BharatNet
-
గ్రామాల బ్రాడ్‌బ్యాండ్ అనుసంధానికి రూ.1 లక్ష కోట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6.4 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానించే భారత్‌నెట్ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటికే 1.94 లక్షల గ్రామాల్లో ఈ ఆప్టికల్ ఫైబర్ నెట్ అనుసంధానం పూర్తవ్వగా మొత్తంగా అన్ని గ్రామాలకు నెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకు సంబంధించిన రూ.1.39 లక్షల కోట్ల నిధుల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొదట నాలుగు జిల్లాల్లోని గ్రామాల అనుసంధానానికి ఉద్దేశించిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఈ ఫైబర్–టు–హోమ్ మోడల్‌ను తర్వాత వేర్వేరు రాష్ట్రాల్లోని 60వేల గ్రామాలకు విస్తరించారు. ప్రాజెక్టు ద్వారా 2.5 లక్షల ఉద్యోగాల సృష్టి సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది. -
1.84 లక్షల గ్రామాల్లో భారత్‌నెట్ సేవలు
న్యూఢిల్లీ: భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద ఏర్పాటు చేసిన బ్రాడ్‌బ్యాండ్ సదుపాయాలతో దేశవ్యాప్తంగా 1,84,399 గ్రామ పంచాయితీలకు (నవంబర్ 28 నాటికి) తక్షణం సేవలు అందించొచ్చని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవుసిన్హ చౌహాన్ లోక్‌సభకు తెలిపారు. అన్ని గ్రామ పంచాయితీలు, గ్రామాల పరిధిలో అధిక వేగంతో కూడిన ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సేవలను అందించనున్నట్టు చెప్పారు. ‘‘భారత్‌నెట్ ప్రాజెక్ట్ కింద ఫైబర్ ద్వారా మారుమూల ప్రాంతాల్లోని ఇళ్లకు కనెక్షన్లు అందించడం జరుగుతుంది. అలాగే, ప్రభుత్వ సంస్థలకు వైఫై యాక్సెస్ పాయింట్లు, ఇంటర్నెట్ సదుపా యం ఏర్పాటు చేస్తాం. ఇప్పటి వరకు 1,04,664 గ్రామ పంచాయితీల్లో వైఫై యాక్సెస్ పాయింట్లు ఏర్పాటయ్యాయి’’అని మంత్రి చౌహాన్ తెలిపారు. టెలికం రంగానికి సంబంధించి పీఎల్ఐ పథకం కింత ప్రోత్సాహకాల కోసం 31 దరఖాస్తులు రాగా, అర్హత కలిగిన 28 దరఖాస్తులకు ఆమోదం తెలిపినట్టు మరో ప్రశ్నకు సమధానంగా చెప్పారు. -
ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టుగా భారత్ నెట్
న్యూఢిల్లీ: దేశంలోని 16 రాష్ట్రాల్లోని నివాసిత గ్రామాలకు పీపీపీ(ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం)మోడల్ ద్వారా భారత్ నెట్ అందించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. అంటే బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీని పెంచడం కోసం, సేవలు అందించడానికి కేంద్రం ప్రైవేట్ రంగానికి అనుమతి ఇచ్చింది. "దేశంలో ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కనెక్టివీటీ పెంచేందుకు ఉద్దేశించిన భారత్ నెట్ పథకానికి అదనంగా రూ.19,041 కోట్లు కేటాయిస్తున్నట్టు" కొద్ది రోజుల క్రితమే ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించారు. అలా ప్రకటించిన రెండు రోజులకే "16 రాష్ట్రంలోని 3,61,000 గ్రామాల్లో ఇంటర్నెట్ బ్రాడ్‌బాండ్ కనెక్టివీటీ అందించేందుకు పీపీపీ పద్దతిలో ప్రపంచ స్థాయిలో బిడ్డింగ్ నమూనాను అమలు చేయాలి" అని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండు రోజుల క్రితం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నిర్ణయాలకు మంత్రివర్గం ఈ రోజు ఆమోదం తెలిపింది అని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. భారతదేశంలోని అన్ని గ్రామాల్లో సమాచార విప్లవం కోసం చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 2020 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో అన్ని గ్రామాలు 1,000 రోజుల్లో బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ తో అనుసంధానించబడతాయని అన్నారు.భారత్ నెట్ పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంలో ప్రాజెక్టుగా ప్రారంభించారు. 2021, మే 31 నాటికి 1,56,223 గ్రామ పంచాయతీలలో బ్రాడ్ బ్యాండ్ సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి. దీని కోసం ఇప్పటికే రూ.42,068 కోట్ల రూపాయలు కేటాయించినట్లు నిర్మల సీతారామన్ తెలిపారు. ఈ పథకానికి తాజాగా రూ.19,041 కోట్లు కేటాయించడంతో దీంతో ఈ పథకం మొత్తం విలువ రూ. 61,109 కోట్లకు చేరుకుంది.