
సాక్షి, చెన్నై: దేశంలో రైల్వే వ్యవస్థను ప్రయాణీకులు మరింత చేరువ దిశగా రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల సౌలభ్యం కోసం కొత్తగా రెండు మొబైల్ యాప్‌లను కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ చెన్నైలో లాంచ్ చేశారు. ‘రైల్ మదద్’, ‘మెనూ ఆన్ రైల్స్’ పేరిట రెండు రైల్వే యాప్‌లు తాజాగా అందుబాటులోకి తీసుకువచ్చామని మంత్రి తెలిపారు. ప్రయాణీకులు ఫిర్యాదులను సమర్పించటానికి రైల్ మదద్ అనుమతినిస్తుండగా, మెనూ ఆన్ రైల్స్ ఆహారాన్ని ఆర్డర్ చేయడానికి ఉపయోగడనుంది.
రైలు మదద్: ప్రయాణికుల ఫిర్యాదుల కుద్దేశించింది ‘రైల్ మదద్’ యాప్. ఈ మొబైల్ యాప్ ద్వార సమస్యలపై ప్రయాణికులు రైల్వే శాఖకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణికుల భద్రత, ఛైల్డ్ హెల్ప్ లైన్ నంబర్లను అనుసంధానం చేస్తూ ఈ యాప్ ను రూపొందించామని రైల్వే మంత్రి ప్రకటించారు.
మెనూ ఆన్ రైల్స్: మెనూ యాప్ సాయంతో ప్రయాణికులు తమకిష్టమైన ఆహారం, పానీయాలు, వాటి ధరలను తెలుసుకోవచ్చు. 96 రకాల బ్రేక్ ఫాస్ట్, ఆహార పదార్థాలు మెనూలో అందుబాటులో ఉన్నాయి. జైన్ ఫుడ్, డయాబెటిక్ ఫుడ్, బ్రేక్ ఫాస్ట్ లు అందుబాటులో ఉంచారు. శతాబ్ది, రాజధాని, దురంతో రైళ్లలో ముందుగా ఆర్డరిస్తే అన్నిరకాల ఆహారపదార్థాలు సప్లయి చేస్తామని రైల్వే అధికారులు చెప్పారు.
గత నాలుగేళ్ళలో రైల్వేల అభివృద్ధి గురించి కేంద్రమంత్రి గోయల్, రైల్వే శాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హా మీడియాతోమాట్లాడారు. 'సాఫ్ నియత్, సహీ వికాస్' అనే దృక్పథంతో పని చేస్తున్నామని, ముఖ్యంగా రైల్వేలో భద్రతకు ప్రాధాన్యమిచ్చామని పేర్కొన్నారు. తద్వారా రైలు ప్రమాదాల సంఖ్యను తగ్గించామని పీయూష్ గోయల్ వెల్లడించారు. 2013-14లో 118 రైలు ప్రమాదాలు జరగ్గా 2017-18లో వీటి సంఖ్యను 73కు తగ్గించామని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment