లక్నో: రైల్వే చార్జీల పెంపు ప్రతిపాదన ఇప్పటికైతే లేదని రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అన్ని విషయాలు బడ్జెట్ సమయంలోనే తెలుస్తాయన్నారు. శనివారమిక్కడ లక్నో-కత్గోడం ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే బడ్జెట్‌లో రైల్వే చార్జీలు పెంచుతారా అంటూ విలేకరులు సిన్హాను ప్రశ్నించగా.. ‘‘ఇప్పటికైతే ఆ ప్రతిపాదన లేదు. బడ్జెట్ గురించి ఇప్పుడు చర్చించడం సబబు కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి’’ అని పేర్కొన్నారు. . రైల్వేను ప్రైవేటీకరించే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు.
రైల్వే చార్జీల పెంపు ప్రతిపాదన లేదు: మనోజ్
Published Sun, Feb 8 2015 4:51 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM
Advertisement