
కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా
సాక్షి ప్రతినిధి, చెన్నై: తాము తలచుకుని ఉంటే తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఉండే వాళ్లమని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని తిరుచెందూరులోని సెంథిల్‌నాథన్ ఆలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్నాడీఎంకే ప్రభుత్వం తనకు తానుగానే కూలిపోతుంది. అసెంబ్లీలో బలం కోల్పోయిన పరిస్థితిలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. మేం తలచుకుని ఉంటే ఆర్టికల్–356ను ప్రయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఉండేవాళ్లం’ అని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం బీజేపీతో రహస్య సంబంధాలను నెరపుతోందనీ, తమిళనాడులో ప్రస్తుతం మోదీ ప్రభుత్వమే సాగుతోందని విమర్శలు రావడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment