Communications Minister
-
టెలికం తయారీకి డాట్ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం రంగంలో తయారీ వ్యవస్థకు దన్నునిచ్చేందుకు టెలికం శాఖ(డాట్) సన్నాహాలు ప్రారంభించింది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై అవసరమైన సిఫారసులను సిద్ధం చేసేందుకు నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. తద్వారా టెలికం తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్)కున్న అవరోధాలను తొలగించి బలపడేందుకు ప్రోత్సాహాన్నివ్వనుంది. ఈ విషయాలను అధికారిక మెమొరాండం పేర్కొంది. ఈ నెల మొదట్లో టెలికం గేర్ల తయారీ కంపెనీలకు చెందిన 42 మంది చీఫ్‌లతో కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఇందుకు బీజం వేసింది. ఈ సమావేశంలో కంపెనీ చీఫ్‌లు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు అవసరమున్నట్లు మంత్రి భావించారు. గేర్ తయారీకి బూస్ట్ టాస్క్‌ఫోర్సుల్లో ఒకదాని ద్వారా టెలికం గేర్ తయారీకి దశలవారీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని డాట్ సిఫారసు చేస్తోంది. తద్వారా దేశీ సరఫరా చైన్ ఎకోసిస్టమ్‌కు బూస్ట్‌నివ్వాలని యోచిస్తోంది. దీంతో ప్రపంచ సంస్థలను ఆకట్టుకునే ప్రణాళికల్లో ఉంది. తాజా మెమొరాండం ప్రకారం ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వ రంగ రీసెర్చ్ సంస్థ సీడాట్ సీఈవో ఆర్కే ఉపాధ్యాయ్‌ను సహచైర్మన్‌గా ఏర్పాటు చేయనుంది. 2016లో దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు దశలవారీ కార్యక్రమాన్ని నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. తేజాస్ నెట్వర్క్స్ సీఈవో సంజయ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న టాస్క్‌ఫోర్స్ ప్రస్తుత ఎకోసిస్టమ్‌ను అధ్యయనం చేస్తుంది. తదుపరి టెలి కం టెక్నాలజీ అభివృద్ధి నిధి, సెమికాన్ పాలసీ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్ వంటి పథకాల ద్వారా 4–5 చిప్ డెవలప్‌మెంట్స్‌కు అవకాశాలను సూచిస్తుంది. తద్వా రా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది. కస్టమ్ క్లియరెన్స్‌లపై దృష్టి మూడో టాస్క్‌ఫోర్స్ కస్టమ్ క్లియరెన్స్, ఎయిర్ కార్గో రవాణా, మౌలికసదుపాయాల అందుబాటుపై పరిశీలన చేపడుతుంది. తద్వారా లీడ్ సమయాన్ని మెరుగుపరచడం, ఉత్పత్తి, అమ్మకాలలో ఇన్వెంటరీని తగ్గించడం, కీలక విమానాశ్రయాలలో ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్ల ఏర్పాటు తదితరాల ద్వారా లాజిస్టిక్స్ సవాళ్లకు చెక్ పెడుతుంది. టెలికం గేర్ తయారీదారుల సమాఖ్య వీవోఐసీఈ(వాయిస్) డైరెక్టర్ జనరల్ ఆర్కే భట్నాగర్ అధ్యక్షతన మరో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టాస్క్‌ఫోర్స్ డిజిటల్ ఇండియా, డేటా సెంటర్లు, రైల్వే ఆధునీకరణ తదితరాలకు అవసరమైన 5జీ ప్రొడక్టుల అభివృద్ధి, తయారీకి దేశీయంగా కొత్త అవకాశాలను గుర్తించనుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లన్నీ 45 రోజుల్లోగా నివేదికలను దాఖలు చేయవలసి ఉంటుందని అధికారిక మెమొరాండం పేర్కొంది. -
1.84 లక్షల గ్రామాల్లో భారత్‌నెట్ సేవలు
న్యూఢిల్లీ: భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలతో దేశవ్యాప్తంగా 1,84,399 గ్రామ పంచాయితీలకు (నవంబర్ 28 నాటికి) తక్షణం సేవలు అందించొచ్చని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ లోక్‌సభకు తెలిపారు. అన్ని గ్రామ పంచాయితీలు, గ్రామాల పరిధిలో అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించనున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద ఫైబర్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ఇళ్లకు కనెక్షన్లు అందించడం జరుగుతుంది. అలాగే, ప్రభుత్వ సంస్థలకు వైఫై యాక్సెస్ పాయింట్లు, ఇంటర్నెట్ సదుపా యం ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు 1,04,664 గ్రామ పంచాయితీల్లో వైఫై యాక్సెస్ పాయింట్లు ఏర్పాటయ్యాయి’’అని మంత్రి చౌహాన్ తెలిపారు. టెలికం రంగానికి సంబంధించి పీఎల్ఐ పథకం కింత ప్రోత్సాహకాల కోసం 31 దరఖాస్తులు రాగా, అర్హత కలిగిన 28 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు మరో ప్రశ్నకు సమధానంగా చెప్పారు. -
Har Ghar Tiranga: 10 రోజుల్లో ఎన్ని పతాకాలు కొన్నారో తెలుసా?
న్యూఢిల్లీ: జాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహిస్తున్న హర్‌ఘర్ తిరంగా పిలుపులో కేవలం పది రోజుల్లో ఆన్లైన్లో పౌరులకు 1 కోటికి పైగా జాతీయ జెండాలను విక్రయించినట్లు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. పోస్టల్ విభాగానికి దేశవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల పోస్టాఫీసుల ద్వారా జాతీయ జెండాలను విక్రయిస్తోంది. దేశవ్యాప్తంగా ఏ చిరునామాకైనా ఉచిత డోర్‌స్టెప్ డెలివరీని కూడా ఆఫర్ చేస్తోంది. ఒక్కో త్రివర్ణ పతాకాన్ని 25 చొప్పున పౌరులు 1.75 లక్షలకు పైగా జెండాలను ఆన్లైన్లో కొనుగోలు చేశారు. దేశవ్యాప్తంగా 4.2 లక్షల మంది తపాలా ఉద్యోగులు నగరాలు, పట్టణాలు, గ్రామాలతోపాటు, సరిహద్దు ప్రాంతాలలో, తీవ్రవాదుల ప్రభావిత జిల్లాల్లో పర్వత, గిరిజన ప్రాంతాల్లో సైతం విస్తృతంగా ప్రచారం చేశారని డిఓపి తెలిపింది. ప్రభాత్ భేరీలు, బైక్ ర్యాలీ చౌపల్స్ సభల ద్వారా, సమాజంలోని ప్రతి వర్గానికి 'హర్ ఘర్ తిరంగా' సందేశాన్ని తీసుకెళ్లామని వెల్లడించింది. "ప్రభాత్ ఫేరిస్, బైక్ ర్యాలీ మరియు చౌపల్స్ సభల ద్వారా, ఇండియా పోస్ట్ సమాజంలోని ప్రతి వర్గానికి 'హర్ ఘర్ తిరంగా' సందేశాన్ని తీసుకువెళ్లింది. ప్రోగ్రామ్ యొక్క సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ట్విట్టర్ మరియు ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా సాధనాలు కూడా విస్తృతంగా ఉపయోగించబడ్డాయి. డిజిటల్‌గా అనుసంధానించబడిన పౌరులు" అని పోస్టల్ శాఖ తెలిపింది. కాగా 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులు ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఈ పిలుపులో చాలామంది ప్రజలు స్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో పలు పోస్ట్‌లు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. What is Your Excuse??.. Tiranga Merit Shan 🇮🇳 HarGharTiranga🇮🇳 pic.twitter.com/qg6n2OR0aC — ट्विटर पर उपस्थित 🙄 (@aapki_harsha) August 12, 2022 p> “I can't see the flag, but I can feel patriotism by touching the flag” - Madhuri, class IX student.@IndiaPostOffice #HarGharTiranga pic.twitter.com/XnDfS8c8Hi — Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) August 12, 2022 -
5జీ వేలంపై టెల్కోల్లో ఆసక్తి
న్యూఢిల్లీ: అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలకు ఉపయోగపడే 5జీ స్పెక్ట్రంపై టెలికం సంస్థలు ఆసక్తిగానే ఉన్నాయని, వేలంలో ఉత్సాహంగా పాల్గొంటాయని కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ధీమా వ్యక్తం చేశారు. 5జీ సర్వీసులతో దేశం ముందుకెళ్లడానికి ఇదే సరైన సమయమని ఆయన పేర్కొన్నారు. స్పెక్ట్రం బేస్ ధరను గణనీయంగా తగ్గించడంతో పాటు, యూసేజీ చార్జీలనూ ఎత్తివేయడంతో టెల్కోలపై ఆర్థిక భారం చాలా మటుకు తగ్గిపోతుందని మంత్రి చెప్పారు. ఇక టెక్ కంపెనీలు సొంతంగా క్యాప్టివ్ నెట్‌వర్క్‌లు ఏర్పాటు చేసుకునేందుకు స్పెక్ట్రం కేటాయించే విషయంలో టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సుల మేరకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెలికం శాఖ జూలై 26న స్పెక్ట్రం వేలం నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ వేలంలో దాదాపు రూ. 4.3 లక్షల కోట్ల విలువ చేసే 72 గిగాహెట్జ్ స్పెక్ట్రంను విక్రయించనుంది. దీనికి సంబంధించి జూన్ 20న ప్రీ–బిడ్ కాన్ఫరెన్స్‌ను టెలికం శాఖ నిర్వహించనుంది. -
తల్చుకుంటే సర్కారును రద్దు చేసే వాళ్లం
సాక్షి ప్రతినిధి, చెన్నై: తాము తలచుకుని ఉంటే తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఉండే వాళ్లమని కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి మనోజ్ సిన్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులోని తిరుచెందూరులోని సెంథిల్నాథన్ ఆలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘అన్నాడీఎంకే ప్రభుత్వం తనకు తానుగానే కూలిపోతుంది. అసెంబ్లీలో బలం కోల్పోయిన పరిస్థితిలో ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆ పార్టీ నేతలు అష్టకష్టాలు పడుతున్నారు. మేం తలచుకుని ఉంటే ఆర్టికల్–356ను ప్రయోగించి ప్రభుత్వాన్ని రద్దు చేసి ఉండేవాళ్లం’ అని కేంద్ర మంత్రి అన్నారు. రాష్ట్రంలోని అన్నాడీఎంకే ప్రభుత్వం బీజేపీతో రహస్య సంబంధాలను నెరపుతోందనీ, తమిళనాడులో ప్రస్తుతం మోదీ ప్రభుత్వమే సాగుతోందని విమర్శలు రావడం తెల్సిందే. -
కాల్‌డ్రాప్ పరిస్థితిపై చర్చిద్దాం రండి!
న్యూఢిల్లీ : వినియోగదారులకు తెగ విసుగు తెప్పించిన కాల్ డ్రాప్స్ ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు కేంద్ర కమ్యూనికేషన్ శాఖా మంత్రి మనోజ్ సిన్హా, టెల్కోలతో భేటీ కానున్నారు. నవంబర్ 1న అన్ని టెలికాం కంపెనీల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లతో ఆయన భేటీ నిర్వహించనున్నట్టు టెలికాం సెక్రటరీ జే.ఎస్ దీపక్ తెలిపారు. ఈ భేటీలోనే కాల్ డ్రాప్స్ ప్రస్తుత పరిస్థితితో పాటు, భవిష్యత్తు కార్యచరణపై కూడా చర్చించనున్నారు. కాల్ డ్రాప్ పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల నమోదైనట్టు ట్రాయ్ వెల్లడించినట్టు దీపక్ తెలిపారు. ఈ సమస్యపై జూన్‌లో టెలికాం కంపెనీ ఆపరేటర్లతో భేటీ నిర్వహించామని, ఆ భేటీలో టెల్కోలు 100 రోజుల ప్లాన్ హామీగా ఇచ్చినట్టు పేర్కొన్నారు. ఈ ప్రొగ్రామ్ ద్వారా కాల్ డ్రాప్స్ పరిస్థితి చక్కబరిచి, లక్ష్యాలను చేధిస్తామన్నారని వాగ్దానం చేసినట్టు చెప్పారు. జూన్10 నుంచి ఈ ప్రొగ్రామ్ ప్రారంభమైంది. అప్పటినుంచి ట్రాయ్ సమర్పిస్తున్న నివేదికల్లో కాల్ డ్రాప్స్‌లో మెరుగైన ఫలితాలు కనిపించాయని తెలిపారు. 2015 డిసెంబర్ వరకు 54 నెట్‌వర్క్స్‌లో ఎలాంటి పనితీరు కనిపించలేదని, ప్రస్తుతం ఆ నెట్‌వర్క్‌లు 19కి తగ్గినట్టు వివరించారు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా టెల్కోలు 60వేల బీటీఎస్(బేస్ ట్రాన్సీవర్ స్టేషన్లను) ఏర్పరచనున్నట్టు తెలిపారు. మొదటి 45లో 48వేల స్టేషన్లను టెల్కోలు ఏర్పరిచారు. కాల్ డ్రాప్స్ సమస్య నుంచి బయటపడటానికి బీటీఎస్‌లు ఏర్పాటుకు టెల్కోలు రూ.12వేల కోట్ల మేర ఖర్చుచేస్తున్నట్టు దీపక్ తెలిపారు.