Railway Reservation
-
రైల్వే రిజర్వేషన్లో కొత్త రూల్! ప్రాధాన్యత వారికే..
రైల్వే రిజర్వేషన్, బెర్తుల కేటాయింపులో ఇండియన్ రైల్వే కొత్త రూల్‌ను అమలు చేసింది. లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్లో వృద్ధ ప్రయాణికులకు ప్రాధాన్యతనిస్తూ కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ప్రయాణంలో సీనియర్ సిటిజన్ల ఇబ్బందులను తొలగించడానికి భారతీయ రైల్వే ఈ చర్య చేపట్టింది. తాజా మార్గదర్శకాల ప్రకారం.. సీనియర్ సిటిజన్లు లోయర్ బెర్త్‌లను రిజర్వ్ చేసుకోవడానికి అర్హులు. పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రయాణికుల విభిన్న అవసరాలను తీర్చడంలో రైల్వే నిబద్ధతను ఈ నిబంధన తెలియజేస్తుంది. పైకి ఎక్కలేని వృద్ధులకు లోయర్ బెర్త్‌ను బుక్ చేసుకున్నప్పటికీ అప్పర్ బెర్త్‌ల కేటాయించడంపై సోషల్ మీడియాలో లేవనెత్తిన ప్రయాణికుల ఆందోళనకు ప్రతిస్పందనగా ఇండియన్ రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సమస్యను పరిష్కరిస్తూ సీనియర్ సిటిజన్లకు లోయర్ బెర్త్ రిజర్వేషన్లను పొందే ప్రక్రియను స్పష్టం చేసింది. ఇండియన్ రైల్వే అందించిన స్పష్టీకరణ ప్రకారం.. ప్రయాణికులు లోయర్ బెర్త్ కోసం బుకింగ్ సమయంలో తప్పనిసరిగా రిజర్వేషన్ ఛాయిస్ ఎంపికను ఎంచుకోవాలి. అయితే బెర్తుల కేటాయింపులు లభ్యతకు లోబడి ఉంటాయి. ముందుగా రిజర్వ్ చేసుకున్నవారికి ముందుగా ప్రాతిపదికన లోయర్ బెర్త్‌లు కేటాయిస్తున్నట్లు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. లోయర్ అవసరమైన ప్రయాణికులు రైలు టిక్కెట్ ఎగ్జామినర్ (TTE)ను సంప్రదించవచ్చని, లోయర్ బెర్త్‌లు అందుబాటులో ఉంటే కేటాయించే అవకాశం ఉంటుందని పేర్కొంది. -
రైలు ప్రయాణికులకు అలర్ట్.. రిజర్వేషన్ సేవలకు బ్రేక్!
ఢిల్లీ, చుట్టుపక్కల రాష్ట్రాలలో నడిచే రైళ్లకు రిజర్వేషన్ చేయాలనుకుంటున్న ప్రయాణికులు శుక్రవారం రాత్రికి ముందే చేసేయండి. ఎందుకంటే ఢిల్లీ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS)కు సంబంధించిన అన్ని సేవలు శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు పనిచేయవు. అయితే, సర్వీసులు నిలిచిపోయిన సమయంలో చాలా తక్కువ మంది మాత్రమే అసౌకర్యానికి గురవుతారని రైల్వే పేర్కొంది. చాలా కొద్ది మంది మాత్రమే ఈ సేవలను ఉపయోగిస్తున్నారని రైల్వే చెబుతోంది. పీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ఐదు నగరాల నుండి పనిచేస్తుంది. వీటిలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, గౌహతి ఉన్నాయి. ఢిల్లీ పీఆర్ఎస్ వ్యవస్థను శుక్రవారం రాత్రి తాత్కాలికంగా మూసివేయనున్నారు. అంటే ఢిల్లీ పీఆర్ఎస్ ద్వారా నిర్వహించే అన్ని రైళ్లలో రిజర్వేషన్, రద్దు, విచారణ (139, కౌంటర్ సర్వీస్), ఇంటర్నెట్ బుకింగ్‌తో సహా అన్ని రకాల సేవలు ఏప్రిల్ 12వ తేదీ రాత్రి 11.45 గంటల నుండి ఏప్రిల్ 13వ తేదీ ఉదయం 04.15 గంటల వరకు దాదాపు 04.30 గంటల పాటు నిలిచిపోతాయి. ఈ సమయంలో ఢిల్లీ పీఆర్ఎస్కు సంబంధించిన ఏ పనిని మరే ఇతర నగరంలోని పీఆర్ఎస్ నుండి చేయలేము. రిజర్వేషన్ లేదా మరేదైనా పనిని పూర్తి చేయాలనుకుంటే, శుక్రవారం రాత్రికి ముందే పూర్తి చేయండి.. లేకపోతే మీరు శనివారం ఉదయం మాత్రమే పూర్తి చేయగలుగుతారు. -
Indian Railways: ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీల మోత
Indian Railways continue To reservations For passenger trains second class Journey: సెకండ్ క్లాస్ ప్రయాణాలను రిజర్వేషన్ కేటగిరీలో కొనసాగించడంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. సామాన్యుడికి రిజర్వేషన్ ఛార్జీల భారం తప్పదని పరోక్షంగా తేల్చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ప్యాసింజర్ రైళ్లలో ద్వితియ శ్రేణి తరగతిలో ప్రయాణాలకు ‘రిజర్వేషన్’ కొనసాగుతుందని పార్లమెంట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎదురైన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. కరోనా ఫస్ట్ ఫేజ్ తర్వా తి సడలింపులతో భారతీయ రైల్వే శాఖ ‘కొవిడ్ స్పెషల్’ పేరిట ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆ టైంలో ప్యాసింజర్ రైళ్లను మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లుగా, పండుగ స్పెషల్‌గా మార్చేసి ఎక్కువ ఛార్జీలతో రైళ్లను నడిపించింది భారతీయ రైల్వేస్. పైగా సెకండ్ క్లాస్ సహా అన్ని కేటగిరీలను రిజర్వేషన్ కోటాలోకి మార్చేసింది. అయితే.. తాజాగా కొవిడ్ స్పెషల్ కేటగిరీని ఎత్తేస్తూ.. రెగ్యులర్ సర్వీసులుగా వాటిని మార్చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. దీంతో టికెట్ రేట్లు తగ్గుతాయని, సామాన్యుడికి ఊరట లభించిందని, ప్యాసింజర్ రైళ్లు ప్రయాణికుల కోలాహలంతో పూర్వవైభవం సంతరించుకోవచ్చని భావించారంతా. కానీ,. అనూహ్యంగా ప్యాసింజర్ రైళ్లలో సెకండ్‌క్లాస్ ప్రయాణాలకు ఇంకా రిజర్వేషన్ కేటగిరీ కిందే కొనసాగుతోంది. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు రైల్వే మంత్రి పార్లమెంట్లో బదులిచ్చారు. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ప్రయాణాలకు, ప్రయాణికులు రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసర లేదంటే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే మాత్రం.. కొన్ని రైళ్లకు మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీంతో రిజర్వేషన్ ఛార్జీల రూపంలో సామాన్యుడికి మోత మోగనుంది. అంతేకాదు తక్కువ దూరం ప్రయాణాలైనా సరే.. రిజర్వేషన్ కింద భారం మోయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రవాణాశాఖ నివేదికల ప్రకారం.. 364 ప్యాసింజర్ రైళ్లను 2020-2021 ఏడాది మధ్య ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా మార్చేసి నడిపించింది రైల్వే శాఖ. సెకండ్ క్లాస్ కేటగిరీలో సగటున రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా. సింగిల్ క్లిక్‌తో 35పై.లకే 10 లక్షల ఇన్సూరెన్స్ -
రైల్వే రిజర్వేషన్ టికెట్ల సొమ్ము వాపసు
సాక్షి, అమరావతి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వాల్తేరు డివిజన్లో ప్రయాణికులకు టికెట్ రిజర్వేషన్ కింద రూ.7.50 కోట్ల సొమ్మును రైల్వేశాఖ వాపసు ఇచ్చింది. కరోనా జాతీయ విపత్తు నేపథ్యంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 14 వరకు ఆన్లైన్, కౌంటర్ల ద్వారా రిజర్వేషన్ టికెట్లు పొందిన ప్రయాణికులకు రైల్వేశాఖ డబ్బు వాపసు చేసింది. -
పండగకు ప్రయాణమెలా..!
శ్రీకాకుళం: సదూర ప్రాంతాల్లో ఉంటున్నవారు రానున్న సంక్రాంతి పండగ సెలవుల్లో సొంత ఊర్లకు రాకపోకలు సాగించేందుకు ప్రయాణ పాట్లు తప్పేలా లేవు. నెల రోజుల క్రితమే జనవరి నెలాఖరు వరకు రైల్వే రిజర్వేషన్లు పూర్తికావడం, రిగ్రిట్‌గా చూపిస్తున్న రైల్వే రిజర్వేషన్‌తో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. పండగ సీజన్లో అదనపు బోగీలు ఏర్పాటు చేసే దిశగా రైల్వే అధికారులు యోచించడం లేదు. ప్రత్యేక రైళ్లను నడుపుతారా లేదా అన్నది ఇప్పటివరకు ప్రకటనే చేయలేదు. గత ఏడాది వరకు ప్రత్యేక రైళ్లను నడిపితే అదనంగా వసూళ్లు చేస్తుండడాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు. ఇటువంటి ట్రైన్లలో ధరలు రోజురోజుకు మారిపోతూ కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా అని ఆర్టీసీ బస్సుల్లో వెళ్దామంటే వారు సైతం రిజర్వేషన్లు సైట్లను నిలుపుదల చేశారు. ప్రత్యేక బస్సులను నడిపినా 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేసే పద్ధతి గతం నుంచి ఆర్టీసీ అమలు చేస్తోంది. సాధారణ రోజుల్లోనే రైల్వే చార్జీల కంటే ఆర్టీసీ చార్జీలు ఎక్కువ కాగా, పండగ రోజుల్లో డిమాండ్‌ను బట్టి రెండు నుంచి మూడు రెట్లు వసూలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రైవేటు యాజమాన్యాలు మరింత దారుణంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే 20 శాతం వరకు రేట్లను పెంచేశాయి. సంక్రాంతి అనంతరం మరో వారం రోజుల పాటు టికెట్ ధరపై రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకు అదనంగా వసూలు చేయడం పరిపాటిగా మారింది. ఏటా ఇదే తరహాలో ప్రయాణికులను రైల్వే, ఆర్టీసీ, ప్రైవేటు యాజమాన్యాలు దోచేస్తున్నాయి. ఈ ఏడాది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు తొలుత 8 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు అని విద్యాశాఖ కేలండర్లో పొందుపరిచారు. అయితే జన్మభూమి కార్యక్రమం నిర్వహిస్తున్న కారణంగా ఈ సెలవులను 12 నుంచి 22వ తేదీ వరకు ఇవ్వాలని ప్రభుత్వం నిశ్చయించింది. జన్మభూమి అని కారణం చెప్పకుండా వేరొక సాకు చూపించి ఈ సెలవులను మార్పు చేశారు. చాలా మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు 8వ తేదీ నుంచి సెలవులని భావించి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఇప్పుడు వీరంతా వీటిని మార్చుకోవాల్సి ఉంది. ఇంకొందరు సెలవులపై స్పష్టత లేకపోవడంతో రిజర్వేషన్ చేయించకుండా ఇప్పటివరకు వేచి చూశారు. ఇప్పుడు స్పష్టత వచ్చినా రిజర్వేషన్లు దొరక్కపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రైల్వే, ఆర్టీసీ అదనపు చార్జీలు లేకుండా ప్రత్యేక సర్వీసులను నడపాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. -
రైల్వే కీలక నిర్ణయం
-
రైల్వే శాఖ కీలక నిర్ణయం
సాక్షి,న్యూఢిల్లీ: గ్రీన్ ఇనీషియేటివ్‌లో భాగంగా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే రిజర్వేషన్‌కు సంబంధించిన చార్ట్‌ను ఇకపై రైల్వే కోచ్‌లపై అతికించడాన్ని నిలిపివేయనుంది. మార్చి 1వ తేదీ నుంచి ఈ పద్ధతిని నిలిపివేస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పటికే న్యూఢిల్లీ, హజరత్ నిజాముద్దీన్, ముంబయ్ సెంట్రల్, చెన్నై సెంట్రల్ రైల్వే, సీల్దా స్టేషన్లో గత మూడు నెలలుగా ఈ విధానం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. దీనిని ఏ1, ఏ రైల్వేస్టేషన్లలో ఫైలెట్ ప్రాజెక్టుగా ఆరు నెలలపాటు చేపట్టనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ మేరకు అన్ని జోన్లకు ఆదేశాలు జారీ చేసింది. తద్వారా ప్రపంచంలోని అతి పెద్ద నెట్వర్క్ భారతీయ రైల్వే పేపర్‌కోసం అవుతున్న డబ్బును ఆదా చేయాలని లక్ష్యంగాపెట్టుకుంది. ఇప్పటికే ఈ పద్ధతిని అమలు చేస్తున్నప్పటికీ ఇప్పుడు అన్ని రైల్వేలలో ఆరు నెలలపాటు పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. తాజా నిర్ణయంతో రిజర్వేషన్ చార్ట్‌లకు బదులుగా డిజిటల్ బోర్డులను రైల్వేస్టేషన్లో మెరుగు పరుస్తామని రైల్వే శాఖ తెలిపింది. డిజిటలైజేషన్లో భాగంగా ఇ-టికెటింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. కాగిత రహిత కార్యకలాపాలను ప్రోత్సహించాలనే యోచనలో భాగంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. దీంతో సంవత్సరానికి 28టన్నుల పేపర్‌ను ఆదా చేయడంతో పాటు రూ.1.70లక్షల ఖర్చును ఆదా చేయాలని భావిస్తోంది. కాగా ప్రయాణీకుల నుంచి వచ్చే ఆదాయం ఆధారంగా, రైల్వేలు దాని స్టేషన్లను ఏ, ఏ1, బీ,సీ,డీ, ఈ, ఎఫ్ మొత్తం 7 కేటగిరీలుగా విభజించింది. ఇందులో 17 జోన్లు ఉన్నాయి. -
దూరప్రయాణ రైళ్లలోనూ స్వల్పదూర టికెట్లు
న్యూఢిల్లీ: సుదూర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో స్లీపర్, ఏసీ బోగీల్లో తక్కువ దూర ప్రయాణాలకు టికెట్ల సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో తక్కువదూర ప్రయాణాలకు రిజర్వేషన్ సదుపాయం లేదు. ఇకపై కంప్యూటరైజేషన్ ప్రక్రియలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా టికెట్లు బుక్‌చేసుకోవచ్చు. తక్కువ ధరకే ఇలాంటి రైళ్లలోనూ టికెట్ రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులోకి రానుందని రైల్వేశాఖ సీనియర్ అధికారి చెప్పారు. కాగా, కొత్త నిర్ణయం రిజర్వ్డ్ క్లాస్, సెకండ్ క్లాస్‌లకు మాత్రమే వర్తిస్తుందని జనవరి 5న వెలువడిన ఓ ప్రకటన ద్వారా తెలుస్తోంది. -
కోరుకున్న వెంటనే రైల్వే బెర్తు!
న్యూఢిల్లీ: ప్రయాణికులు కోరుకున్న వెంటనే రిజర్వేషన్ కల్పించే వెసులుబాటును 2020 కల్లా సిద్ధం చేయాలని రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. వెయింటింగ్ లిస్టు పెద్దగా ఉంటోందని, అందుబాటులో ఉన్న సీట్లు-ప్రయాణికుల సంఖ్యలో భారీ తేడా ఉంటోందని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ప్రయాణికుల అవసరాలు, ప్రస్తుతం ఉన్న రైల్వే మౌలిక సదుపాయాలకు మధ్య తేడా చాలా ఉందన్నారు. ‘స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి దేశంలో రైల్వే ట్రాఫిక్ 20 శాతం పెరిగింది. మౌలిక సదుపాయాలు కేవలం 2.25 శాతమే పెరిగాయి. ఈ రెండింటి మధ్య తేడా భారీగా ఉంద’ని మనోజ్ సిన్హా అన్నారు. రైల్వే మౌలిక సదుపాయాలను మెరుగు పరిచేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన చెప్పారు. -
పిల్లలకూ 'పెద్ద టికెట్'
రైలులో బెర్త్, సీట్ రిజర్వేషన్ చేసుకోవాలంటే అరటికెట్ ఉండదు వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలులోకి తాడేపల్లిగూడెం : మురళీ, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక పిల్లకు నాలుగన్నరేళ్లు.. రెండో పాపకు 11 ఏళ్లు.. పిల్లలకు సెలవులు ఇవ్వడంతో వారంతా రైలులో దూర ప్రయాణం చేయాలనుకున్నారు. వెళ్లాలనుకునే ప్రాంతానికి ముందుగానే రైలు టికెట్ రిజర్వు చేసుకున్నారు. మురళీ, లక్ష్మిలకు ఫుల్ టికెట్ చార్జీలు, పెద్ద పిల్లకు హాఫ్ టికెట్, చిన్న పిల్లకు టికెట్ లేదు. రైల్వే నిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు వయస్సుకలిగిన వారికి టికెట్ తీయనక్కరలేదు. ఐదు నుంచి 12 ఏళ్ల మధ్య వయసున్న వారికి అరటికెట్ తీయాలి. వచ్చే ఏప్రిల్ నుంచి ఇక ఇలా కుదరదు. వేసవి సెలవుల్లో ఇదే వయసున్న పిల్లలతో రైలు ప్రయాణం చేయాలంటే మరికొంత అదనపు భారం తప్పదు. ప్రయాణంలో ఐదేళ్ల లోపు వయసు పిల్లకు ఎలాగు టికెట్ తీయనక్కరలేదు కాని, ఐదేళ్ల నుంచి 12 ఏళ్ల వయస్సు కలిగిన పిల్లలకు బెర్త లేదా సీటు కావాలంటే పూర్తి టికెట్ తీయాల్సిందే. రెండు రోజుల క్రితం రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. బెర్త్ కాని, సీటు కాని కన్ఫర్మ్ కాకుండా వెయిటింగ్ లిస్టులో ఉంటే మాత్రం అరటికెట్ తీసే అర్హత ఉన్న పిల్లలకు మామూలుగానే హాఫ్ టికెట్ తీసుకోవచ్చు. స్మార్ట్ ప్రయాణం. స్మార్ట్ టికెట్, వెయిటింగ్ లిస్టులో ఉన్నా డోంట్ వర్రీ అంటూ రైల్వే ఓ పక్కరాయితీలు ప్రకటిస్తూనే, మరో పక్క నొప్పి తెలియకుండా చార్జీల మోత మోగిస్తోంది. టికెట్ల క్యాన్సిలేషన్‌కు ప్రత్యేక కౌంటర్లు టికెట్ల రద్దుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఈ నెల ఒకటిన రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. టికెట్ రద్దు చేసుకొని తిరిగి నగదు పొందేందుకు స్టేషన్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు. అన్‌రిజర్వుడ్ టికెటింగ్ సిస్టమ్, పాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ అంటూ రెండు రకాల కౌంటర్లను ఏర్పాటు చేస్తారు. స్టార్ట్‌గా రైల్వే టికెట్ తీసుకొనేందుకు స్టేషన్లలో ఇప్పటికే ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మెషీన్లు ఏర్పాటు చేశారు. రైలు ఎక్కే స్టేషన్ నుంచి గమ్యస్థానం 150 కిలో మీటర్ల లోపు ఉండే స్టేషన్లకే ఈ మెషీన్లలో టికెట్లు వస్తాయి. టికెట్ రద్దు భారమే రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు టికెట్ రద్దు చేసుకుంటే టికెట్ ధరలో 60 శాతం సొమ్ము మాత్రమే తిరిగి వస్తుంది. రైలు బయలుదేరిపోయాక టికెట్ రద్దుచేసుకోవాలంటే ఒక్క పైసా కూడా చేతికి రాదు. స్వచ్చభారత్ సెస్ పేరుతో మొదటి, రెండో తరగతి ఏసీ ప్రయాణీకుల నుంచి టికెట్ ధరలో అర శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రత్యేక రైళ్లలో ప్రయాణం చేయాలంటే తత్కాల్ చార్జీలు చెల్లించాలనే నిబంధన అమలులోకి వచ్చింది. వెయిటింగ్ లిస్టా డోంట్ వర్రీ వెయిటింగ్ లిస్టా డోంట్ వర్రీ అంటోంది రైల్వే శాఖ. వెయిటింగ్ లిస్టులో 200 టికెట్లు ఉంటే అదనపు బెర్తుల కోసం అవకాశం మేరకు కోచ్‌లు పెంచటం, అది సాధ్యంకాని పరిస్థితి అయితే వేరే స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లలో ప్రయాణికుల ఇష్టం మేరకు వాటిలో బెర్తలు కేటాయించనున్నారు. -
రద్దు పేరిట దోపిడీ
మురళీనగర్‌కు చెందిన ఉదయలక్ష్మి తిరుపతి వెళ్లేందుకు తత్కాల్లో బెర్తు కోసం గత రెండు రోజులుగా తీవ్రంగా ప్రయత్నించింది. ఎట్టకేలకు శుక్రవారం తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో తత్కాల్ బెర్తు కన్ఫర్మ్ అయ్యింది. హమ్మయ్య.. అని ఊపిరి తీసుకుని వెంకన్న దర్శనం అయ్యిందన్నంత ఆనందర పొందారు. తీరా కుటుంబమంతా బయల్దేరి రైల్వే స్టేషన్‌కు వెళ్లగా త్రుటిలో రైలు మిస్సయ్యింది. పోనీ టికెట్ రద్దు చేసుకుని సాయంత్రం పూరీ-తిరుపతి రెలైక్కుదామనుకున్నా ఆ డబ్బులు వెనక్కి ఇవ్వలేదు. తత్కాల్ టికెట్లకు రూపాయి కూడా రాదని చెప్పడంతో తీవ్ర నిరాశ చెందాల్సి వచ్చింది. మధురవాడకు చెందిన ఓ కాంట్రాక్టర్ కుటుంబం శుక్రవారం హైదరాబాద్ వెళ్లేందుకు రెండు మాసాల క్రితమే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఫస్టు ఏసీ రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్నారు. ఆదివారం కాంట్రాక్టర్లతో మీటింగ్ ఉందని ఓ ప్రభుత్వ శాఖ నుంచి సమాచారం వెళ్లడంతో ఆయన ప్రయాణం రద్దు చేసుకున్నారు. ఆయన రాకపోవడంతో కుటుంబీకులు కూడా వెళ్లలేమన్నారు. దీంతో రైలు బయల్దేరే గంట ముందు టికెట్ రద్దు చేసుకునేందుకు ప్రయత్నించగా పైసా ఇవ్వలేదు. వీరిద్దరే కాదు... టికెట్లు రద్దు చేసుకునే ప్రయాణికులందరి జేబులకు భారీగా చిల్లులు పడుతున్నాయి. టిక్కెట్ల రద్దు భారం ప్రయాణికులకు తడిసి మోపెడు ఆఖరి క్షణంలో రద్దు చేసుకుంటే అంతే మరి సిటీ : రైలు ప్రయాణికులపై రద్దు భారం తడిసి మోపెడవుతోంది. టికెట్లు రద్దు చేసుకుంటే భారీగా ఛార్జీలను గత రెండు రోజులుగా అమలు చేస్తుండడంతో సాధారణ ప్రయాణికులు గొల్లుమంటున్నారు. ఎవరో దళారులు చేస్తున్నారని తమ ప్రయాణాలపై భారం మోపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. దళారులను అరికట్టేందుకు ఎన్నో మార్గాలుండగా రద్దు ఛార్జీలను రెట్టింపు చేయడం వల్ల 80 శాతం మంది ప్రయాణికులు భారీగా నష్టపోతున్నారన్న అంశాన్ని తెరమీదకు తెచ్చారు. 20 శాతం మంది దళారులను వదిలించుకోవడానికి సాధారణ ప్రయాణికులను బలిపశువులను చేయడం సరికాదని పే ర్కొంటున్నారు. ఈ నెల 12వ తేదీ నుంచి అమల్లోకొచ్చిన రై ల్వే టికెట్ రద్దు ఛార్జీల రెట్టింపుపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఛార్జీలను రద్దు చేయడం ప్రయాణికులందరికీ నష్టమేనని అభిప్రాయపడుతున్నారు. విశాఖ రైల్వే స్టేషన్‌తో పాటు మూడు శాటిలైట్ కౌంటర్లతో కలిపి రోజుకు 1800 నుంచి 1900 మంది రిజర్వేషన్ టికెట్లు పొందుతుంటారు. రోజుకు దాదాపు 1900 మంది తీసుకునే రిజర్వేషన్ టికెట్లతో దాదాపు 5 వేల మంది ప్రయాణికులు వివిధ రైళ్లలో రిజర్వేషన్ బెర్తులు ఆక్రమిస్తున్నారు. ఒక రోజుకు రిజర్వేషన్ టికెట్లు అమ్మ డం ద్వారా రూ. 21.67 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకూ ఆదాయం సమకూరుతోంది. రిజర్వేషన్ టికెట్లు రద్దు చేస్తే రెట్టింపు మొత్తం తిరిగి చెల్లించరన్న నిబంధన అమల్లోకి వచ్చినప్పటి నుంచీ 20 శాతం మంది ప్రయాణికులు టికెట్ల రద్దు చేయడం మానేశారు. రెట్టింపు మొత్తం రద్దు నిబంధన అమల్లోకి రాని రోజుల్లో స్టేషన్‌లోని 10వ నెంబర్ బుకింగ్ కౌంటర్ నుంచే ఎక్కువ రిజర్వేషన్ టికెట్లు రద్దయ్యేవి. రెండు రోజులుగా రెగ్యులర్‌గా టికెట్లు రద్దు చేసే వారు పెద్దగా కనిపించ డం లేదని రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రతి శని, ఆదివారాల్లోనే దళారులు ఎక్కువగా టికెట్లు కొని అట్టేపెట్టుకుని రైలు ఓ గంటలో బయల్దేరుతుందనగా సమయం చూసి రెట్టింపు ధరకు అమ్ముకునే వారు. అలా ఇప్పుడు ఆ టికెట్ రద్దు చేస్తే పైసా ఇవ్వడం లేదు. అందుకే దళారుల సంఖ్య కాస్త తగ్గినట్టు అంచనా వేస్తున్నారు. మరో పక్క ప్రయాణికులు మాత్రం భారీగా నష్టపోతున్నారు. సెకండ్ క్లాస్ ఏసీ టికెట్ రద్దు చేసుకుంటే గతంలో రూ. 100 ఉండేది. ఇప్పుడా మొత్తం రూ. 200కు పెంచారు. జనరల్ బోగీ ప్రయాణ టికెట్, రిజర్వేషన్, థర్డ్ ఏసీ ఇలా అన్ని బోగీల్లో రెట్టింపు చేశారు. -
ఏప్రిల్ 1 నుంచి కొత్త ఏఆర్పీ
సాక్షి, హైదరాబాద్: రైలు టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు (ఏఆర్పీ)ను 120 రోజులకు పెంచుతూ రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి రాబోతోంది. ఇప్పటివరకు 60 రోజులుగా ఉన్న గడువును నాలుగు నెలలకు పెంచుతున్నట్టు ఇటీవలి బడ్జెట్లో రైల్వే మంత్రి ప్రతిపాదించారు. దీనివల్ల బ్లాక్ టికెటింగ్ పెరిగే అవకాశం ఉన్నా దాన్ని అమలు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించటం విశేషం. 2012 వరకు ఈ గడువు 90 రోజులుగా ఉండేది. ఆ తర్వాత దాన్ని 120 రోజులకు పెంచారు. తిరిగి 2013 మే 1 నుంచి దాన్ని 60 రోజులకు కుదించారు. 120 రోజుల ముందే టికెట్లను జారీ చేశాక రైలు చార్జీలు పెరిగితే, ఆ పెరిగిన మొత్తాన్ని తిరిగి వసూలు చేసుకోవటం అంత సులభం కాదని, దీనివల్ల నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు అప్పట్లో రైల్వేశాఖ దృష్టికి తెచ్చారు. ఒక్క దక్షిణ మధ్య రైల్వే అధికారులే నిత్యం రూ.25 లక్షల వరకు వసూలు చేయాల్సి వస్తున్నా రోజుకు రూ.15 లక్షలకు మించి వసూలు చేయలేకపోతున్నట్టు అప్పట్లో ఉదాహరించారు. దీంతో గడువును 60 రోజులకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ దాన్ని ఇప్పుడు 120 రోజులకు పెంచారు. -
బ్లాక్ బెర్రీ సరికొత్త యాప్!
న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు రైలు టికెట్లను ఇకపై ఆన్లైన్లో సులభంగానే బుక్ చేసుకోవచ్చు. రైలు టికెట్లను బుక్ చేసుకునేందుకు వీలుగా ఐఆర్సీటీసీ(ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) కొత్త బ్లాక్‌బెర్రీ మొబైల్ అప్లికేషన్‌ను విడుదల చేసింది. బ్లాక్‌బెర్రీ-10 వినియోగదారులు ‘ఐఆర్సీటీసీ ఆప్’ అనే ఈ ఆప్‌ను బ్లాక్‌బెర్రీ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఐఆర్సీటీసీ వెబ్సైట్లో ప్రతి నిమిషానికీ 7 వేల చొప్పున రోజూ 5 లక్షల టికెట్ల వరకూ బుక్ అవుతున్నాయని, ఆన్లైన్ టికెట్ బుకింగ్‌కు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఈ ఆప్‌ను విడుదల చేసినట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ యాప్ ను వినియోగించడం చాలా సులభతరంగా ఉంటుందని రైల్వే అధికారి స్పష్టం చేశారు. ప్రతీ ఏటా 31 కోట్ల మంది ప్రయాణికులు పైగా రైల్వే రిజర్వేషన్ చేసుకుంటున్నారన్నారు.దీనిలో 55 శాతం మంది ప్రయాణికులు బుకింగ్ కౌంటర్లను ఆశ్రయిస్తుండగా, 37 శాతం మంది ఆన్ లైన్లో బుక్ చేస్తున్నారన్నారు. మిగతా 8 శాతం మంది ప్రయాణికులు టికెట్ బుకింగ్ ఏజెంట్ల వద్ద రిజర్వేషన్లు చేయించుకుంటున్నారన్నారు. -
అందనంత వేగం!
తత్కాల్ రిజర్వేషన్ టిక్కెట్లు మరింత వేగంగా, ఎక్కువమందికి అందించాలన్న రైల్వే శాఖ ఆలోచన ఆచరణలో వికటిస్తోంది. ట్రావెల్ ఏజెన్సీలు, టిక్కెట్ల బ్రోకర్లకే ఇది ఉపయోగపడుతోంది. కౌంటర్లలో రాత్రి తెల్లవార్లూ నిరీక్షించే సామాన్య ప్రయాణికులకు మాత్రం ప్రయాసలే మిగులుతున్నాయి. ఒకరిద్దరికి మాత్రమే టిక్కెట్లు అందుతున్నాయి. మిగిలిన వారు ఉత్తి చేతులతో వెనుదిరగాల్సి వస్తోంది. శ్రీకాకుళం, ఆమదాలవలస: రైల్వే రిజర్వేషన్ కౌంటర్లపై ఆధారపడే ప్రయాణికులకు తత్కాల్ టిక్కెట్లు దొరకడం దుర్లభమవుతోంది. ఇటీవల ఐఆర్సీటీసీ వెబ్సైట్ వేగాన్ని పెంచిన తర్వాతే ఈ పరిస్థితి ఎదురవుతోందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. గతంలో రిజర్వేషన్ కౌంటర్ల వద్ద క్యూలో నిలబడిన వారిలో 10 మంది వరకు తత్కాల్ టిక్కెట్లు పొందగలిగేవారు. ఇప్పుడు ఇద్దరుముగ్గురికి మించి పొందలేకపోతున్నారు. ఉదయం 10 గంటలకు తత్కాల్ వెబ్సైట్ తెరుచుకుంటుంది. ఆ తర్వాత ఐదు నిమిషాల్లోనే టిక్కెట్లన్నీ అయిపోతున్నాయి. గతంలో రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వెబ్సైట్ వేగవంతంగా ఉండేది. ఇప్పుడు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌ను కూడా అదే స్థాయికి పెంచడంతో కౌంటర్ల వద్ద క్యూలో నిరీక్షించే వినియోగదారులకు కష్టాలు ఎదురవుతున్నాయి. కౌంటర్లోని సిబ్బంది వినియోగదారులు రిజర్వేషన్ ఫారంలో పేర్కొన్న సమాచారాన్ని వెబ్సైట్లో నమోదు చేసి, వారి నుంచి డబ్బులు తీసుకొని, ప్రింటెడ్ టిక్కెట్ ఇచ్చేందుకు మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతోంది. తిరిగి చిల్లర ఇవ్వాల్సి వస్తే మరో నిమిషం పడుతుంది. ఐఆర్సీటీసీ వైబ్‌సైట్ ద్వారా టిక్కెట్లు తీసుకునే విషయంలో ఇంత తతంగం ఉండదు. రైల్వే కౌంటర్లో ఒకటికి మించి కంప్యూటర్లను వినియోగించే అవకాశం లేకపోలేక పోగా ఐఆర్సీటీసీ ఏజెంట్లు పలు కంప్యూటర్లను ఏర్పాటు చేసుకొని ఏక కాలంలో ఎక్కువ టిక్కెట్లు బుక్ చేస్తున్నారు. ఈ టికెటింగ్ విధానంలో అప్పటికప్పుడు టిక్కెట్ ప్రింట్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవడం కూడా వీరికి అనుకూలంగా మారింది. గతంలో ఐఆర్సీటీసీ వెబ్సైట్ స్పీడ్ తక్కువగా ఉండడం రైల్వే వెబ్సైట్ స్పీడ్ ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు రైల్వే కౌంటర్లోని సిబ్బంది ఒక వినియోగదారుని లావాదేవీలు పూర్తి చేసే సరికే దాదాపు టిక్కెట్లన్నీ అయిపోతున్నాయి. దీని వల్లఅర్ధరాత్రి నుంచి క్యూలో వేచి ఉన్న వినియోగదారులు టిక్కెట్లు దొరక్క నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. సాంకేతిక అంశాలు తెలియని పలువురు వినియోగదారులు రైల్వే కౌంటర్లలోని సిబ్బంది వల్లే ఇలా జరుగుతోందన్న భావనతో వారితో వాదనకు దిగుతున్న సంఘటనలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులను కొందరు ఐఆర్సీటీసీ ఏజెంట్లు తమకు అనుకూలంగా మలచుకొని తమ వద్దకు వచ్చే వినియోగదారుల వద్ద టిక్కెట్ ధర కంటే అదనంగా రూ. 400 నుంచి 500 వరకు వసూలు చేస్తున్నారు. అత్యవసర ప్రయాణాలు చేయాల్సినవారు గత్యంతరం లేక ఎక్కువ మొత్తాలు చెల్లించి టిక్కెట్లు తీసుకుంటున్నారు. రిజర్వేషన్ కౌంటర్లను ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్టు రైల్వే అధికారులు ప్రకటించక ముందే ప్రైవేటు ఏజెంట్లకు లాభం జరిగేలా నిర్ణయం తీసుకోవడం విమర్శలకు తావిస్తోంది. సామాన్యులకు దొరకడంలేదు వేకువజామున మూడు గంటలకు వచ్చి క్యూలో నిల్చున్నా తత్కాల్ దొరకడం లేదు. సామాన్యులు కౌంటర్ వద్ద నిలబడడమే తప్ప టిక్కెట్ మాత్రం లభించడం లేదు. సిబ్బందిని అడిగితే తామేమీ చేయలేమని అంటున్నారు. -వై.వెంకటేష్, ఆమదాలవలస తత్కాల్ అందడం గగనమే శనివారం రాత్రి జి.కె.వలస బస్సుకు వచ్చి తత్కాల్ కోసం క్యూలో నిల్చున్నాను. అయినా టిక్కెట్ దొరకలేదు. క్యూలో నిలబడిన ముగ్గురికి మాత్రమే టిక్కెట్లు దక్కాయి. ఏ ట్రైన్‌కు అడిగినా అయిపోయాయంటున్నారు. - నక్క రాము, జి.కె.వలస, ఆమదాలవలస మండలం -
నేటి నుంచి దీపావళి రైళ్ల రిజర్వేషన్లు ప్రారంభం
ప్యారిస్, న్యూస్‌లైన్ : దీపావళి పండుగకు రిజర్వేషన్లను బుధవారం నుంచి ప్రారంభించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది దీపావళి పండుగను నవంబర్ రెండవ తేదీన జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా 60 రోజులు ముందుగానే రైలులో ప్రయాణించేందుకు రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సారి దీపావళి శనివారం రానుండడంతో ఎక్కువ మంది పండుగను సొంత ఊర్లలో జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో అక్టోబర్ 31, దానికి ముందు రోజు నుంచే సొంత ఊర్లకు వెళ్లడం ప్రారంభిస్తారు. కనుక దీపావళి పండుగకు రిజర్వేషన్లు ఆగస్టు 28వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది దీపావళి సమయంలో 120 రోజులకు ముందుగానే రిజర్వేషన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఏడాది ఆ వ్యవధిని 60 రోజులకు తగ్గిం చారు. దీంతో బుధవారం నుంచి రిజర్వేషన్ కౌంటర్లు రద్దీగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా చెన్నై ఎగ్మూరు నుంచి దక్షిణాది జిల్లాలైన కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునల్వేలి, మదురై, తిరుచ్చికు వెళ్లే రైళ్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా కనిపిస్తుంది. ఈ కారణంగా పండుగ రోజుల్లో దక్షిణాది జిల్లాలకు అదనపు రైళ్లను నడపాలని ప్రతి ఏటా ప్రయాణికులు కోరుతూనే ఉన్నారు. గత ఏడాది దీపావళి పండుగను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం చెన్నై నుంచి నాగర్‌కోయిల్, కోవై, నెల్లై, తిరుచ్చి, తూత్తుకుడి తదిత ర ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లను దక్షిణ రైల్వే నడిపింది. వీటి ని పండుగకు రెండు రోజుల ముందు ప్రకటించడంతో పలువురు తమ ప్రయాణాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోలేకపోయారు. దీంతో దీపావళి పండుగ రోజు, ఆ తర్వాత రోజుల్లో కూడా ప్రత్యేక రైళ్లు ప్రయాణికులు లేక ఖాళీగా నడిచాయి. ఈ ఏడాదైనా దీపావళి ప్రత్యేక రైళ్లను అక్టోబర్ నెలలోనే ప్రకటించాలని ప్రయాణికులు కోరుతున్నారు.