కేటీఆర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు నిర్ణయం
కౌశిక్‌రెడ్డి, వివేకానంద్‌ల పిటిషన్‌కు జత చేసిన జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం
వీరి పిటిషన్ విచారణ సందర్భంగా ఇటీవల ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు
అసెంబ్లీ ముగిసేలోగా నిర్ణయం తీసుకుంటారా? అని ప్రశ్న
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తూ చర్యలు తీసుకునేలా శాసనసభ స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ వినోద్ చంద్రన్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గూడెం మహీపాల్‌రెడ్డి, అరికెపూడి గాందీలపై కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యే హరీశ్‌రావు తదితరులు రిట్ పిటిషన్ దాఖలు చేశారు.
కేటీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది ఆర్య రామసుందరం వాదనలు వినిపించగా.. ఏడుగురు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలన్న ఈ పిటిషన్ ప్రతిని, ప్రతివాది అయిన తెలంగాణ స్పీకర్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీకి అందజేయాలని ధర్మాసనం ఆదేశించింది. బీఆర్‌ఎస్‌ను వీడిన మరో ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి గతంలో దాఖలైన పిటిషన్‌తో కేటీఆర్ పిటిషన్‌ను జత చేసింది. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావ్, దానం నాగేందర్ పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ గతంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్ పిటిషన్ వేశారు. దీనిపై గత శుక్రవారం విచారణ జరిపిన జస్టిస్ గవాయి, జస్టిస్ అగస్టీన్ జార్జి మాసి ధర్మాసనం..తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోకుండా ఆలస్యం చేయడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు.. ‘తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామంటే ఎంత కాలం? అసెంబ్లీ గడువు ముగిసే దశలో నిర్ణయం తీసుకుంటారా?’అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment