ల మధ్య డౌన్ స్లో ట్రాక్‌పైకి మళ్లించనున్నారు. దీంతో ఈ రైళ్లన్ని మాటుంగా–ములూంలడ్ రైల్వే స్టేషన్ల మధ్య అన్ని రైల్వేస్టేషన్లలో నిలువనున్నాయి. అయితే అప్ ఫాస్ట్ రైళ్లు మాటుంగా తర్వాత, డౌన్ ఫాస్ట్ రైళ్లు ములూండ్ తర్వాత మళ్లీ ఫాస్ట్ ట్రాక్‌లపైకి మళ్లించనున్నారు. దీంతో రెళ్లన్ని సుమారు 15 నిమిషాలు ఆలస్యంగా నడవనున్నాయి. హార్బర్లో.. హార్బర్ మార్గంలో మాన్‌ఖుర్డ్ – నేరుల్ల మధ్య అప్‌డౌన్ మార్గంలో ఉదయం 11.15 గంటల నుంచి సాయంత్రం 4.15 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో మెగాబ్లాక్ సమయంలో సీఎస్ఎంటీ–పన్వెల్/బేలాపూర్/వాషీల మధ్య అప్‌డౌన్ మార్గాల్లో నడిచే లోకల్ రైళ్లను రద్దు చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కొన్ని ప్రత్యేక లోకల్ రైళ్లను పన్వేల్–కుర్లా, కుర్లా–సీఎస్‌ఎంటీల మధ్య నడపనున్నారు. ప్రయాణికుల ఇబ్బందులకు గురికాకుండా ఉండేందుకు ఛత్రపతి శివాజీ మహారాజు టెర్మినస్ (సీఎస్ఎంటీ) – మాన్ఖుర్డ్ల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు. అదేవిధంగా సెంట్రల్ మార్గంలోని మెయిన్ మార్గంలో వెళ్లే ప్రయాణికులు థనే–పన్వేల్ ట్రాన్స్‌హార్బర్ మార్గంలో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సెంట్రల్ రైల్వే ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
నేడు రైల్వే మెగా బ్లాక్
♦ పలు రైళ్లు రద్దు,దారి మళ్లింపు ♦ ఆలస్యంగా నడవనున్న మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు ♦ సాయంత్రం 4 గంటలకు జరగనున్న మెగా బ్లాక్ సాక్షి, ముంబై : సెంట్రల్ రైల్వే, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం మెగా బ్లాక్ నిర్వహించనున్నారు. దీని పరిణామంగా పలు లోకల్ రైళ్లు రద్దు చేయగా మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లించి నడపనున్నారు. హార్బర్ లైన్ అప్, డౌన్ మార్గంలో మసీద్-చూనాబట్టి రైల్వేస్టేషన్ల మధ్య, వడాలా-మహీం రైల్వేస్టేషన్ల మధ్య అప్, డౌన్ మార్గాల్లో కూడా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మెగా బ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)-వాషి, బేలాపూర్, పన్వెల్‌ల మధ్య నడిచే లోకల్ రైళ్లన్నింటిని మెగా బ్లాక్ సమయంలో రద్దు చేశారు. మెగా బ్లాక్ సమయలో ప్రత్యేకంగా కుర్లా-పన్వెల్‌ల మధ్య లోకల్ రైళ్లు నడపనున్నారు. సీఎస్టీ-బాంద్రా, అంధేరి మధ్య నడిచే లోకల్ రైళ్లన్నింటినీ మెగా బ్లాక్ సమయంలో రద్దు చేశారు. ఈ మార్గంపై ప్రయాణించే వారంతా సెంట్రల్ రైల్వే ప్రధాన మార్గం, వెస్టర్న్ రైల్వే మార్గంపై తమ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. సెంట్రల్ ప్రధాన మార్గంలో.. సెంట్రల్ ప్రధాన మార్గంలో థానే-కల్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య డౌన్ ఫాస్ట్‌ట్రాక్‌పై ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మెగా బ్లాక్ జరగనుంది. దీంతో ఛత్రపతి శివాజీ టర్మినస్ (సీఎస్టీ)లో ఉదయం 9.37 గంటల నుంచి మధ్యాహ్నం 2.25 గంటల మధ్య ఫాస్ట్‌ట్రాక్ మీదుగా నడిచే రైళ్లన్నింటినిథానే-కల్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య స్లోట్రాక్ మీదుగా మళ్లించనున్నారు. అలాగే ఈ సమయంలో థానే-కల్యాణ్ మధ్య ఉన్న రైల్వే స్టేషన్లన్నింటిలో ఫాస్ట్ లోకల్ రైళ్లను నిలపనున్నట్లు అధికారులు తెలిపారు. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. మెగా బ్లాక్ నేపథ్యంలో దూరప్రాంతాలకు నడిచే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లపై కూడా ప్రభావం పడనుంది. లోకమాన్య తిలక్ టర్మినస్ (ఎల్టీటీ- కుర్లా) నుంచి ఉదయం 11.40 గంటలకు బయలుదేరాల్సిన 16345 డౌన్ నేత్రవతి ఎక్స్‌ప్రెస్ రైలు మెగా బ్లాక్ కారణంగా మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరనుంది. అలాగే థానే, కల్యాణ్ రైల్వేస్టేషన్ల మధ్య దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లన్నింటిని స్లోమార్గంపై మళ్లించనున్నట్లు సెంట్రల్ రైల్వే పేర్కొంది. వెస్టర్న్ మార్గంలో.. వెస్టర్న్ రైల్వేమార్గంలో బాంద్రా నుంచి అంధేరీల మధ్య డౌన్ స్లో మార్గంపై ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. పరిణామ క్రమంలో చర్చిగేట్ నుంచి నడిచే అంధేరి, బోరివలి, విరార్ తదితర లోకల్ రైళ్లన్నింటిని బాంద్రా-అంధేరీ రైల్వేస్టేషన్ల మధ్య డౌన్ హార్బర్ మార్గంపై మళ్లించి నడపనున్నారని వెస్టర్న్ రైల్వే తెలిపింది. -
సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై మెగాబ్లాక్
ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: సెంట్రల్, హార్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం ఉదయం 11.00 గంట ల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతులు చేపట్టనున్నారు. దీని ఫలితంగా పలు లోకల్ రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లించనున్నారు. కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే పీఆర్వోలు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సెంట్రల్లో.. ములుండ్-మాటుంగా స్టేషన్ల మధ్య అప్ ఫాస్ట్ లైన్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. అప్ ఫాస్ట్ రైలు సేవలు ఠాణే తర్వాత స్లో ట్రాక్‌పై మళ్లిస్తారు. పరేల్ స్టేషన్ తర్వాత మళ్లి ఫాస్ట్ ట్రాక్‌పైకి మళ్లిస్తారు. స్లో ట్రాక్‌పైకి రాగానే సదరు రైళ్లు పరేల్ వరకు అన్ని స్టేషన్లలో హాల్ట్ అవుతాయి. ఆ తర్వాత యథావిధిగా నిర్ణీత స్టేషన్లలో ఆగుతాయి. ఇదిలా ఉండగా డౌన్ ఫాస్ట్ లైన్లో రైళ్లు ఘాట్కోపర్, విక్రోలి, భాండుప్, ములుండ్ స్టేషన్లలో అదనంగా హాల్ట్ చేస్తారు. ఈ సమయంలో లోకల్ రైళ్లన్నీ 15 నుంచి 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయి. హార్బర్లో.. హార్బర్ మార్గంలో నెరూల్-మాన్‌ఖుర్ద్ అప్, డౌన్ మార్గాల్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. డౌన్ లైన్లో సీఎస్టీ నుంచి పన్వెల్, బేలాపూర్, వాషిల మధ్య నడిచే సేవలు రద్దు చేయనున్నారు. ప్రయాణికులు అసౌకర్యానికి గురి కాకూడదనీ అధికారులు సీఎస్టీ-మాన్‌ఖుర్ద్, ఠాణే-పన్వెల్ సెక్షన్ల మధ్య కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నారు. హార్బర్ లైన్ ప్రయాణికులు మేయిన్ లైన్, లేదా ట్రాన్స్ హార్బర్ లైన్లో నడిచే లోకల్ రైళ్ల ద్వారా తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అనుమతి కల్పించారు. -
నేడు రైల్వే మార్గాలపై మెగాబ్లాక్
సాక్షి, ముంబై: సెంట్రల్, హార్బర్, వెస్టర్న్ రైల్వే మార్గాలపై ఆదివారం మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు మెగాబ్లాక్ కొనసాగనుంది. రైల్వే ట్రాక్‌లు, ఓవర్ హెడ్ వైర్ల మరమ్మతులు, నిర్వహణ పనులు చేపట్టనున్న నేపథ్యంలో సెలవు దినమైన ఆదివారం మెగాబ్లాక్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఈ ఆదివారం నిర్వహించే మెగాబ్లాక్ కారణంగా పలు లోకల్ రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లించనున్నారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు సెంట్రల్, వెస్టర్న్ రైల్వే పీఆర్వోలు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సెంట్రల్లో... భైకళా-విద్యావిహార్‌ల మధ్య డౌన్ స్లో ట్రాక్‌పై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.21 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. డౌన్ స్లో ట్రాక్‌పై నడిచే లోకల్ రైళ్లను ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లిస్తారు. దీంతో భైకళా అనంతరం పరెల్, దాదర్, మాటుంగా, సైన్ కూర్లా స్టేషన్లలో మాత్రమే హాల్ట్ అవుతాయి. అనంతరం విద్యావిహార్ నుంచి స్లో మార్గంపైకి మళ్లించి నడపనున్నారు. మరోవైపు ఠాణే నుంచి అప్ ఫాస్ట్ ట్రాక్‌పై నడిచే రైళ్లు ఉదయం 11.21 గంటల నుంచి మధ్యాహ్నం 3.25 గంటల వరకు ములూండ్, భాండూప్, విక్రోలి, ఘాట్కోపర్, కుర్లాలో నిలుపనున్నారు. మరోవైపు ఛత్రపతి శివాజీ టెర్మినస్ (సీఎస్టీ) నుంచి ఫాస్ట్ లోకల్ రైళ్లన్నీ ఉదయం 11.15 గంటల నుంచి మధ్యాహ్నం 2.51 గంటల వరకు ఘాట్కోపర్ అనంతరం విక్రోలి, భాండూప్, ములూండ్‌లలో కూడా నిలపుతారు. హార్బర్లో... హార్బర్ మార్గంలో కుర్లా-సీఎస్‌టీల మధ్య అప్ మార్గం, వాడాలా-మాహీంల మధ్య అప్ డౌన్ మార్గాలపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో డౌన్ హార్బర్ మార్గంలో బాంద్రా/అంధేరి- సీఎస్‌టీల మధ్య ఇరు మార్గాలపై నడిచే లోకల్ రైళ్లను మెగాబ్లాక్ నిర్వహించే సమయంలో రద్దు చేశారు. మరోవైపు అప్ హార్బర్ మార్గంలో కుర్లా-సీఎస్‌టీల మధ్య నడిచే లోకల్ రైళ్లన్నీ ఉదయం 11.08 గంటల నుంచి మధ్యాహ్నం 3.20 గంటల వరకు ప్రధాన మార్గం మీదుగా నడపనున్నారు. ఈ లోకల్ రైళ్లను కరీ రోడ్డు, చించ్‌పోక్లీ స్టేషన్లలో కూడా నిలుపనున్నారు. పశ్చిమ రైల్వేలో.. పశ్చిమ రైల్వే మార్గంలోని మరీన్ లైన్స్ నుంచి మాహీంల మధ్య డౌన్ స్లో ట్రాక్‌పై మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. దీంతో సదరు స్టేషన్ల మధ్య నడిచే లోకల్ రైళ్లను ఫాస్ట్ ట్రాక్‌పై మళ్లిస్తారు. ఈ క్రమంలో మహాలక్ష్మి, ఎల్ఫిన్స్టన్ రోడ్, మాటుంగా రోడ్ స్టేషన్లలో ఈ రైళ్లకు హాల్ట్‌లు ఉండవని రైల్వే ప్రకటించింది. దీంతోపాటు కొన్ని లోకల్ రైళ్లను రద్దు కూడా చేశారు.