
న్యూఢిల్లీ: భూకంపం.. ఇప్పటికీ శాస్త్రవేత్తలు ముందుగా అంచనా వేయలేకపోతున్న ఒక ప్రకృతి విపత్తు. కొన్ని వేల ఏళ్లుగా భూకంపాలు పెను విషాదాన్ని మిగులుస్తున్నాయి. తాజాగా ఈరోజు (ఫిబ్రవరి 17)న దేశరాజధాని ఢిల్లీలో సంభవించిన భూకంపం అక్కడి ప్రజలను భయకంపితులను చేసింది. అయితే భవిష్యత్ అంచనాల గురించి తెలిపిన నోస్ట్రాడమస్, బాబా వంగా భూకంపాలు, ప్రకృతి విపత్తులపై ఎటువంటి హెచ్చరికలు చేశారు?
నోస్ట్రాడమస్ తన కవితలలో తరచుగా ప్రకృతి వైపరీత్యాల గురించి తెలిపేవాడు. భూమి కంపించటం, నదులు ఉప్పొంగటం లాంటి పర్యావరణ సంక్షోభ హెచ్చరికలను ముందుగానే తెలియజేశాడు. 2025లో వాతావరణ మార్పుల ప్రభావం అధికంగా ఉంటుందని నోస్ట్రాడమస్ ముందుగానే తెలిపాడు. ఈయన చెప్పినట్లే సముద్ర మట్టాలు పెరగడం, మంచు వేగంగా కరగడం, వాతావరణంలో వేగవంతమైన మార్పుల గురించి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరించారు. నోస్ట్రాడమస్ తన పుస్తకంలో కార్చిచ్చు, కరువు, భారీ వరదలు మొదలైన వాటి గురించి రాశాడు. భూకంపం లేదా ఆకస్మిక భారీ వర్షపాతం మొదలైన ప్రకృతి వైపరీత్యాలను జనం చూస్తారని నోస్ట్రాడమస్ పేర్కొన్నాడు.
2025లో సంభవించే ప్రకృతి విపత్తుల గురించి నోస్ట్రాడమస్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచంలో భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతాయి. సూడాన్‌లో కరువు, పరిమిత సహాయం, పెద్ద ఎత్తున వలసలు లాంటి మానవతా సంక్షోభం ఎదురవుతుందన్నాడు. దీనికి అనుగుణంగానే బషర్ అల్-అసద్ పతనం తర్వాత సిరియాలో అనిశ్చిత వాతావరణం నెలకొంది.
బాబా వంగా 2025లో సంభవించే విపత్తుల గురించి కొన్న అంచనాలు అందించారు. యూరప్‌లో భీకర యుద్ధం ప్రారంభమవుతుంది. ఫలితంగా ఈ ఖండంలోని అధిక జనాభా నాశనమవుతుంది. బాబా వంగా జోస్యం ఒకవేళ నిజమైతే 2025లో రష్యా.. ప్రపంచాన్నంతటినీ శాసిస్తుంది. బాబా వంగా చెప్పినదాని ప్రకారం 2025లో అమెరికా పశ్చిమ తీరంలో భూకంపం వస్తుంది. పలు అగ్నిపర్వతాలు పేలే అవకాశాలున్నాయి. నోస్ట్రాడమస్ 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు. అతని అంచనాలు కొన్ని శతాబ్దాలుగా నిజమవుతున్నాయి. బల్గేరియన్ మహిళ బాబా వంగా చెప్పిన 9/11 దాడి, యువరాణి డయానా మరణం లాంటి అంచనాలు నిజమయ్యాయి.
ఇది కూడా చదవండి: రైల్వే స్టేషన్ తొక్కిసలాట: ఏడేళ్ల రియా ప్రాణాలు కోల్పోయిందిలా..
Comments
Please login to add a commentAdd a comment