19న యూపీ సస్పెన్స్ కు తెర | Uttar Pradesh: Oath ceremony of new UP CM and ministers to be held on 19th March | Sakshi
Sakshi News home page

19న యూపీ సస్పెన్స్ కు తెర

Published Fri, Mar 17 2017 1:21 PM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

19న యూపీ సస్పెన్స్ కు తెర

19న యూపీ సస్పెన్స్ కు తెర

లక్నో: ఉత్తరప్రదేశ్‌ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ నెల 19న నూతన ప్రభుత్వం కొలువుతీరనుంది. లక్నోలోని స్మృతివనంలో జరిగే కార్యక్రమంలో కొత్త ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరుకానున్నారు.

ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనేది ఇప్పటివరకు ఖరారు కాలేదు. ఇటీవల ముగిసిన యూపీ ఎన్నికల్లో బీజేపీ 312 సీట్లు గెల్చుకుంది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు శనివారం సమావేశమై తమ నాయకుడిని ఎన్నుకునే అవకాశముంది. కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్, టెలికం మంత్రి మనోజ్ సిన్హా, బీజేపీ యూపీ అధ్యక్షుడు కేశవ్ ప్రసాద్ మౌర్య పేర్లు ముఖ్యమంత్రి పదవికి బలంగా విన్పిస్తున్నాయి. వీరిలో ఎవరు సీఎం అవుతారనేది ఆదివారం తేలిపోతుంది.

కాగా, యూపీ సీఎం రేసులో తాను లేనని, ఇటువంటి రేసుల గురించి తనకు తెలియదని మనోజ్ సిన్హా వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement