టిక్కెట్ స్థాయిని బట్టి రూ.5 నుంచి రూ.20 అదనపు భారం
సాక్షి, విజయవాడ/రాజమండ్రి సిటీ : గోదావరి పుష్కరాలకు వచ్చే ప్రయాణికులపై ‘పుష్కరమేళా సర్‌చార్జి’ పేరుతో ప్రత్యేక బాదుడుకు రైల్వే సిద్ధమైంది. జూలై 14 నుంచి 25 వరకు తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలోని 7 స్టేషన్‌లకు ప్రయాణించేవారిపై ఈ సర్‌చార్జి వసూలు చేయనున్నట్లు విజయవాడ డివిజన్ సీనియర్ పీఆర్వో మైఖేల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి , గోదావరి, కొవ్వూరు స్టేషన్‌లు, తెలంగాణలో మంచిర్యాల, బాసర, భద్రాచలం రోడ్, రామగుండం స్టేషన్‌లు గమ్యంగా ప్రయాణించేవారికి ఈ సర్‌చార్జి పడుతుంది. సెకండ్ క్లాస్ (ఆర్డినరీ, మెయిల్, ఎక్స్‌ప్రెస్) టికెట్‌కు రూ.5, స్లీపర్ క్లాస్ (ఆర్డినరీ, మెయిల్, ఎక్స్‌ప్రెస్)కు రూ.5, ఏసీ చైర్ కార్, ఏసీ 3 టైర్ టికెట్‌కు రూ.10, ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్‌కు రూ.20 చొప్పున చెల్లించాలి. రూ.15 చార్జీ దాటిన టికెట్‌పైనే ఈ సర్‌చార్జి వసూలు చేస్తారు. ఈ స్టేషన్లలో ఇప్పటికే టికెట్లు జారీ చేసి ఉంటే సర్‌చార్జిని రైలులో టీటీఈలు వసూలుచేస్తారు. గత పుష్కరాలకూ ఇలాగే జరిగితే ప్రజలనుంచి నిరసనవ్యక్తమైంది. దీంతో రద్దుచేశారు.
పుష్కరాలకు రైల్వే బాదుడు
Published Fri, Jun 12 2015 1:11 AM | Last Updated on Sun, Sep 3 2017 3:35 AM
Advertisement