యూజర్ల నిద్ర సమస్యల్ని గుర్తించే స్మార్ట్‌ వాచ్‌! | Samsung brings sleep apnea detection to Galaxy Watch 5 series - Sakshi
Sakshi News home page

యూజర్ల నిద్ర సమస్యల్ని గుర్తించే స్మార్ట్‌ వాచ్‌!

Published Sun, Oct 22 2023 7:44 AM | Last Updated on Sun, Oct 22 2023 8:06 AM

Samsung Galaxy Watch 5 Finds Sleeping Disorder On Users - Sakshi

ఇప్పటికే రకరకాల స్మార్ట్‌వాచీలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో చాలా వాచీలు నడక, వ్యాయామం ద్వారా శరీరంలో ఖర్చయ్యే కేలరీలు, రక్తపోటు వంటి సమాచారాన్ని యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు చూపిస్తూ ఉంటాయి.

దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ కంపెనీ నిద్రా సమస్యలను గుర్తించే స్మార్ట్‌ వాచీని ఇటీవల రూపొందించింది. దీనికి దక్షిణ కొరియా ఆహార, ఔషధ మంత్రిత్వశాఖ ఆమోదం కూడా లభించింది.

‘శామ్‌సంగ్‌ గెలాక్సీ వాచ్‌5’ పేరుతో వచ్చే ఏడాది నుంచి ఇది మార్కెట్‌లో అందుబాటులోకి రానుంది. ఇది నిద్ర తీరుతెన్నులను నిరంతరం గమనిస్తూ ఉంటుంది. నిద్రలో ఎదురయ్యే గురక, నిద్ర మధ్యలో శ్వాస ఆగిపోవడం వంటి సమస్యలను గుర్తించి, యాప్‌ ద్వారా తెలియజేస్తుంది. సమస్యలను ముందుగానే గుర్తించడం ద్వారా వెంటనే తగిన చికిత్స పొందడానికి వెసులుబాటు కల్పిస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement