టెలికం రంగ వృద్ధికి చర్యలపై కేంద్రం హామీ
న్యూఢిల్లీ: రుణభారంతో కుంగుతున్న టెలికం రంగ వృద్ధికి తగు చర్యలు తీసుకుంటామని టెల్కోలకు కేంద్ర కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి మనోజ్ సిన్హా హామీ ఇచ్చారు. టెలికం పరిస్థితిపై అంతర్ మంత్రిత్వ శాఖల బృందం (ఐఎం జీ) నివేదిక త్వరలో రానున్నట్లు తెలిపారు. వివిధ టెల్కోల అధిపతులతో గురువారం సమావేశమైన సందర్భంగా మంత్రి వారికి ఈ విషయాలు వివరించారు.
సుమారు రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశంలో భారతి ఎయిర్‌టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, ఆర్‌కామ్ చైర్మన్ అనిల్ అంబానీ, ఐడియా ఎండీ హిమాంశు కపానియా, టాటా సన్స్ డైరెక్టర్ ఇషాత్ హుస్సేన్, రిలయన్స్ ఇన్ఫోకామ్ బోర్డు సభ్యుడు మహేంద్ర నహతా తదితరులు ఇందులో పాల్గొన్నారు. టెలికం రంగం ఆర్థిక సమస్యలు, పరిష్కార మార్గాలపై ఐఎంజీ ఇటీవల టెల్కోలతో భేటీ అయిన నేపథ్యంలో తా జా సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
సాక్షి బిజినెస్ వెబ్‌సైట్‌లో...
⇔ ర్యాలీకి రెడీగా ఉన్న టాప్ 10 షేర్లు
⇔ బోధ్ ట్రీని కొనేవారు లేరు
⇔ ప్లైవుడ్, లామినేషన్ షేర్లలో ర్యాలీ
⇔ చైనా పాల నిషేధంతో మురి‘పాలు’
⇔ మరిన్ని ఆసక్తికరమైన కథనాలు, స్టాక్ అప్‌డేట్స్..
WWW.SAKSHIBUSINESS.COM