![Nobody gets better treatment due to gown Says Supreme Court](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/sci.jpg.webp?itok=nH1gJCQT)
లాయర్లకు సీనియర్ గుర్తింపుపై సుప్రీం
న్యూఢిల్లీ: ధరించిన గౌనును బట్టి లాయర్లకు గౌరవం లభించదని సుప్రీంకోర్టు పేర్కొంది. 70 మంది లాయర్లకు ఢిల్లీ హైకోర్టు సీనియర్ హోదాను ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌ల ధర్మాసనం ఈ వ్యాఖ్య చేసింది. గౌనును బట్టి వేరుగా గౌరవం దక్కుతుందని తాము భావించడం లేదని పేర్కొంది.
పిటిషన్ వేసిన నెడుంపర అనే లాయర్ వాదనను తోసిపుచ్చుతూ, ‘‘జడ్జిలు కూడా అవసరాన్ని బట్టి రాత్రి దాకా కేసుల విచారణలోనే ఉంటున్నారు. వాళ్లూ మనుషులే. శాయశక్తులా చేయగలిగిందంతా చేస్తున్నారు’’ అని పేర్కొంది. కేసుల సత్వర విచారణకు మరింతమంది జడ్జీల అవసరముందని నెడుంపర తెలపగా ఎక్కువ మంది జడ్జీలను నియమించడం తమ చేతుల్లో లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment