
సాక్షి, అమరావతి: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లు, ఈస్ట్ కోస్ట్ రైల్వేలో వాల్తేరు డివిజన్‌లో ప్రయాణికులకు టికెట్ రిజర్వేషన్ కింద రూ.7.50 కోట్ల సొమ్మును రైల్వేశాఖ వాపసు ఇచ్చింది. కరోనా జాతీయ విపత్తు నేపథ్యంలో మార్చి 21 నుంచి ఏప్రిల్ 14 వరకు ఆన్‌లైన్, కౌంటర్ల ద్వారా రిజర్వేషన్ టికెట్లు పొందిన ప్రయాణికులకు రైల్వేశాఖ డబ్బు వాపసు చేసింది.