
‘రైలు ప్రమాదానికి అదే కారణం కావొచ్చు’
కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో రైలు పట్టాలు తప్పిన ఘటనలో 113 మంది మృతి చెందారని అధికారులు వెల్లడించారు. 150 మందికి పైగా గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత మంది ప్రాణాలను బలితీసుకున్న ఈ రైలు ప్రమాదంపై ప్రభుత్వం ఉన‍్నత స్థాయి విచారణకు ఆదేశించింది.
ప్రమాదానికి కారణమైన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. అయితే.. రైలు పట్టాలో పగులు ఏర్పడటం ఈ ప్రమాదానికి కారణం అయి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంజనీర్లు, నిపుణుల ఆధ్వర్యంలో ఈ ప్రమాదంపై విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు. ఈ ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.