Railway fares
-
పుష్కరాలకు రైల్వే బాదుడు
టిక్కెట్ స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.20 అదనపు భారం సాక్షి, విజయవాడ/రాజమండ్రి సిటీ : గోదావరి పుష్కరాలకు వచ్చే ప్రయాణికులపై ‘పుష్కరమేళా సర్‌చార్జి’ పేరుతో ప్రత్యేక బాదుడుకు రైల్వే సిద్ధమైంది. జూలై 14 నుంచి 25 వరకు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని 7 స్టేషన్లకు ప్రయాణించేవారిపై ఈ సర్‌చార్జి వసూలు చేయనున్నట్లు విజయవాడ డివిజన్ సీనియర్ పీఆర్వో మైఖేల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి , గోదావరి, కొవ్వూరు స్టేషన్లు, తెలంగాణలో మంచిర్యాల, బాసర, భద్రాచలం రోడ్, రామగుండం స్టేషన్లు గమ్యంగా ప్రయాణించేవారికి ఈ సర్‌చార్జి పడుతుంది. సెకండ్ క్లాస్ (ఆర్డినరీ, మెయిల్, ఎక్స్‌ప్రెస్) టికెట్‌కు రూ.5, స్లీపర్ క్లాస్ (ఆర్డినరీ, మెయిల్, ఎక్స్‌ప్రెస్)కు రూ.5, ఏసీ చైర్ కార్, ఏసీ 3 టైర్ టికెట్‌కు రూ.10, ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్‌కు రూ.20 చొప్పున చెల్లించాలి. రూ.15 చార్జీ దాటిన టికెట్‌పైనే ఈ సర్‌చార్జి వసూలు చేస్తారు. ఈ స్టేషన్లలో ఇప్పటికే టికెట్లు జారీ చేసి ఉంటే సర్చార్జిని రైలులో టీటీఈలు వసూలుచేస్తారు. గత పుష్కరాలకూ ఇలాగే జరిగితే ప్రజలనుంచి నిరసనవ్యక్తమైంది. దీంతో రద్దుచేశారు. -
రైల్వే చార్జీలు తగ్గే ప్రసక్తి లేదు!
రైల్వే చార్జీలు తగ్గించే ప్రసక్తే లేదని రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా స్పష్టం చేశారు. చార్జీల మోత భరించాల్సిందేనన్నారు. ఇప్పటికే రైలు టిక్కెట్ల ధరలు, ఇతరమైనవి చాలా తక్కువగా ఉన్నాయని, అంతకంటే తగ్గించలేమని చెప్పారు. ఫిబ్రవరి 26న పార్లమెంటులో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానమిచ్చారు. పరిమిత వనరులతో పాటు అనేక సబ్సిడీలు భరిస్తున్న కారణంగా తమ శాఖకు ఆదాయం రాకపోగా మరింత భారం మోయాల్సి వస్తున్నదన్నారు. రైల్వే బడ్జెట్‌ను బ్యాలెన్స్ చేయాల్సినవసరం ఉందని చెప్పారు. రైల్వే శాఖలో మౌలిక సదుపాయాల అభివద్ధి కోసం, భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని విదేశీ పెట్టుబడులను ఎఫ్‌డీఐలను 100 శాతం అంగీకరిస్తామన్నారు. రైల్వే రక్షణ దళానికి (ఆర్పీఎఫ్) మరిన్ని అధికారాలు కట్టబెట్టే బిల్లును ఈ సమావేశాల్లో ప్రవేశపెడతామని చెప్పారు. -
రైల్వే చార్జీల పెంపు ప్రతిపాదన లేదు: మనోజ్
లక్నో: రైల్వే చార్జీల పెంపు ప్రతిపాదన ఇప్పటికైతే లేదని రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అన్ని విషయాలు బడ్జెట్ సమయంలోనే తెలుస్తాయన్నారు. శనివారమిక్కడ లక్నో-కత్గోడం ఎక్స్‌ప్రెస్ ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. వచ్చే బడ్జెట్లో రైల్వే చార్జీలు పెంచుతారా అంటూ విలేకరులు సిన్హాను ప్రశ్నించగా.. ‘‘ఇప్పటికైతే ఆ ప్రతిపాదన లేదు. బడ్జెట్ గురించి ఇప్పుడు చర్చించడం సబబు కాదు. సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి’’ అని పేర్కొన్నారు. . రైల్వేను ప్రైవేటీకరించే యోచన ప్రభుత్వానికి లేదని స్పష్టంచేశారు. -
పెట్రో బాంబు
ఆదిలాబాద్ టౌన్ : కేంద్ర ప్రభుత్వం పెట్రో బాంబు పేల్చింది. పెట్రోల్, డీజి ల్ ధరలు పెంచి వినియోగదారు ల నడ్డి విరిచింది. ఇటీవల రైల్వే చార్జీలు పెంచిన కేంద్రం పది రోజుల్లోనే పెట్రో చార్జీలు పెంచడంతో జనం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలు సో మవారం అర్ధరాత్రి నుంచే అ మలుల్లోకి వచ్చాయి. ఈ చార్జీల పెంపుతో నిత్యావసర సరుకుల, వాహన చార్జీల ధరలు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన డీజిల్ ధరతో ఆర్టీసీపై పెనుభారం పడనుంది. వినియోగదారునిపై అదనపు భారం జిల్లాలో దాదాపు 100పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. పెట్రోల్ రోజుకు 80 వేల లీటర్ల విక్రయం జరుగుతుంది. డీజిల్ రోజుకు 2.20 లక్షల లీటర్ల అమ్మకం జరుగుతుంది. పెరగక ముందు పెట్రోల్ ధర రూ.78.88 ఉండగా, రూ.1.69 పైసలు పెరగడంతో రూ.80.57కు చేరింది. కాగా రోజుకు వినియోగదారునిపై రూ. 1.52 లక్షల అదనపు భారం పడనుంది. అదేవిధంగా డీజిల్ జిల్లాలో 2.20 లక్షల విక్రయం జరుగుతుంది. పెరగ ముందు డీజిల్ ధర రూ.63.50 ఉండగా 50 పైసలు పెరగడంతో రూ.63.02 పైసలకు చేరింది. రోజుకు వాహనాదారుపై రూ.1.10 లక్షల భారం పడనుంది. పెట్రోల్‌పై నెలకు రూ.45.60 లక్షలు, డీజిల్‌పై రూ.33 లక్షల భారం పడనుంది. పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరగడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిక్కుతుంది. ఈ ప్రభావం సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలపై పడనుంది. ప్రతిపక్షాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. -
నేటినుంచి... రైల్వే ‘చార్జ్’
పెరిగిన రైల్వే చార్జీలు {పయాణికులపై రూ.230 కోట్ల భారం అదనపు చార్జీలు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్ సరకు రవాణా పైనా భారం రానున్న రోజుల్లో నిత్యావసరాల ధరలపై ప్రభావం ప్రయాణికులపై చార్జీల భారం మోపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఇప్పటికే చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మంగళవారం అర్ధరాత్రి నుంచి పెంచిన చార్జీలు అమలులోకి రానున్నాయి. దీంతో విజయవాడ రైల్వే డివిజన్ ప్రయాణికులపై సాలీనా రూ.100 కోట్ల భారం పడనుంది. విజయవాడ : రైల్వే చార్జీలు అమలులోకి వచ్చేస్తున్నాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచి చార్జీలు అమలు చేసేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేసింది. రైల్వే చార్జీలను 14.2 శాతం పెంచుతూ ఇటీవల నరేంద్రమోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. చార్జీల పెంపుపై ప్రయాణికులు పెదవి విరుస్తుండగా, విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలకు దిగుతున్నాయి. డివిజన్ పరిధిలో రూ.100 కోట్ల ఆదాయం... 2013-14 ఆర్థిక సంవత్సరంలో విజయవాడ డివిజన్‌కు రూ.3,280 కోట్ల ఆదాయం వచ్చింది. డివిజన్లో 102 మిలియన్ల మంది ప్రయాణికులు రైల్వేశాఖ సేవలను వినియోగించుకున్నారు. వీరి ద్వారా రైల్వే శాఖకు రూ.661 కోట్ల ఆదాయం లభించింది. ప్రస్తుతం టిక్కెట్ రేట్లు పెంచడం ద్వారా ఆదాయం మరో రూ.100 కోట్లు పెరగనుంది. ప్రయాణికుల నుంచి సుమారుగా రూ.760 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైల్వే అధికారులు అంచనాలు వేస్తున్నారు. సరకు రవాణాపై రూ.6.5 శాతం మేర చార్జీలు పెంచారు. విజయవాడ డివిజన్ నుంచి ఎరువులు, బొగ్గు, ఆయిల్స్ రవాణా ఎక్కువగా జరుగుతుంది. డివిజన్ పరిధిలో సరకు రవాణా ద్వారా మరో రూ.130 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ లెక్కన ఒక్క విజయవాడ డివిజన్ పైనే సుమారు రూ.230 కోట్ల భారం పడనుంది. సరకు రవాణా చార్జీలు పెంచడం వల్ల రాబోయే రోజుల్లో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. అదనపు చార్జీలు చెల్లించేందుకు ప్రత్యేక కౌంటర్లు... ముందుగా తీసుకున్న టికెట్లకు అదనపు రేటు చెల్లించాలని రైల్వే అధికారులు సూచిస్తున్నారు. ఈ సొమ్మును రైలులో టిక్కెట్ కలెక్టర్‌కు చెల్లించవచ్చు. ప్రయాణికుల సౌకర్యాం కోసం పెరిగిన చార్జీలను ముందుగానే చెల్లించేందుకు అధికారులు రైల్వే స్టేషన్లో కౌంటర్లను ఏర్పాటు చేశారు. విజయవాడ ఈస్ట్, వెస్ట్, మెయిన్ బుకింగ్ కౌంటర్ల వద్ద ఈ అదనపు చార్జీలను వసూలుచేసే కౌంటర్లు ఏర్పాటయ్యాయి. -
మోడీతో మాట్లాడతా!
సాక్షి, ముంబై: రైల్వే చార్జీలు పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంపై కూటమిలోని భాగస్వాముల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎన్డీయేలో భాగస్వామి అయిన శివసేన రైల్వే చార్జీల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టింది. పేదల జేబులను కొల్లగొట్టే చార్జీల పెంపు నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని శివసేన కార్యాధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఆదివారం డిమాండ్ చేశారు. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టడం ఎప్పుడూ జరిగేదే. అయితే ప్రతిపక్షాల ఆందోళనకు మద్దతు పలుకుతూ అధికారపక్ష వైఖరిని భాగస్వామ్య పార్టీ కూడా తప్పుబడుతుండడం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ విషయమై ఉద్ధవ్‌ఠాక్రే మాట్లాడుతూ... పేదల ఆర్థిక బడ్జెట్ పూర్తిగా తలకిందులయ్యే విధంగా ఉందని, పెంపును వెంటనే రద్దుచేయాలని ఆయన కేంద్రానికి సూచించారు. ఢిల్లీలో శివసేనకు చెందిన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు శివసేన వైఖరిని కేంద్రానికి తెలియజేస్తారని చెప్పారు. త్వరలో తాను స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఈ విషయంపై మాడ్లాడతానన్నారు. ‘ప్రస్తుతం పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు పేదలతోపాటు మధ్య తరగతి ప్రజలు కూడా ఇబ్బంది పెడుతున్నాయి. వచ్చే జీతం కంటే ఖర్చులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో కుటుంబాన్ని పోషించేం దుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి స్థితిలో రైలు చార్జీలు పెంచి వారిపై మరింత ఆర్థిక భారాన్ని మోపడం సబబు కాద’ని ఉద్ధవ్ అభిప్రాయపడ్డారు. ముందు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని, ఆ తర్వాతే చార్జీల పెంపుపై ఆలోచించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 25 నుంచి ప్రయాణ చార్జీలతోపాటు, సరుకు రవాణ చార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రభావం ముంబైలోని లోకల్ రైళ్ల ప్రయాణించే 75 లక్షల మందిపై పడనుంది. చార్జీలు దాదాపు రెట్టింపు కానున్నాయి. -
ఇదేం బాదుడు?!
అందరం ఏకమై యూపీఏ సర్కారు పీడ విరగడ చేసుకున్నామని జనం సంబరపడి ఇంకా నెల్లాళ్లయినా కాలేదు... చార్జీల బాదుడులో తాను కూడా యూపీఏకు ఏమాత్రం తీసిపోనని ఎన్డీఏ ప్రభుత్వం రుజువుచేసుకుంది. ఉన్నట్టుండి శుక్రవారం రోజున ఒక్కసారిగా కనీ వినీ ఎరుగని రీతిలో ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పనిలో పనిగా సరుకు రవాణా చార్జీలను కూడా 6.5 శాతం పెంచింది. పెరిగిన చార్జీలు ఈనెల 25 నుంచి అమల్లోకి వస్తాయి. రేపో మాపో వంటగ్యాస్ సిలిండర్ ధర కూడా పెరగవచ్చన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అధికారంలో ఉన్నవారు అసలు చార్జీలే పెంచరాదని, అలా పెంచనివారే మంచి పాలకులని ఎవరూ వాదించరు. కానీ అందుకు ఒక పద్ధతంటూ ఉండాలని ఆశిస్తారు. అలాంటి పద్ధతి పాటించకపోవడంలో యూపీఏ సర్కారు చరిత్ర జగ ద్విదితం. విషాదమేమంటే ఎన్డీఏ ప్రభుత్వానికి సైతం ఆ అడుగుజా డలే ఆదర్శమయ్యాయి. పార్లమెంటులో తనకున్న మెజారిటీకి ఎన్డీఏ ఇలా చేయాల్సిన అవసరం లేదు. అసలిది మెజారిటీ ఉండటం, లేకపోవడానికి సంబంధించింది కూడా కాదు. నైతికతకు సంబంధిం చిన అంశం. మెచ్చి మెజారిటీ కట్టబెట్టిన ప్రజలకు దిగ్భ్రమ కలిగించే విషయం. బడ్జెట్ సమావేశాలు వచ్చే నెల మొదటివారంనుంచి ప్రారం భం కావొచ్చని చెబుతున్నారు. ఆ సమావేశాల్లో సాధారణ బడ్జెట్, రైల్వే బడ్జెట్ ప్రవేశపెడతారు. చార్జీల పెంపుతో సహా అన్ని ప్రతిపాదనలూ అప్పుడుండాలి. చట్టసభలంటే గౌరవమున్నా, ప్రజాస్వామ్యమంటే విశ్వాసం ఉన్నా చేయాల్సింది ఇదే. కానీ, బడ్జెట్‌కు ముందో, తర్వాతో ప్రజల నడ్డి విరిచి అటు తర్వాత చార్జీల ఊసే లేని బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇటీవలికాలంలో అలవాటైంది. పర్యవసానంగా చార్జీల పెంపు సంగతి పార్లమెంటులో అసలు చర్చకే రాకపోవడమో లేదా మొక్కుబడి ప్రస్తావనగానో మిగిలిపోతున్నది. అసలు ఎన్డీఏ సర్కారు చార్జీల విష యమై ఆదరాబాదరాగా వ్యవహరించిన తీరును ప్రత్యేకించి చెప్పుకోవాలి. ప్రయా ణికుల చార్జీలు పెంచడం తప్పకపోవచ్చని ఆరు రోజులక్రితమే రైల్వే మంత్రి సదానందగౌడ చెప్పారు. గురువారం అధికారులతో మాట్లాడి నప్పుడు ఈ విషయంలో మరికొన్ని దఫాలు చర్చలు జరగాల్సివున్న దని మంత్రి చెప్పారంటున్నారు. అలా చెప్పి 24 గంటలు గడవక ముందే చార్జీల పెంపు ప్రకటన వెలువడింది. ఎందుకిలా జరిగిందో సదానందకే తెలియాలి. ‘నాకు ముందున్న రైల్వే మంత్రి చేసిన నిర్ణ యాలను అమలు చేయకతప్పలేదు. నేను చేసిందల్లా ఆయన పెండింగ్ లో పెడుతూ జారీచేసిన ఆదేశాలను ఉపసంహరించడమే’అని సదా నంద లౌక్యంగా చెబుతున్నారు. యూపీఏ సర్కారు పరమ అస్తవ్య స్తంగా వ్యవహరించేదన్న కారణానే దాన్ని జనం కాదన్నారు. ఒకవేళ తామూ అదే తోవన వెళ్లకతప్పదని భావించే స్థితి బీజేపీకి ఉంటే ఆ సంగతి ఎన్నికల్లోనే చెబితే సరిపోయేది. ‘మాకూ వారికీ తేడా ఏం లేదు. చార్జీలు పెంచి కూడా దాన్ని అమలు చేయడానికి వారు భయపడ్డారు. మాకు ఓటేస్తే ఆ ప్రతిపాదనలను నిర్భయంగా అమలుచేస్తాం’ అని చెప్పివుండాల్సింది. కీలక నిర్ణయాలు తీసుకునేప్పుడు పార్లమెంటును లెక్కచేయని యూపీఏనే మాకూ ఆదర్శమని ప్రకటించాల్సింది. అప్పుడు ప్రజలు దానికి తగ్గట్టే వ్యవహరించేవారు. గత రెండేళ్లనుంచి 5 శాతానికి మించకుండా మందగించిన వృద్ధి రేటు ఆందోళన కలిగిస్తున్నదని, దేశ ఆర్థిక వ్యవస్థను స్వస్థపరచాలంటే కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదని ప్రధాని నరేంద్రమోడీ ఈమధ్యే చెప్పారు. ఎన్నికల్లో తమపై అపార ప్రేమను ప్రదర్శించిన ప్రజలు ఈ నిర్ణయాలకు కలవరపడినా ఫలితాలు చూశాక తిరిగి తమను ఇష్టప డతారని మోడీ అంటున్న మాటల్లోని నిజానిజాల సంగతలా ఉంచి... నిర్ణయాలు ఎలాంటివైనా వాటిని అమలుపరిచే తీరు సక్రమంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. ఊగిసలాడే పాలకులు పోయి నిర్ణయాత్మ కంగా వ్యవహరించేవారు రావాలని ప్రజలు ఆశించారు తప్ప ఇలా పెడ దోవన వెళ్లాలని కోరుకోలేదు. యూపీఏ పాలనలో రైల్వే శాఖ వట్టిపో యిందని, దాన్ని పట్టాలెక్కించాలంటే ఇది తప్పనిసరని ప్రభుత్వ పెద్దలు సన్నాయినొక్కులు నొక్కుతున్నారు. నిరుడు జనవరిలో యూపీఏ సర్కారు రైల్వేచార్జీలను పెంచినప్పుడు ఆ నిర్ణయాన్ని విమ ర్శిస్తూ నరేంద్రమోడీ సుదీర్ఘమైన ట్వీట్ చేశారు. ఇప్పుడొచ్చిన అధి కారం ఆ అభిప్రాయాన్ని ఎలా మార్చేయగలదో అనూహ్యం. పెంచిన చార్జీలవల్ల రూ. 8,000 కోట్ల ఆదాయం లభిస్తుందని చెబుతున్నారు. రవాణా చార్జీల పెంపువల్ల వివిధ సరుకుల ధరలు మరింత పెరిగి ద్రవ్యోల్బణం హెచ్చవుతుంది. రైల్వేలు నష్టాల్లో కూరుకుపోయిన మాట వాస్తవమే. కానీ, అందుకు కారణాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే మంత్రులుగా ఉన్నవారు లాభనష్టాలతో సంబంధం లేకుండా భారీ ప్రాజెక్టుల్ని తమ రాష్ట్రాలకు తరలించుకుపోవడం... ప్రయాణికులు లేకున్నా, పైసా ఆదాయం రాకున్నా ప్రతిష్టకుపోయి దురంతోలు, సూపర్‌ఫాస్ట్‌లు తమ ప్రాంతాలకు మళ్లించడంవంటి చర్యలు రైల్వేలను కుంగదీశాయి. ఇవిగాక అడ్డూ ఆపూ లేకుండా చేసే వృథా వ్యయం అదనం. వీటన్నిటి పర్యవసానంగా రైల్వేలు సంపా దించే ప్రతి రూపాయిలో దాదాపు 89 పైసలు ఖర్చులకే పోతున్నాయి. జోన్లవారీగా చూస్తే ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ జోన్లలో ఆదాయ వ్యయాలు చెల్లుకు చెల్లవుతున్నాయి. అధికాదాయం తెస్తున్నది దక్షిణ మధ్య రైల్వేనే! వీటన్నిటినీ ఓపిగ్గా సమీక్షించి లోపాలు సరిచేయాల్సింది పోయి ఎప్పటిలా ప్రయాణికులను చావబాదడమే పరిష్కారమన్నట్టు ఎన్డీఏ సర్కారు వ్యవహరించింది. ఈ తరహా పోకడలు తమను నమ్ముకున్న ప్రజలకు చేటు కలిగిస్తాయని ప్రభుత్వం గుర్తిస్తే మంచిది. -
రైలు మోత
భారీగా పెరిగిన చార్జీలు అన్ని తరగతులపై 14.2 శాతం పెంపు నెలకు సగటున రూ.87 లక్షల భారం జిల్లాలో నిత్యం 70 వేల మంది రాకపోకలు సామాన్యుడికి రైలు ప్రయూణమూ కష్టమే.. సాక్షి, హన్మకొండ: రైల్వే చార్జీలు పెంచాలని మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయంతో సామాన్య ప్రయూణికుల జేబులకు భారీగానే చిల్లు పడనుంది. ప్యాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్, స్లీపర్, ఏసీ కోచ్ అని తేడా లేకుండా అన్ని విభాగాల్లోనూ ప్రస్తుతం ఉన్న చార్జీలపై 14.2 శాతం పెంచుతూ రైల్వేశాఖ శుక్రవారం నిర్ణయం తీసుకుంది. పెరిగిన చార్జీలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానున్నారుు. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల జిల్లా ప్రయూణికులపై నెలకు సగటున రూ.85 లక్షల వరకు భారం పడుతుందని రైల్వేవర్గాలు అంటున్నాయి. ఇందులో సగానికి పైగా జిల్లా కేంద్రంపైనే పడనుంది. అన్ని తరగతులపై వడ్డన గతంలో చార్జీలు పెంచినప్పుడు సామాన్యులపై భారం పడకుండాై రెల్వేశాఖ జాగ్రత్తలు తీసుకునేది. ఎక్కువగా సంపన్నులు ప్రయాణించే ఏసీ తరగతులపైనే చార్జీల వడ్డన ఉండేది. ఆ తర్వాత స్లీపర్ క్లాస్, ఎక్స్‌ప్రెస్‌ల చార్జీలను పెంచేది. అతి కొద్ది సందర్భాల్లోనే ప్యాసింజర్ రైళ్ల చార్జీలలో పెరుగుదల ఉండేది. కానీ ఈ సారి అనూహ్యంగా ప్యాసింజర్ నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఏసీ వరకు అన్ని తరగతులకు సంబంధించి ప్రస్తుతం ఉన్న టికెట్ చార్జీలను ఏకంగా 14.2 శాతం పెంచింది. దానితో చార్జీల పెంపు భారం నుంచి ఏ ఒక్క ప్రయాణికుడికీ మినహాయింపు లభించ లేదు. జిల్లాలో ప్రధాన రైల్వేస్టేషన్లు అయిన కాజీపేట స్టేషన్ నుంచి 12వేల మంది, వరంగల్ నుంచి సగటున 27వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరితో పాటు పోస్టాఫీసులో, ఆన్లైన్లో రిజర్వేషన్లు చేసుకునే వారిని కలుపుకుంటే జిల్లా కేంద్రం నుంచి రైళ్ల ద్వారా రాకపోకలు సాగించే వారి సంఖ్య 40వేలుగా ఉంది. వీటితో పాటు మహబూబాబాద్, జనగామ, డోర్నకల్ వంటి ఇతర స్టేషన్లను సైతం కలుపుకుంటే ఈ సంఖ్య సగటున దాదాపుగా 70వేలుగా ఉంది. తద్వారా ప్రతీరోజు జిల్లాలో సగటున 20 లక్షల రూపాయల వరకు టిక్కెట్ల అమ్మకాలు సాగుతున్నాయి. ఈ లెక్కన చార్జీల పెంపు వల్ల ప్రతీరోజు జిల్లా ప్రయాణికులపై 2.90 లక్షల రూపాయల అదనపు భారం పడనుంది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై, షిర్డీ, తిరుపతి వంటి దూరప్రాంతాలకు స్లీపర్‌క్లాస్, ఏసీ తరగతుల్లో ప్రయాణించే వారిపై చార్జీల పెంపు భారం అధికంగా ఉంది. ఈ చార్జీల పెంపు వల్ల సగటున ఒక్కో ప్రయాణికుడి టిక్కెట్ ధర సగటున వంద రూపాయల వరకు పెరిగింది. -
రైల్వే బాదుడు
బెల్లంపల్లి : కేంద్ర ప్రభుత్వం రైల్వే చార్జీలు పెంచి ప్రయాణికుల నడ్డి విరిచింది. ప్రయాణికుల చార్జీలు, సరుకుల రవాణా చార్జీలు భారీగా పెంచేసింది. పెంచిన చార్జీలు ఈ నెల 25వ తేదీ నుంచి అమలులోకి రానున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోడీ సర్కారు తొలుత రైల్వే చార్జీల పెంపుపై దృష్టి సారించింది. ప్రయాణికుల చార్జీలను 14.2 శాతం, సరుకు రవాణా చార్జీలను 6.5 శాతం చొప్పున పెంచుతూ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంది. పెంచిన ప్రయాణ, సరుకు రవాణా చార్జీల వల్ల జిల్లా ప్రయాణికులపై ఏడాదికి సుమారు రూ.11.52 కోట్లు భారం పడే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణ భారం జిల్లాలో పది ప్రధాన రైల్వేస్టేషన్లు ఉన్నాయి. మంచి ర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, రవీంద్రఖని, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), రేచిని, ఆసిఫాబాద్ రోడ్(రెబ్బెన), ఆదిలాబాద్, బాసర తదితర రైల్వేస్టేషన్ల నుంచి రోజువారీగా సుమారు 16 వేలకు పైబడి మంది ప్రయాణికులు సుదూర ప్రాంతాలకు రాకపోకలు చేస్తుంటారు. ఆ ప్రాతిపదికన నెలకు 5 లక్షల వరకు ప్ర యాణికులు ప్రయాణం సాగిస్తుంటారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్ర యాణికుల చార్జీలు పెంచి ప్రభుత్వం నడ్డి విరిచే చర్యలకు పూనుకుంది. జిల్లాలోని పలు ప్రాంత ల నుంచి ప్రయాణికులు అత్యధికంగా హైదరాబాద్, వరంగల్, గుంటూర్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, నాగ్‌పూర్, న్యూఢిల్లీ ప్రాంతాలకు వెళ్తుంటారు. పెంచిన 14.2 శాతం చార్జీల వల్ల జిల్లాలోని ప్రయాణికులపై రోజుకు సగటున రూ.25 వేల వరకు భారం పడనున్నట్లు రైల్వే అధికారులు ప్రాథమికంగా అం చనా వేశారు. ఆ లెక్కన ప్రయాణికుల నుంచి ఏడాదికి రూ.9 కోట్లు రైల్వేకు ఆదాయం సమకూరనుంది. ఒక్కసారిగా భారీ స్థాయిలో పెరిగిన రైలు చార్జీలు ప్రయాణికులకు గుదిబండగా మారనున్నాయి. సరుకు రవాణా భారం రూ. 2.52 కోట్లు రైల్వే ప్రయాణికుల చార్జీల పెంపుతోపాటు సరుకుల చార్జీలను ప్రభుత్వం ఎడాపెడా పెంచేసింది. జిల్లా నుంచి రోజువారీగా భారీస్థాయిలో బొగ్గు, సిమెంట్ రవాణా జరుగుతుంటాయి. గనుల నుంచి ఉత్పత్తి చేసిన బొగ్గును రైల్వే వ్యాగన్ల ద్వారా ఫ్యాక్టరీలకు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు రవాణా చేస్తుంటారు. మంచిర్యాల రైల్వేస్టేషన్ నుంచి నెలకు దాదాపు 100 ర్యాకులు(42 లక్షల టన్నుల చొప్పున) బొగ్గు కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీకి ఎగుమతి అవుతుంది. అదే మాదిరి మందమర్రి రైల్వేస్టేషన్ నుంచి నెలకు 10 ర్యాకులు (3 లక్షల 60 వేల టన్నులు చొప్పున) సిమెంట్ ఇతర ప్రాంతాలకు రవాణా జరుగుతుంది. సరుకు రవాణా జరగడానికి రైల్వే శాఖ పరిశ్రమలకు 50 శాతం కన్సెషన్‌ను వర్తింపజేస్తుంది. అయినప్పటికిని 6.5 శాతం సరుకు రవాణా చార్జీలను పెంచడం వల్ల రోజుకు సుమారు రూ.70 వేల వరకు అదనపు భారం పడనుంది. ఆ ప్రాతిపదికన ఏడాదికి రూ.2.52 కోట్లు సరుకు రవాణా చార్జీలను పరిశ్రమల నుంచి రైల్వే శాఖ వసూలు చేయనుంది. రైల్వే ప్రయాణికులకు సదుపాయాలు, కొత్త రైళ్లను ప్రవేశపెట్టి ఇక్కట్లను తీర్చాల్సిన ప్రభుత్వం ఉరుములేని మెరుపులాగా ప్రయాణికుల చార్జీలు, సరుకుల చార్జీలు పెంచింది. పెంచిన చార్జీలపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ఫలితంగా నిత్యావసర వస్తువుల చార్జీలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నడ్డివిరిచిన ‘నమో’
ఒంగోలు: బడ్జెట్ కంటే ముందే మోడీ ప్రభుత్వం రైలు చార్జీల పెంపునకు పచ్చజెండా ఊపింది. ఒక తరగతి అని పేర్కొనకుండా అందరిపైనా భారం మోపుతూ నిర్ణయం తీసుకుంది. మరో వైపు బడ్జెట్లో ఇంకెటువంటి నిర్ణయాలు అమలు చేస్తారో అనే భయమూ ప్రజల్ని వెంటాడుతోంది. అధికారంలోకి వచ్చి పట్టుమని నెలరోజులు గడిచాయో లేదో చడీచప్పుడు కాకుండా రైల్వే చార్జీలు 14.2 శాతం మేర పెంచుతూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పెరిగిన ధరలు ఈనెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి అంటే 25వ తేదీ నుంచి అమలులోకి వస్తాయని రైల్వేశాఖ ప్రకటించింది. = సాధారణంగా చార్జీల పెంపు సమయంలో ప్యాసింజర్ ప్రయాణికులు, రెండో తరగతి జనరల్ ప్రయాణికులపైనా భారం పడకుండా రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఈ సారి అన్ని రకాల ప్రయాణికులపైనా భారం మోపారు. = 6.5 శాతం చొప్పున సరుకుల రవాణా చార్జీలను కూడా పెంచుతూ రైల్వేశాఖ తీసుకున్న నిర్ణయం వల్ల వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ అనుబంధ వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని రైతులు, వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. = జిల్లా నుంచి ఎక్కువగా సుబాబుల్, జామాయిల్ కర్రలతోపాటు గ్రానైట్ రవాణా అవుతోంది. మరో వైపు ఎరువులు, సిమెంటు దిగుమతులు ఉండనే ఉన్నాయి. ఒంగోలు నుంచి ముఖ్య పట్టణాలకు రైల్వే చార్జీలు: పట్టికలో పేర్కొన్న చార్జీలు కేవలం రెండో తరగతి సాధారణ ఛార్జీలు మాత్రమే. సూపర్ ఫాస్ట్ రైలు టికెట్‌కు అదనంగా రూ.15 కలుపుకోవాలి. దీంతోపాటు బెర్తు రిజర్వేషన్ తదితరాలు అదనం. రైల్వే ప్రయాణికులపై పెనుభారం: సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి కేవీ ప్రసాద్ రైలు ప్రయాణ చార్జీలు పెంచుతూ తీసుకున్న నిర్ణయం దారుణం. ఒక వైపు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నపుడు కనీసం పార్లమెంట్లో ప్రస్తావించకుండా చార్జీలను ఏకపక్షంగా పెంచడం బాధాకరం. ఇది సహేతుకం కాదు. వ్యవసాయ అనుబంధ వస్తువులైన ఎరువులు తదితరాల ధరలు కూడా పెరగడం ఖాయం. ఇదే జరిగితే రైతు పంట పండించడమే గగనంగా మారుతుంది. కనుక రైల్వే చార్జీల పెంపును ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం.