
కోరుకున్న వెంటనే రైల్వే బెర్తు!
న్యూఢిల్లీ: ప్రయాణికులు కోరుకున్న వెంటనే రిజర్వేషన్ కల్పించే వెసులుబాటును 2020 కల్లా సిద్ధం చేయాలని రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. వెయింటింగ్ లిస్టు పెద్దగా ఉంటోందని, అందుబాటులో ఉన్న సీట్లు-ప్రయాణికుల సంఖ్యలో భారీ తేడా ఉంటోందని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ప్రయాణికుల అవసరాలు, ప్రస్తుతం ఉన్న రైల్వే మౌలిక సదుపాయాలకు మధ్య తేడా చాలా ఉందన్నారు.
‘స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశంలో రైల్వే ట్రాఫిక్ 20 శాతం పెరిగింది. మౌలిక సదుపాయాలు కేవలం 2.25 శాతమే పెరిగాయి. ఈ రెండింటి మధ్య తేడా భారీగా ఉంద’ని మనోజ్ సిన్హా అన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు.