
తిరువనంతపురం: కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. షోర్నూర్ సమీపంలో రైల్వేట్రాక్‌పై చెత్త శుభ్రం చేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులను వేగంగా వచ్చిన కేరళ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతుల్లో ఇద్దరు పురుషులు కాగా ఇద్దరు మహిళలు. వీరిలో ముగ్గురి మృతదేహాలు ఘటనాస్థలంలో దొరికాయి. మరో మృతదేహం పక్కనే ఉన్న నదిలో పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ట్రాక్‌పై వస్తున్న రైలును కార్మికులు గమనించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని, ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: వేడివేడి కిచిడీ పడి భక్తులకు తీవ్ర గాయాలు
Comments
Please login to add a commentAdd a comment