పడకవ్యాధిని నయం చేసే ప్రత్యేకమైన పరికరం
- నివారణే ప్రధానం.. సకాలంలో చర్యలు చేపట్టాలి
- గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి సలహాలు... సూచనలు
- శ్వాస సాధారణంగా, నాడీరేటు అధికంగా ఉంటాయి.
- పడుకున్న ఆవులు తరచుగా నిలబడడనికి ప్రయత్నిస్తుంటాయి. కానీ నిలబడలేవు. మేత మేస్తుంటాయి. నెమరు వేస్తుంటాయి.
- కొన్ని ఆవులు కాళ్లను చాచి పడుకుని, తలను వెనక్కి లాక్కుని ఉండిపోతాయి.
- కొన్ని ఆవులు తరచుగా బెదురుతూ గిలగిలా కొట్టుకుంటాయి.
- పడక వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడతాయి. 7 రోజుల పాటు అదే పరిస్థితి ఉంటే పశువుల లేవడం కష్టం.
గజ్వేల్: పశువుల్లో పడక జబ్బు తలెత్తి రైతులు ఇబ్బంది పడుతుంటారు. ఈ వ్యాధి కారణంగా పశువులు తెలివిగా ఉండి కూడా లేచి నిలబడలేకపోతాయి. అధికంగా పాలిచ్చే పశువుల్లో ఈ వ్యాధి కనబడుతుంది. ఈ వ్యాధి నివారణకు సకాలంలో చర్యలు చేపట్టాలని గజ్వేల్ పశువైద్యాధికారి నరేందర్‌రెడ్డి(సెల్ : 9505056118) తెలిపారు. ఈ సందర్భంగా సలహాలు, సూచనలు అందించారు.
వ్యాధి సోకడానికి కారణాలు
సాధారణంగా పశువులు ఈనిన వెంటనే వచ్చే పాల జ్వరం వ్యాధి చికిత్స సక్రమంగా పూర్తి చేయకపోతే అవి డౌనర్‌గా మారతాయి. తొడ, కండరాళ్లకు గాయాలవ్వడం, వాటికి సంబంధించిన నరాలు దెబ్బ తినడం వల్ల గర్భస్త దూడ పెద్దగా ఉన్నప్పుడు, అందించే మేపులో, రక్తంలో కాల్షియం, భాస్వరం, మెగ్నీషియం లోపమున్నప్పుడు, పొటాషియం లవణ లోపం వల్ల ఆవులు పడుకుని పాకుతూ ఉంటాయి.
లక్షణాలు
చికిత్స
అవసరాన్ని బట్టి పశు వైద్యుల సలహాపై నో విజాక్-పి, కార్టిజోన్స్, విటమిన్-ఈ, కాల్షియం, పాస్ఫరస్, సెలీనియం ఇంజక్షన్లు వాడాలి. అదే విధంగా బీ1, బీ6, బీ12కు సంబంధించిన ఇంజక్షన్లు వాడాలి. నీరు, మేత తీసుకోకుండా ఉంటే 20శాతం గ్లూకోజ్ ఎక్కించాలి. వ్యాధిగ్రస్త పశువుల్ని అటూ... ఇటు తిప్పుతుండాలి. పశువులకు మెత్తని పడకను ఏర్పాటు చేయాలి.
వ్యాధి గ్రస్త పశువుల కండరాల్ని వరిగడ్డి లేదా కొబ్బరి పీచుతో మసాజ్ చేస్తుండాలి. ఇన్‌ఫ్రారెడ్ కిరణాల్లో కూడా మసాచ్ చేయవచ్చు. ఖనిజ లవణ మిశ్రమం ప్రతిరోజు వాడుతుండాలి. ఇవే కాకుండా పడక వ్యాధితో బాధపడే పశువులను క్రమక్రమంగా పైకి లేపడం ద్వారా బాగు చేయడానికి ప్రత్యేకంగా మహారాష్ట్రలో పరికరాన్ని తయారు చేశారు. దీని ధర సుమారు రూ. 15వేల వరకు ఉంటుందని, స్థానికంగా కూడా ఈ పరికరాన్ని తయారు చేసుకోవచ్చు.