1.84 లక్షల గ్రామాల్లో భారత్‌నెట్‌ సేవలు | 1. 84 lakh Gram Panchayats service-ready with broadband infra under BharatNet | Sakshi
Sakshi News home page

1.84 లక్షల గ్రామాల్లో భారత్‌నెట్‌ సేవలు

Dec 22 2022 3:33 AM | Updated on Dec 22 2022 3:33 AM

1. 84 lakh Gram Panchayats service-ready with broadband infra under BharatNet - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఏర్పాటు చేసిన బ్రాడ్‌బ్యాండ్‌ సదుపాయాలతో దేశవ్యాప్తంగా 1,84,399 గ్రామ పంచాయితీలకు (నవంబర్‌ 28 నాటికి) తక్షణం సేవలు అందించొచ్చని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్‌ లోక్‌సభకు తెలిపారు. అన్ని గ్రామ పంచాయితీలు, గ్రామాల పరిధిలో అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్, బ్రాడ్‌ బ్యాండ్‌ సేవలను అందించనున్నట్టు చెప్పారు.

‘‘భారత్‌నెట్‌ ప్రాజెక్ట్‌ కింద ఫైబర్‌ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ఇళ్లకు కనెక్షన్లు అందించడం జరుగుతుంది. అలాగే, ప్రభుత్వ సంస్థలకు వైఫై యాక్సెస్‌ పాయింట్లు, ఇంటర్నెట్‌ సదుపా యం ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు 1,04,664 గ్రామ పంచాయితీల్లో వైఫై యాక్సెస్‌ పాయింట్లు ఏర్పాటయ్యాయి’’అని మంత్రి చౌహాన్‌ తెలిపారు. టెలికం రంగానికి సంబంధించి పీఎల్‌ఐ పథకం కింత ప్రోత్సాహకాల కోసం 31 దరఖాస్తులు రాగా, అర్హత కలిగిన 28 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు మరో ప్రశ్నకు సమధానంగా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement