న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 6.4 లక్షల గ్రామాలను బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానించే భారత్‌నెట్ ప్రాజెక్టు పనులు వేగం పుంజుకోనున్నాయి. ఇప్పటికే 1.94 లక్షల గ్రామాల్లో ఈ ఆప్టికల్ ఫైబర్ నెట్ అనుసంధానం పూర్తవ్వగా మొత్తంగా అన్ని గ్రామాలకు నెట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది.
ఇందుకు సంబంధించిన రూ.1.39 లక్షల కోట్ల నిధుల కేటాయింపునకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొదట నాలుగు జిల్లాల్లోని గ్రామాల అనుసంధానానికి ఉద్దేశించిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఈ ఫైబర్–టు–హోమ్ మోడల్‌ను తర్వాత వేర్వేరు రాష్ట్రాల్లోని 60వేల గ్రామాలకు విస్తరించారు. ప్రాజెక్టు ద్వారా 2.5 లక్షల ఉద్యోగాల సృష్టి సాధ్యమని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment